ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్‌లోకి అత్యంత శక్తివంతమైన అపాచే అటాక్ హెలీకాఫ్టర్లు

By Anil

పాక్ మరియు చైనాతో ఉన్న భారత సరిహద్దు ప్రాంతాల వద్ద గత కొంత కాలంగా ప్రతికూల వాతావరణం ఉంది. ఇరు దేశాలు కూడా చొరబాటుకు యత్నిస్తూ, కవ్వింపు చర్యలకు పాల్పడతూ భారత సైన్యపు సహనాన్ని పరీక్షిస్తున్నాయి. అయితే శత్రు దేశాల ఎలాంటి దుందుడుకు చర్యలకైనా గట్టి సమధానమివ్వగల సత్తా భారత్ సైన్యానికి ఉంది.

భారత వాయు మరియు మిలిటరీ సైన్యాలు రోజురోజుకీ శక్తివంతంగా మారుతున్నాయి. తాజాగా ఇండియన్ ఆర్మీ కోసం ఆరు శక్తివంతమైన అటాక్ స్క్వాడ్రన్ హెలీకాఫ్టర్ల కొనుగోలు కేంద్రం ఆమోదం తెలిపింది.

ఎయిర్ ఫోర్స్‌లోకి స్క్వాడ్రన్ హెలీకాఫ్టర్లు

ఆర్మీలో కీలక విధులు నిర్వర్తించ గల అత్యంత శక్తివంతమైన ఏహెచ్-64ఇ ఆపాచే హెవీ డ్యూటీ అటాక్ హెలీకాఫ్టర్లు కావాలాని ఆర్మీ ప్రభుత్వాన్ని కోరింది. దీనికి సానుకూలంగా స్పందించిన భారత రక్షణ మంత్రిత్వ శాఖ సుమారుగా ఆరు హెలీకాఫ్టర్లను కొనుగోలు చేయడానికి ఆగష్టు 17 గురువారం నాడు ఉత్వర్వులు జారీ చేసింది.

Recommended Video - Watch Now!
Jeep Compass Launched In India | In Telugu - DriveSpark తెలుగు
ఎయిర్ ఫోర్స్‌లోకి స్క్వాడ్రన్ హెలీకాఫ్టర్లు

రూ. 13,952 కోట్లు విలువ చేసే 22 అటాక్ హెలీకాఫ్టర్లు కావాలని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 2015 లో ప్రభుత్వాన్ని కోరింది. సెప్టెంబర్ 2015 లో ఈ హెలీకాఫ్టర్ల కొనుగోలుకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. వీటి ఆమోదానంతరం ఇండియన్ ఆర్మీ ఆరు ఆపాచే హెవీ డ్యూటీ అటాక్ హెలీకాఫ్టర్లు కావాలాని ప్రభుత్వాన్ని కోరింది.

ఎయిర్ ఫోర్స్‌లోకి స్క్వాడ్రన్ హెలీకాఫ్టర్లు

గగన తలంలో ఎదురయ్యే దాడులను ఎదుర్కోవడానికి కావాల్సిన విమానాలు వైమానిక దళం వద్ద ఉన్నట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పలుమార్లు ప్రకటించింది. అత్యవసరం మరియు ప్రతికూల పరిస్థితులలో ఎదురయ్యే దాడులను ఎదుర్కునేందుకు ఆపాచే హెవీ డ్యూటీ అటాక్ హెలీకాఫ్టర్లు ఎయిర్ ఫోర్స్ వద్ద ఉన్నపుడు ఆర్మీకి వీటి అవసరం లేదని ఐఏఎఫ్ సూచించింది.

ఎయిర్ ఫోర్స్‌లోకి స్క్వాడ్రన్ హెలీకాఫ్టర్లు

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అభ్యర్థన మేరకు 22 ఏహెచ్-64ఇ ఆపాచే అటాక్ హెలీకాఫ్టర్లను కొనుగోలు చేయడానికి అంగీకరించిన కేంద్రం, ఇండియన్ ఆర్మీ కోసం కూడా తమ వారి అభ్యర్థన మేరకు 6 ఏహెచ్-64ఇ ఆపాచే అటాక్ హెలీకాఫ్టర్లను కొనుగోలు చేయడానికి ఉత్తర్వులు మంజూరు చేసింది.

ఎయిర్ ఫోర్స్‌లోకి స్క్వాడ్రన్ హెలీకాఫ్టర్లు

ప్రస్తుతం ఇండియన్ ఆర్మీలో అత్యంత శక్తివంతమైన రెండు అటాక్ యుద్ద హెలీకాఫ్టర్లు విధుల్లో ఉన్నాయి. రష్యా తయారు చేసిన మిల్ ఎమ్ఐ-25 మరియు ఎమ్ఐ-35 అనే స్క్వాడ్రన్ హెలికాఫ్టర్లు ఉన్నాయి. ఎమ్ఐ-25 శ్రేణి హెలికాఫ్టర్లను 1972 లో తయారు చేయడం ప్రారంభించింది. అయితే ఆధునిక సాంకేతికత మరియు పరిజ్ఞానం ఉన్న హెలికాఫ్టర్లను వీటి స్థానంలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఎయిర్ ఫోర్స్‌లోకి స్క్వాడ్రన్ హెలీకాఫ్టర్లు

తాజాగా రక్షణ మంత్రిత్వ శాఖ కొత్త అటాక్ హెలీకాఫ్టర్ల కొనుగోలుకు ఆమోదం తెలిపింది. కాబట్టి అతి త్వరలో నూతన యుద్ద హెలీకాఫ్టర్లు ప్రస్తుతం సైన్యంలో ఉన్న రెండు పాత హెలీకాఫ్టర్ల స్థానాన్ని భర్తీ చేయనున్నాయి. ఈ హెలీకాఫ్టర్ల చేరికతో ఇటు ఆర్మీ అటు వైమానిక దళం తమ బలాన్ని పెంచుకోనున్నాయి.

ఎయిర్ ఫోర్స్‌లోకి స్క్వాడ్రన్ హెలీకాఫ్టర్లు

జూలై 2019లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 22 ఏహెచ్-64ఇ అపాచే అటాక్ హెలీకాఫ్టర్లను డెలివరీ తీసుకోనుంది. ఈ హెలీకాఫ్టర్లు...

  • 812 ఏజిఎమ్-114ఎల్-3 హెల్‌ఫైర్ లాంగ్‌బో మిస్సైళ్లు,
  • 542 ఏజిఎమ్-114ఆర్-3 హెల్‌ఫైర్-II మిస్సైళ్లు,
  • 245 స్టింగర్ బ్లాక్ I-92హెచ్ మిస్సైళ్లు మరియు
  • 12 ఏఎన్/ఏపిజి -78 ఫైర్-కంట్రోల్ రాడర్లను కలిగి ఉన్నాయి.
ఎయిర్ ఫోర్స్‌లోకి స్క్వాడ్రన్ హెలీకాఫ్టర్లు

ఆధునిక కాలంలో అనువుగా దాడి చేయడానికి వీలున్న అత్యంత శక్తివంతమైన అటాక్ హెలీకాఫ్టర్లు ఇవే. అమెరికన్ ఎయిర్ ఫోర్స్ కూడా ఇవే హెలీకాఫ్టర్లను వినియోగిస్తోంది. బారత వైమానిక దళం మొత్తం 22 హెలీకాఫ్టర్లను డెలివరీ తీసుకున్న తరువాత ఇండియన్ ఆర్మీ వెంటనే తమ ఆరు హెలీకాఫ్టర్లను డెలివరీ తీసుకోనుంది.

ఎయిర్ ఫోర్స్‌లోకి స్క్వాడ్రన్ హెలీకాఫ్టర్లు

ఏహెచ్-64ఇ అటాక్ హెలీకాఫ్టర్ గురించి:

ఏహెచ్-64ఇ అటాక్ హెలీకాఫ్టర్లను అమెరికా దిగ్గజ విమానయాన సంస్థ బోయింగ్ తయారు చేస్తోంది. 1975 తొలి ఆవిష్కరించిన వీటిని హ్యుజ్ హెలీకాఫ్టర్ల చేత తయారు చేసింది. ఇప్పటి వరకు బోయింగ్ సుమారుగా 2,000 లకు పైగా ఏహెచ్-64ఎస్ హెలీకాఫ్టర్లను వివిధ జనరేషన్లుగా తయారుచేసింది.

ఎయిర్ ఫోర్స్‌లోకి స్క్వాడ్రన్ హెలీకాఫ్టర్లు

బోయింగ్ తమ ఏహెచ్-64 హెలీకాఫ్టర్లను ఎ, బి, సి, డి తరువాత చివరిగా ఇ శ్రేణి హెలీకాఫ్టర్లను అవిష్కరించింది. ఏహెచ్-64 శ్రేణిలో ఏహెచ్-64ఇ ఆధునిక శ్రేణికి చెందిన హెలీకాఫ్టర్. బోయింగ్ 2014లో ఏహెచ్-64 ఎఫ్ హెలీకాఫ్టర్‌ను అభివృద్ది చేసి, ఆవిష్కరించింది. దీనిని 2040 నాటికి అందుబాటులోకి తీసుకురానుంది.

ఎయిర్ ఫోర్స్‌లోకి స్క్వాడ్రన్ హెలీకాఫ్టర్లు

అంతర్జాతీయ వివాదాలలో ఏహెచ్-64 అపాచే అటాక్ హెలీకాఫ్టర్ కీలక పాత్ర పోషించింది. అమెరికా ఈ హెలీకాఫ్టర్‌ను పనామా, గల్ఫ్ వార్, కొసొవో వార్, ఆఫ్ఘనిస్తాన్ దాడుల్లో మరియు ఇరాకీ యుద్దాలలో వినియోగించింది. ఏ దేశ సైన్యం తరుపు పోరాడినా ఈ హెలీకాఫ్టర్ అత్యుత్తమ పనితీరును కనబరించింది.

ఎయిర్ ఫోర్స్‌లోకి స్క్వాడ్రన్ హెలీకాఫ్టర్లు

అపాచే హెలీకాఫ్టర్‌లో ఉన్న విప్లవాత్మక ఫీచర్ హెల్మెట్ మౌంటెడ్ డిస్ల్పే, ఇది ఇంటిగ్రేటెడ్ మరియు డిస్ల్పే సైటింగ్ సిస్టమ్(IHADSS) లో ఉంటుంది.

ఎయిర్ ఫోర్స్‌లోకి స్క్వాడ్రన్ హెలీకాఫ్టర్లు

పైలట్ లేదా కాల్పులు జరిపే వ్యక్తి హెలీకాఫ్టర్‌లోని 30ఎమ్ఎమ్ ఆటోమేటిక్ ఎమ్320 చైన్ గన్ ద్వారా కాల్పులు జరపవచ్చు. వీరు చేయాల్సిందల్లా కాల్పు జరపాల్సిన గురిని డిసైడ్ చేయడం. మరియు ఇందులో అత్యాధునిక నైట్ విజన్ వ్యవస్థ ఉంది.

ఎయిర్ ఫోర్స్‌లోకి స్క్వాడ్రన్ హెలీకాఫ్టర్లు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

హెలీకాఫ్టర్లలో వచ్చే అత్యాధునిక సాంకేతిక ఫీచర్లకు ముగింపు ఉండదు. అయితే భారత సైనిక దళానికి ఇలాంటి అత్యాధునిక హెలీకాఫ్టర్ల అవసరం చాలా ఉంది. భారత త్రివిధ దళాలు మరింత శక్తివంతంగా మారడంలో వీటి చేరిక కీలకం.

Most Read Articles

English summary
Read In Telugu: Indian Army Receives Approval To Purchase AH-64E Apache Attack Helicopters | Apache Details
Story first published: Saturday, August 19, 2017, 14:08 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Drivespark sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Drivespark website. However, you can change your cookie settings at any time. Learn more