ఈ వాహనాన్ని టాటా తయారు చేసిందంటే నమ్ముతారా? దీనిని ఎందుకు ఉపయోగిస్తారంటే..

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) సౌకర్యవంతమైన ప్యాసింజర్ కార్లను మాత్రమే కాకుండా సైన్యం ఉపయోగించే అధునాతన సాయుధ వాహనాలను కూడా తయారు చేస్తుంది. ఈ ఫొటోలలో కనిపిస్తున్న వాహనం అలాంటి అత్యాధునిక సాయుధ వాహనాలలో ఒకటి. దీనిని QRFV (క్విక్ రియాక్షన్ ఫైటింగ్ వెహికల్) అని పిలుస్తారు. టాటా మోటార్స్ తయారు చేసిన ఈ ఆర్మీ వెహికల్ ను సైన్యంలో దేనికి ఉపయోగిస్తారు? ఇందులోని విశేషాలు ఏమిటి? తదితర వివరాలను ఈ కథనంలో చూద్దాం రండి.

ఈ వాహనాన్ని టాటా తయారు చేసిందంటే నమ్ముతారా? దీనిని ఎందుకు ఉపయోగిస్తారంటే..

ఏ దేశానికి సైన్యం అనేది చాలా అవసరం. ఇతర దేశాలు చేసే దాడిని సమర్థవంతంగా ఎదుర్కునేందుకు మరియు దేశ సరిహద్దులను కాపాడేందుకు సైన్యం ప్రయత్నిస్తుంది. అలాంటి సైన్యానికి అధునాతనమైన మరియు అత్యంత సురక్షితమైన వాహనాలు ఎంతో అవసరం. ఈ అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని టాటా మోటార్స్ ఈ క్యూఎర్ఎఫ్‌వి రూపొందించింది. పేరుకి తగినట్లుగానే, ఈ వాహనాలు అత్యవసర పరిస్థితుల్లో చాలా వేగంగా స్పందించి, శత్రువులతో పోరాడేందుకు సైన్యానికి సహకరిస్తుంది.

ఈ వాహనాన్ని టాటా తయారు చేసిందంటే నమ్ముతారా? దీనిని ఎందుకు ఉపయోగిస్తారంటే..

ప్రస్తుతం అమెరికా, చైనా, రష్యా వంటి దేశాల బలమైన సైన్యాలను మరియు ఆయుధాలను కలిగి ఉన్నాయి. ఈ దేశాలకు ఏమాత్రం తీసిపోకుండా భారత సైన్యం కూడా తన బలాన్ని పెంచుకునేందుకు గట్టిగానే కృషి చేస్తోంది. నానాటికి అభివృద్ది చెందుతున్న సాంకేతికత దేశ సైన్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది. భారత సైన్యం ఇప్పటికే ప్రపంచ స్థాయి సాంకేతికతను ఉపయోగిస్తోంది. తాజాగా, భారత సైన్యం ఉపయోగించే వాహనాలను తయారు చేయడానికి టాటా మోటార్స్ తో భారత సైన్యం ఓ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

ఈ వాహనాన్ని టాటా తయారు చేసిందంటే నమ్ముతారా? దీనిని ఎందుకు ఉపయోగిస్తారంటే..

ఈ ఒప్పందం ప్రకారం, ఇండియన్ ఆర్మీకి అవసరమైన వాహనాలను టాటా మోటార్స్ తయారు చేసి, భారత సైన్యానికి సరఫరా చేస్తుంది. ఇందుకోసం టాటా గ్రూప్, టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్ అనే కంపెనీని ఏర్పాటు చేసి, దాని ద్వారా ఈ స్పెషల్ ఆర్మీ వాహనాలను తయారు చేస్తోంది. టాటా మోటార్స్ సంస్థకు ఇప్పటికే వివిధ రకాల వాణిజ్య వాహనాల తయారీలో చేయి తిరిగిన అనుభవం ఉంది. ఈ ప్రత్యేక కంపెనీని ఏర్పాటు చేయడం ద్వారా టాటా మోటార్స్ సైనిక వాహనాలను కూడా తయారు చేస్తోంది.

ఈ వాహనాన్ని టాటా తయారు చేసిందంటే నమ్ముతారా? దీనిని ఎందుకు ఉపయోగిస్తారంటే..

సైనిక వాహనాలకు సంబంధించిన అన్ని అంశాలు అత్యంత గోప్యంగా ఉంచబడుతాయి కాబట్టి, మరే ఇతర కంపెనీతోనూ సంబంధం లేకుండా టాటా మోటార్స్ ఒంటరిగానే ఈ పని చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా, ఇటీవల టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ భారత సైన్యం కోసం తయారు చేసిన QRFV వాహనాలను పంపిణీ చేసింది. ఈ QRFV (క్విక్ రియాక్షన్ ఫైటింగ్ వెహికల్-మీడియం) సైనికులను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి త్వరగా రవాణా చేయడానికి ఉపయోగించబడుతాయి.

ఈ వాహనాన్ని టాటా తయారు చేసిందంటే నమ్ముతారా? దీనిని ఎందుకు ఉపయోగిస్తారంటే..

ఈ వాహనంలో సైన్యం కోసం అనేక ఫీచర్లు ఉంటాయి. ఈ వాహనం 4X4 టెక్నాలజీతో నడుస్తుంది, కాబట్టి ఎలాంటి రోడ్డు పరిస్థితుల్లోనైనా ఇది సునాయాసంగా ముందుకు సాగిపోతుంది. ఈ వాహనంలో ఒకేసారి 12-14 మంది సైనికులు ప్రయాణించవచ్చు. ఈ వాహనంలో సుమారు 240 హెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేసే పవర్‌ఫుల్ ఇంజన్ ఉంటుంది. సైనికులతో కలిపి, ఈ వాహనం సుమారు 2 టన్నుల బరువున్న వస్తువులను కూడా రవాణా చేయగలదు. ఈ వాహనం యొక్క ప్రధాన ఫీచర్ ఏంటంటే, యుద్ధ ట్యాంక్ ల మాదిరిగా ఈ వాహనం మధ్యలో ఓ చిన్న వీక్షణ ప్రాంతం ఉంటుంది. దీని సాయంతో వాహనం చుట్టూ 360 డిగ్రీలు చూడవచ్చు.

ఈ వాహనాన్ని టాటా తయారు చేసిందంటే నమ్ముతారా? దీనిని ఎందుకు ఉపయోగిస్తారంటే..

ఈ వాహనం యొక్క టైర్లు రన్ ఫ్లాట్ టైర్లుగా సెట్ చేయబడ్డాయి. అంటే వాహనం కదులుతున్నప్పుడు టైరు పంక్చర్ అయినప్పటికీ, వాహనం ముందుకు నడుస్తుంది. కాబట్టి శత్రువులు ఈ వాహనంపై దాడి చేసినా ఆ ప్రదేశం నుంచి సులువుగా తప్పించుకునే విధంగా దీన్ని రూపొందించారు. సైన్యంలో సమస్య ఉన్న చోటికి త్వరగా సైనికులను తీసుకెళ్లేందుకు ఈ వాహనం ఉపయోగపడుతుంది. ముఖ్యమైన వ్యక్తులు, వీఐపీలు, దేశాధినేతలు మొదలైన వారు మిలిటరీ ఎస్కార్ట్‌తో థ్రెట్ ఉన్న ప్రాంతానికి వచ్చినప్పుడు వారిని ఎస్కార్ట్ చేయడానికి కూడా ఈ వాహనాన్ని సైన్యం ఉపయోగించవచ్చు.

ఈ వాహనాన్ని టాటా తయారు చేసిందంటే నమ్ముతారా? దీనిని ఎందుకు ఉపయోగిస్తారంటే..

వాహనం మధ్యలో ఉన్న ఈ టాప్ వ్యూ ప్రాంతం ఆయుధాలను అమర్చడానికి మరియు శత్రువులపై దాడి చేయడానికి కూడా సౌకర్యంగా ఉంటుంది. ఇది బుల్లెట్ ప్రూఫ్ వాహనం కాబట్టి, ఈ వాహనంపై శత్రువులు తుపాకీతో దాడి చేసినా ఎటువంటి హాని జరగదు. వాహనం పేలుడు పదార్థాల నుండి లెవల్ 4 రక్షణను కలిగి ఉన్నట్లు సమాచారం. అంటే, సుమారు 14-21 కిలోల పేలుడు పదార్థాలు పేలినా ఈ వాహనం చలించదు.

ఈ వాహనాన్ని టాటా తయారు చేసిందంటే నమ్ముతారా? దీనిని ఎందుకు ఉపయోగిస్తారంటే..

ఈ QRFV (Quick Reaction Fighting Vehicle- Medium) వాహనం గురించి పైన తెలిపిన సమాచారం అంతా సాధారణమైనది. ఈ సమాచారం పబ్లిక్ డొమైన్‌లో అందుబాటులో లేదు. ఇది చాలా సున్నితమైన సమాచారం కాబట్టి, ఈ సమాచారం అంతా సైన్యం వద్ద మాత్రమే గోప్యంగా ఉంచబడుతుంది. బాహ్య రూపాన్ని మరియు పబ్లిక్‌గా అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా పైన ఉన్న వాహనం యొక్క లక్షణాలు పేర్కొనబడ్డాయని గమనించగలరు. మరిన్ని ఆసక్తికర విషయాల కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Indian army received new qrfv vehicles from tata advanced systems know full details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X