ఈ ఒక్క కారు చాలు మొత్తం పాకిస్తాన్‌ను భయపెట్టడానికి! అంత స్పెషల్‌గా దీనిలో ఏముందో తెలుసా?
భారత్-పాక్ మధ్య ప్రస్తుతం భయంకరమైన యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం అందరికి తెలిసిందే. పహల్గామ్ ఉగ్రవాద దాడి తరువాత పాక్‌లో తలదాచుకున్న ఉగ్రవాదులను అంతం చేయడమే లక్ష్యంగా భారత్ సైనిక చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తుంది. ఇలాంటి సమయంలో ఇండియా మిలిటరీ శక్తి సామర్థ్యాల గురించి సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో భారత సైన్యం ఇటీవల దాదాపు 3,000 ఫోర్స్ గూర్ఖా వాహనాలను కొనుగోలు చేసిన విషయంపై కూడా మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుత భద్రతా పరిస్థితుల నేపథ్యంలో ఫోర్స్ గూర్ఖా వాహనాలు భారత సైన్యానికి దాడులకు సంబంధించి రవాణకు బాగా ఉపయోగపడుతున్నాయి. హల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత సైనిక కార్యకలాపాలలో ఈ వాహనం కీలక పాత్ర పోషించింది.
కొండలు, లోయలు, మట్టిబొంతలు, మంచుతో నిండిన దారుల గుండా కూడా ఫోర్స్ గూర్ఖా వాహనాలు ఈజీగా దూసుకుపోతాయి. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని భారత సైన్యం 'ఆపరేషన్ సింధూర్'ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ ఆపరేషన్ క్రమంలో, దుర్భేద్యమైన మార్గాల్లో సైనికుల రవాణా కోసం గూర్ఖా వాహనాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. సైనిక చర్యలు ముమ్మరంగా సాగుతున్న వేళ ఇవి మన సైన్యానికి బలంగా సహయపడుతున్నాయి.

ఎలాంటి వాతావరణ పరిస్థితులు అయిన తట్టుకునే విధంగా ఫోర్స్ గూర్ఖాను రూపొందించారు. ఇలాంటి యుద్ద పరిస్ధితుల్లో ఆర్మీకి తోడ్పాటు అందించేలా వారికి కంపెనీ ప్రత్యేకంగా తయారు చేసిన వాటిని అందించింది. ఇప్పుడు ఈ వాహనం శక్తి, సామర్థ్యాల గురించి ప్రత్యేకంగా చర్చించుకోవాలి. ఏ ప్రాంతమైనా, ఫోర్స్ గూర్ఖా తక్కువలో తక్కువ ఇబ్బందితో సాగే సామర్థ్యం కలిగి ఉంది.ప్రత్యేకించి సరిహద్దుల్లో, నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో నిర్వహించే ఆపరేషన్ల కోసం వాడుతారు.
ఈ కారణంగానే, దేశ భద్రతను కాపాడే సైనికులకు ఇది ఒక విశ్వసనీయ సహాయకుడిగా మారింది. తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించగలగడం, మారుమూల ప్రాంతాల్లో కూడా అదే స్థాయిలో పనితీరు ఇవ్వగలగడం ఈ వాహనానికి ఉన్న ప్రత్యేక అంశాలు. ఈ వాహనానికి 233 మిల్లీమీటర్ల గ్రమంగా గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. దీంతో రాళ్లు, మట్టిబొంతలు, అగాధ గుంతలు ఎదురయ్యినప్పటికీ కూడా వాటిపై నుంచి ఈజీగా దూసుకపోతుంది.

సైనిక రవాణా తీరును దృష్టిలో ఉంచుకుని సుమారు 700 మిల్లీమీటర్ల లోతు వరకు నీటిని దాటగల సామర్థ్యంతో దీన్ని తయారుచేశారు. ఇది దాదాపు ఓ నది ప్రవాహాన్ని కూడా చీల్చుకుంటూ వెళ్లగలదు. ఈ వాహనంలో ఎయిర్ ఇన్‌టేక్ స్నార్కెల్ ఉంది, ఇది ఇంజన్‌కి స్వచ్చమైన గాలిని అందించడమే కాకుండా, నీరు లోపలికి ప్రవేశించకుండా నిరోధించి, ఆఫ్-రోడ్ లేదా వరద ప్రాంతాల్లోనూ సాఫీ ప్రయాణాన్ని అందిస్తుంది.
దీని ఇంజిన్ విషయానికి వస్తే, 2.6-లీటర్ టర్బోచార్జ్డ్ ఇంటర్‌కూల్డ్ డీజిల్ ఇంజిన్, 140 PS పవర్, 320 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఏ క్లిష్టమైన భూభాగాన్నైనా ఎదుర్కొనే సామర్థ్యాన్ని అందిస్తుంది, అది కాశ్మీర్ ప్రాంతమైనా, గడ్డకట్టే లడఖ్ పర్వతమైనా. 4x4 డ్రైవ్ వ్యవస్థ వలన వేగంగా దూసుకుపోగలదు. వాస్తవానికి, ఈ వాహనం అత్యుత్తమ 4x4 ఎలక్ట్రానిక్ షిఫ్ట్ టెక్నాలజీతో కూడి ఉంది.

ఇది డ్రైవర్‌కు 2H, 4H, 4L (ఫోర్ వీల్ లో) మోడ్‌ల మధ్య వేగంగా మార్పులు చేయగల సౌలభ్యాన్ని అందిస్తుంది. దీంతో వాహనాన్ని మారుమూల భూభాగాల్లోనూ, మారుతున్న వాతావరణ పరిస్థితుల్లోనూ సమర్థంగా నడిపించవచ్చు. ఇది 5.50 మీటర్ల టర్నింగ్ రేడియస్ కూడా కలిగి ఉంది. దీంతో గుట్టల మధ్య తిరుగుతూ , గుజ్జు బురద గల మార్గాల్లో, మడతపడ్డ ఇసుక ప్రదేశాల్లో, లేదా కొండల దిగువలలో కంట్రోలింగ్‌తో కదులుతుంది.


Click it and Unblock the Notifications








