ఇండియన్ ఆర్మీ వాహనాలపై నెంబర్‌ప్లేట్ల మీద ఉన్న పదాల అర్థం ఏమిటి?

By N Kumar

ఇండియాలో వివిధ రకాల నెంబర్‌ ప్లేట్లు వినియోగంలో ఉన్నాయి. వాహనాలను వినియోగించే అవసరాలను బట్టి, విధానాన్ని బట్టి ఇండియాలో ఉన్న వాహన సముదాయాన్ని నెంబర్ ప్లేట్ల ద్వారా వివిద రకాలుగా విభజించడం జరిగింది. దీనికి సంభందించి ఇది వరకే డ్రైవ్‌స్పార్క్ తెలుగు ప్రత్యేక కథనం అందించింది.
Also Read: ఇండియన్ ఆర్మీ ఇప్పటికీ మారుతి జిప్సీలనే వినియోగిస్తోంది కారణం ఏమిటి ?
అయితే ఇప్పడు ఇండియాలో ఉన్న మరే ఇతర వాహనాల యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్‌తో సరిపోలని విధంగా ఉండే ఇండియన్ ఆర్మీ వాహనాల యొక్క నెంబర్ ప్లేట్ ఎంతో విభిన్నంగా ఉంటుంది. ఈ నెంబర్‌ ప్లేటులో వివిధ రకాల పదాల వెనకున్న ఆంతర్యం గురించి క్రింది కథనంలో...

ఇండియన్ ఆర్మీ వెహికల్ రిజిస్ట్రేషన్ ప్లేట్ అర్థం ఏమిటి ?

బ్రిటీష్ మరియు చాలా ఇతర దేశాలు తమ మిలిటరీ విభాగంలో ఉన్న వాహనాలకు ఇలాంటి నెంబర్‌ను కేటాయిస్తారు. అందులో ఇండియా కూడా ఒకటి. ఇండియన్ ఆర్మీలో ఉన్న విభిన్న వాహనాలకు ఇలాంటి వాహన రిజిస్ట్రేషన్ నెంబర్ కేటాయిస్తారు. తరువాత స్లైడర్ల ద్వారా నెంబర్ ప్లేటులోని వివిధ పదాల గురించి తెలుసుకుందాం.

 1. పై వైపును సూచించే బాణం గుర్తు

1. పై వైపును సూచించే బాణం గుర్తు

ఇండియన్ ఆర్మీ లేదా డిఫెన్స్‌లో ఉన్న వాహనాల నెంబర్ ప్లేటు మీద మొదిటి స్థానంలో లేదా మూడవ స్థానంలో పై వైపును సూచించే బాణం గుర్తు ఖచ్చితంగా ఉంటుంది. ఇలాంటి గుర్తున్న వాహనాలు నిర్భందం ఉన్న మరియు అనుమతి లేని చోటకు కూడా వెళ్లవచ్చు.

2. రిజిస్ట్రేషన్ జరిగిన సంవత్సరం (03)

2. రిజిస్ట్రేషన్ జరిగిన సంవత్సరం (03)

ప్రక్కన గల ఫోటోలో ఎర్రటి బాక్స్‌లో ఉన్న నెంబర్‌ రిజిస్ట్రేషన్ జరిగిన ఏడాదిని సూచిస్తుంది.

3. డి (D)

3. డి (D)

డిఫెన్స్ వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్‌లో ఏడాదిని సూచించే నెంబర్ తరువాత గల ఆంగ్లపు అక్షరం, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఉన్న నగరాన్ని సూచిస్తుంది. ప్రక్కన గల ఫోటోలో ఎర్రటి బాక్స్‌లో ఉన్న ఆంగ్లపు డి అనగా ఢిల్లీ అని అర్థం.

4. 153874

4. 153874

ఆంగ్లపు డి అక్షరం తరువాత ఉన్న నెంబర్ 153874 అనేది డిఫెన్స్ విభాగంలో ఆ వాహనం యొక్క సీరియల్ నెంబరుగా కేటాయిస్తారు.

5. డబ్ల్యూ (W)

5. డబ్ల్యూ (W)

డిఫెన్స్ వాహన రిజిస్ట్రేషన్ నెంబర్‌లో సీరియల్ నెంబర్ తరువాత ఉన్న ఆంగ్లపు అక్షరం (W) ఆ వాహనం యొక్క శ్రేణిని సూచిస్తుంది.

ఇండియన్ ఆర్మీ వెహికల్ రిజిస్ట్రేషన్ ప్లేట్ అర్థం ఏమిటి ?

ఇండియాలో వాడుకలో ఉన్న వివిధ రకాల నెంబర్ ప్లేట్లు మరియు ఎందుకు అలాంటి వాటిని వినియోగిస్తున్నాం మరియు వాటి వెనకున్న అసలు రీజన్ ఏమిటి ?

Most Read Articles

English summary
Indian Army Vehicle Registration Plates Meaning
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X