War Tanker నడిరోడ్డుపై ఆర్మీ యుద్ధ ట్యాంకర్..ఆందోళన చెందిన జనం.. అసలేం జరిగిందంటే,..!
ఆర్మీకి చెందిన వాహనాలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించిన వీడియోలను గతంలో చాలా సందర్భాల్లో చూశాం. సైన్యానికి చెందిన వివిధ యుద్ధ నౌకలను, ఇతర భాగాలను భారీ కాన్వాయ్‌ని ఉపయోగించి ఆర్మీ తరలిస్తుంది. అలానే సిబ్బంది, పరికరాలు ఇతర అవసరమైన వస్తువులను బదిలీ చేయడానికి భారీ వాహనాలను ఉపయోగిస్తారు.
ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతంలోని ఆర్మీ స్థావరాలకు వీటిని తరలించడం కోసం రోడ్డు మార్గం ద్వారా భారీ వాహనాలతో తరలిస్తారు. అధిక బరువు కలిగిన వాటిని ఎక్కువ దూరం పంపాలంటే మాత్రం ఇండియన్ ఆర్మీ రైలు మార్గాన్ని ఉపయోగిస్తుంది. అయితే తాజాగా రద్దీగా ఉండే హైవేపై పాడుబడిన ఇండియన్ ఆర్మీ ట్యాంకర్ దర్శనమిచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

హరియాణాలోని కుండ్లి-మనేసర్-పల్వాల్ (కేఎంపీ) ఎక్స్ప్రెస్ వేపై ఈ ట్యాంక్ దర్శనమిచ్చింది. ఆకస్మత్తుగా ఎక్స్‌ప్రెస్ వేపై ట్యాంక్ ఎలా వచ్చిందా అని వాహనదారులు ఆశ్చర్య పోతున్నారు. నరేంద్ర యాదవ్ అనే వ్యక్తి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను పోస్ట్ చేశాడు. నిత్యం వేలాది వాహనాలకు రాకపోకలు సాగించే ఈ హైవేపై ఆర్మీ ట్యాంకును చూసిన నరేంద్ర యాదవ్ వీడియో తీశాడు.
నిత్యం రద్దీగా ఉంటే ఈ రహదారిపై ట్యాంక్ పడిపోయింది. అయితే ట్యాంక్ మరో లేన్‌లో ఉండటంతో దాని పక్క లేన్ నుంచి వాహనాలు వెళ్తున్న విజువల్స్ వీడియోలో చూడవచ్చు. వీడియో రికార్డ్ చేసిన వ్యక్తి ఏమి జరుగుతుందో చూడటానికి ట్యాంక్ దగ్గరకు వెళ్లి పరిశీలిస్తాడు. వీడియో రికార్డ్ చేసిన వ్యక్తి తన స్నేహితుడితో మాట్లాడుతున్న సంభాషణ కూడా రికార్డు అయ్యింది.
అయితే ఈ ట్యాంకుకు సమీపంలో ఆర్మీ అధికారులు, సిబ్బంది ఎవరూ లేకపోవడంతో మరింత అనుమానాస్పదంగా కనిపించింది. ట్యాంక్ ముందు దాని ధ్వంసమైన గుర్తులు, రోడ్డు స్వల్పంగా దెబ్బతిన్న విజువల్స్ చూడవచ్చు. అయితే ప్రమాదం జరిగిందా లేక దీనిని తరలించే వాహనంలో ఏదైనా సాంకేతిక లోపంతో ఇక్కడి వదిలి వెళ్లారా అనే ప్రశ్నలు మొదలయ్యాయి.
అయితే ఈ ట్యాంకును తరలిస్తుండగా ట్రక్కు నుంచి కిందపడి ఉండొచ్చని వారు అంచనాకు వచ్చారు. ఒకవేళ ట్రక్కు నుంచి కింద పడిపోయినా. అంబాలా నుంచి చెన్నైకి ఆర్మీ ట్యాంకులతో వెళ్తున్న ట్రక్కు కేఎంపీ ఎక్స్‌ప్రెస్ వే మీదుగా వెళ్తున్నట్లు తెలిసింది. ట్రక్కు అసౌదా టోల్ ప్లాజా సమీపంలో ఉండగా ట్రక్కు ప్రమాదానికి గురవ్వడంతో ట్రక్కు కింద పడిపోయినట్లు దీనిని ఆర్మీ ధృవీకరించింది.
అయితే ఈ ప్రమాందలో ఎవరికీ గాయాలు కాలేదు. రోడ్డుపై ట్యాంకు ఎక్కువ స్థలాన్ని ఆక్రమించడంతో కొద్దిసేపు రద్దీ ఏర్పడింది. ప్రమాదం జరిగిన వెంటనే అసువాడ పోలీస్ స్టేషన్ కు చెందిన అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరుక్కుపోయిన ఆర్మీ ట్యాంకును తరలించారు.
యూజర్ పోస్ట్ చేసిన వీడియో కింద పలు కామెంట్లు రాగా, కొన్ని ఫన్నీగా ఉన్నాయి. నరేంద్ర యాదవ్ షేర్ చేసిన వీడియోలో 'భారత్లో మాత్రమే ఇలాంటివి జరిగుతాయని' కొందరు వ్యగ్యంగా స్పందించారు. మరి కొంతమంది వినియోగదారులు ఈ సంఘటనను వీడియో గేమ్‌తో పోల్చారు. ఎవరో కోడ్ పరిబాషలో ఇక్కడి వదిలి వెళ్లమని చెప్పి ఉంటారని కామెంట్ చేశారు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








