బ్రేకింగ్ న్యూస్; ఆటో ఎక్స్‌పో 2022 ఎడిషన్‌కు బ్రేక్.. కారణం ఇదే

చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలను ప్రభావితం చేసింది. ఈ మహమ్మారి వల్ల ఎంతో మంది మరణించారు. చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలలో కూడా లోటు ఏర్పడింది. కరోనా వైరస్ యొక్క ఫస్ట్ వేవ్ మరియు సెకండ్ వేవ్ కారణంగా ఊహకు అందని నష్టాలు వాటిల్లాయి. ఇప్పుడు థర్డ్ వేవ్ ప్రభావం మొదలైంది. ఇది ప్రజలపైన మునుపటికంటే కూడా ఎక్కువ ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.

బ్రేకింగ్ న్యూస్; ఆటో ఎక్స్‌పో 2022 ఎడిషన్ వాయిదా.. కారణం ఇదే

ఇదిలా ఉండగా 2022 లో జరగనున్న ఆటో ఎక్స్‌పో కూడా వాయిదా పడింది. కోవిడ్-19 కారణంగా ఆసియాలో అతిపెద్ద ఆటో షోలలో ఒకటైన ఆటో ఎక్స్‌పో యొక్క 2022 ఎడిషన్‌ను వాయిదా వేస్తున్నట్లు భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ మరియు సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ తయారీదారుల సంఘం ప్రకటించింది.

బ్రేకింగ్ న్యూస్; ఆటో ఎక్స్‌పో 2022 ఎడిషన్ వాయిదా.. కారణం ఇదే

ప్రస్తుతం విజృంభిస్తున్న కరోనా తీవ్రతను దృష్టిలో ఉచుకుని, గ్లోబల్ ఆటో షోల OICA క్యాలెండర్‌కి అనుగుణంగా, ఈ ఏడాది చివర్లో మోటార్ షో తదుపరి ఎడిషన్ యొక్క ఖచ్చితమైన తేదీని ప్రకటించనున్నట్లు 'సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్' ప్రకటించింది.

బ్రేకింగ్ న్యూస్; ఆటో ఎక్స్‌పో 2022 ఎడిషన్ వాయిదా.. కారణం ఇదే

మోటార్ షో 2022 గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్‌పో మార్ట్‌లో 2022 ఫిబ్రవరి 2 నుంచి 9 వరకు జరగాల్సి ఉంది. అయితే కరోనా నుంచి ఎగ్జిబిటర్‌లను, సందర్శకులను మరియు వాటాదారులందరి భద్రతను దృష్టిలో ఉంచుకుని దీనిని వాయిదా వేయడం జరిగింది. ఇందులో అందరి భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఉందని సియామ్ తెలిపింది.

బ్రేకింగ్ న్యూస్; ఆటో ఎక్స్‌పో 2022 ఎడిషన్ వాయిదా.. కారణం ఇదే

సాధారణంగా మోటార్ షో యొక్క ఆటో ఎక్స్‌పో అనేది రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే కార్యక్రమం. 2020 లో జరిగిన మోటార్ షో చివరి ఎడిషన్ కూడా ఈ మహమ్మారి వ్యాప్తితో ప్రభావితమైంది. చాలా మంది ఆటో తయారీదారులు ఈవెంట్‌లో పాల్గొనలేకపోయారు.

బ్రేకింగ్ న్యూస్; ఆటో ఎక్స్‌పో 2022 ఎడిషన్ వాయిదా.. కారణం ఇదే

అయితే తర్వాత జరిగే ఆటో షోలో పాల్గొనటానికి సన్నద్ధమయ్యారు. కానీ ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రభవం వల్ల అది కూడా కాస్త వాయిదా పడింది. ఇందులో చాలా బ్రాండ్లు తమ భవిష్యత్ కార్లు మరియు కాన్సెప్ట్ మోడళ్లను ప్రదర్శించడానికి ద్వైవార్షిక ఈవెంట్‌ని చూస్తున్నాయి.

బ్రేకింగ్ న్యూస్; ఆటో ఎక్స్‌పో 2022 ఎడిషన్ వాయిదా.. కారణం ఇదే

ఇందులో ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్, ఎంఎస్‌ఐఎల్, హ్యుందాయ్, కియా మోటార్స్ వంటి ఎన్నో కంపెనీలు తమ ముఖ్యమైన ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శించాల్సి ఉంది. అయితే వీటికి ప్రస్తుతం నిరాశ ఎదురైయింది. అయితే తరువాత ఈ ఆటో షో గురించి అధికారిక సమాచారం ఇప్పటికి అందుబాటులో లేదు. దీని గురించిన సమాచారం త్వరలో ప్రకటించబడుతుంది.

బ్రేకింగ్ న్యూస్; ఆటో ఎక్స్‌పో 2022 ఎడిషన్ వాయిదా.. కారణం ఇదే

గత 2020 లో జరిగిన ఆటో షోలో అనేక కొత్త ఉత్పత్తులు ఆవిష్కరించబడ్డాయి. అయితే ఇక రాబోయే ఆటో ఎక్స్‌పో మరిన్ని కొత్త ఉత్పత్తులు అడుగుపెట్టే అవకాశం ఉంది. అయితే సియామ్ ప్రకటన తర్వాత దీనికి ఒక మార్గం ఏర్పడుతుంది.

Most Read Articles

English summary
2022 Auto Expo Postponed. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X