గౌతమ్ సింఘానియా గ్యారేజిలో చేరిన కొత్త సూపర్ కారు ఇదే!.. ధర ఎంతంటే?
ఖరీదైన కార్ల మీద ఎక్కువ ఆసక్తి కలిగిన రేమండ్ గ్రూప్ ఛైర్మన్ 'గౌతమ్ సింఘానియా' ఇటీవల కోట్ల విలువ చేసే అద్భుతమైన కారును కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం.
భారతీయ బిలియనీర్ గౌతమ్ సింఘానియా కొనుగోలు చేసిన కారు 'మెక్‌లారెన్ 750ఎస్' (Mclaren 750S). ఇప్పటికే అనేక అన్యదేశ్య కార్లను కలిగి ఉన్న సింఘానియా ఇప్పుడు ఈ కారులో కనిపించరు. ఇప్పటికే ఈయన గ్యారేజిలో రెండు మెక్‌లారెన్ కార్లు ఉన్నాయి. కాగా ఇప్పుడు ఇది మూడో కారు కావడం గమనార్హం. దీని ధర సుమారు రూ. 6 కోట్లు వరకు ఉంటుందని సమాచారం.

గౌతమ్ సింఘానియా.. మెక్‌లారెన్ 750ఎస్ కారులో ప్రయాణించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో ముంబైలోని రద్దీగా ఉండే రోడ్డుపై సింఘానియా ఈ సూపర్‌కార్‌ను నడుపుతున్నట్లు చూడవచ్చు. ఈ కారు ఆరంజ్ అండ్ బ్లాక్ డ్యూయెల్ కలర్ షేడ్‌లో చాలా ఆకర్షణీయంగా ఉంది. కారు లోపలి భాగం నలుపు రంగులో ఉండటం చూడవచ్చు. ఈ కారును స్వయంగా సింఘానియా డ్రైవ్ చేస్తున్నారు.
భారతదేశంలో మెక్‌లారెన్ సూపర్ కార్లను విక్రయించడానికి కంపెనీ ముంబైలో ఫిజికల్ డీలర్‌షిప్‌ను ఓపెన్ చేసారు. ఇక్క కంపెనీ కార్లను చూడవచ్చు. మెక్‌లారెన్ 750ఎస్ అనేది గత ఏడాది ప్రారంభంలో దేశీయ మార్కెట్లో లాంచ్ అయింది. అద్భుతమైన డిజైన్ కలిగిన ఈ కారు కొత్త ఫ్రంట్ బంపర్, పెద్ద స్ప్లిటర్, ఎయిర్ ఇన్‌టేక్‌లు, సన్నగా కనిపించే ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ వంటివి పొందుతుంది. ఇది 720ఎస్ కారు కంటే కొంత పెద్దదిగా ఉంటుంది.

మెక్‌లారెన్ 750ఎస్ కారు బటర్‌ఫ్లై డోర్లను పొందుతుంది. ఇందులో ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 8.0 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్ వంటివి ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి. డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా మాత్రమే కాకుండా ఇది అత్యత్తమ పనితీరును అందిస్తుంది. కాబట్టి ఎక్కువమంది ధనవంతులు ఈ కార్లను గోనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు.
మెక్‌లారెన్ 750ఎస్ ఇంజిన్ విషయానికి వస్తే.. ఇది 4.0-లీటర్ ట్విన్ టర్బో ప్లాట్ ప్లేన్ వీ8 ఇంజిన్ పొందుతుంది. ఇది గరిష్టంగా 750 పీఎస్ పవర్ మరియు 800 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ సూపర్ కారు 720ఎస్ మోడల్ కంటే తేలికగా ఉంటుంది. ఇది కేవలం 2.8 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ, 4.4 సెకన్లలో గంటకు 200 కిమీ వరకు వేగవతం అవుతుంది.
మెక్‌లారెన్ 750ఎస్ కారు మాత్రమే కాకుండా సింఘానియా గ్యారేజిలో 720ఎస్ కారు కూడా ఉంది. ఈ కారు దుబాయ్‌లో రిజిస్టర్ చేయబడింది. ఈ సూపర్ కారు కేవలం 4.0-లీటర్ వీ8 పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 710 Bhp పవర్ మరియు 770 Nm టార్క్ అందిస్తుంది. ఇది 2.8 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 300కిమీ.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








