10 కంటే ఎక్కువ రోల్స్ రాయిస్ కార్లు కలిగి ఉన్న బిలీనియర్ : అతని కార్ల వివరాలు

ప్రపంచ మార్కెట్లో రోల్స్ రాయిస్ అనేది అత్యంత ఖరీదైన లగ్జరీ కార్. ఈ కార్లను అతి తక్కువమంది వ్యక్తులు మాత్రమే కలిగి ఉంటారు. ఎందుకంటే ఇవి చాలా ఖరీదైనవి, కాబట్టి ధనవంతులు మాత్రమే ఇటువంటి లగ్జరీ కార్లను కలిగి ఉంటారు. ఇంతటి ఖరీదైన కార్లు ఒకటి ఉంటేనే వారు ఎంత ధనవంతుల్లో అనుకుంటాం.. కానీ అలంటి రోల్స్ రాయిస్ కార్లు పదికంటే ఎక్కువ ఉంటే, నిజమేనండి దుబాయ్ లో నివసిస్తున్న 29 ఏళ్ల భారతీయుడైన పీయూష్ నగర్ 10 కంటే ఎక్కువ రోల్స్ రాయిస్ కార్లు, ఇవి మాత్రమే కాకుండా అత్యంత విలాసవంతమైన ఇతర కార్లను కలిగి ఉన్నాడు.

10 కంటే ఎక్కువ రోల్స్ రాయిస్ కార్లు కలిగి ఉన్న బిలీనియర్ : అతని కార్ల వివరాలు

పీయూష్ నగర్ అనే 29 ఏళ్ల వ్యక్తి దుబాయ్ లో ఉంటున్న సంపన్నుడు. ప్రపంచంలోనే అత్యంత పెద్దవాయునా కార్ గ్యారేజ్ లలో ఇతని గ్యారేజ్ కూడా ఒకటి. తన గ్యారేజ్ లో స్పోర్ట్స్ కార్లు, పెర్ఫామెన్స్ కార్లు మరియు సూపర్ కార్లు ఉన్నాయి. అతను బెంట్లీ నుండి ఫెరారీ మరియు మెక్లారెన్ వరకు దాదాపు అన్ని కంపెనీల కార్లు కలిగి ఉన్నాడు. ఇవన్నీ ఒక ఎత్తైతే అతని గ్యారేజ్ లోని రోల్స్ రాయిస్ కార్లు ప్రత్యేకమైన ఆకర్షణ, వీటి గురించి మరింత సమాచార, ఇక్కడ తెలుసుకుందాం..

10 కంటే ఎక్కువ రోల్స్ రాయిస్ కార్లు కలిగి ఉన్న బిలీనియర్ : అతని కార్ల వివరాలు

రోల్స్ రాయిస్ ఫాంటమ్ సిరీస్ VIII ఎల్‌డబ్ల్యుబి :

ఇది రోల్స్ రాయిస్ ఫాంటమ్ యొక్క లాంగ్‌వీల్ బేస్ వెర్షన్. అంతే కాకుండా ఇది స్టాండర్డ్ వెర్షన్ కంటే ఎక్కువ ధర కలిగి ఉంటుంది. ఇది అతని గ్యారేజీలోని అత్యంత ఖరీదైన రోల్స్ రాయిస్‌లలో ఒకటి. ఇది కస్టమైజ్ చేయబడిన క్యాబిన్‌ను పొందుతుంది మరియు రెండవ వరుసలో చాలా స్థలం ఉంది, ఆరు అడుగుల కంటే ఎత్తు ఉన్నవారు కూడా చాలా అనుకూలంగా ప్రయాణించవచ్చు. ఈ కారుని కుటుంబంతో కలిసి వెళ్ళటానికి ఉపయోగిస్తారు.

MOST READ:టైటానికి షిప్‌ను తలపిస్తున్న ఫెర్రీ షిప్ : పూర్తి వివరాలు

10 కంటే ఎక్కువ రోల్స్ రాయిస్ కార్లు కలిగి ఉన్న బిలీనియర్ : అతని కార్ల వివరాలు

రోల్స్ రాయిస్ ఫాంటమ్ సిరీస్ VIII :

పీయూష్ నగర్ గ్యారేజీలో స్టాండర్డ్ రోల్స్ రాయిస్ ఫాంటమ్ కూడా ఉంది. ఇది కస్టమైజ్ చేయబడిన రెడ్ కలర్ ఇంటీరియర్‌లను పొందుతుంది. ఈ వాహనానికి వెల్వెట్ కార్పెట్స్ మరియు మ్యాచింగ్ సీట్లు కూడా లభిస్తాయి. ఈ కారులోస్థలం ఎల్‌డబ్ల్యుబి వెర్షన్ కంటే తక్కువగా ఉన్నప్పటికీ, సుదూరప్రాంతాలకు కూడా వెళ్ళడానికి సహకరిస్తుంది.

10 కంటే ఎక్కువ రోల్స్ రాయిస్ కార్లు కలిగి ఉన్న బిలీనియర్ : అతని కార్ల వివరాలు

రోల్స్ రాయిస్ డాన్ :

రోల్స్ రాయిస్ డాన్ అనేది రోల్స్ రాయిస్ బ్రాండ్ నుండి వచ్చిన ఐకానిక్ వాహనాల్లో ఒకటి. పియూష్ నగర్ గ్యారేజీలో హైలీ కస్టమైజ్ చేయబడిన రోల్స్ రాయిస్ డాన్ కూడా ఉంది. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది మరియు క్యాబిన్ పర్పుల్ కలర్ లో ఉంటుంది. స్టీరింగ్ వీల్ కూడా పర్పుల్ హైలైట్‌ను పొందుతుంది. కావున ఇది చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది.

MOST READ:మీకు తెలుసా.. ఈ ట్రాక్టర్‌కి డ్రైవర్ అవసరం లేదు.. ఇంకెలా పనిచేస్తుందో వీడియోలో చూడండి

10 కంటే ఎక్కువ రోల్స్ రాయిస్ కార్లు కలిగి ఉన్న బిలీనియర్ : అతని కార్ల వివరాలు

రోల్స్ రాయిస్ ఫాంటమ్ సిరీస్ VII :

రోల్స్ రాయిస్ యొక్క పాత వెర్షన్ ఫాంటమ్ సిరీస్ VII కూడా అతని గ్యారేజ్ లో ఉంది. ఇది వైట్ కలర్ ఫాంటమ్ సిరీస్ VII. ఇది ప్రపంచంలోని అత్యంత అందమైన కార్లలో ఒకటిగా చాలా మంది గుర్తించారు. ఈ కారు తన మామకు చెందినది. కొంతకాలం తర్వాత దానిని అతడు కొనుగోలు చేసిన మొదటి ఫాంటమ్ ఇది అని చెప్పాడు.

10 కంటే ఎక్కువ రోల్స్ రాయిస్ కార్లు కలిగి ఉన్న బిలీనియర్ : అతని కార్ల వివరాలు

రోల్స్ రాయిస్ కలినన్ :

రోల్స్ రాయిస్ కలినన్ సంస్థ యొక్క మొట్టమొదటి ఎస్‌యూవీ మరియు ఈ మోడల్ ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ప్రజాదరణ పొందింది. రోల్స్ రాయిస్ కుల్లినన్ పియుష్ చేత కష్టమైజ్ చేయబడింది. ఇది బయటి నుండి తెలుపు రంగులో మరియు లోపలి భాగం రెడ్ కలర్ లో ఉంది. రెండు రంగుల కలయిక కారణంగా ఈ కారు చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది.

MOST READ:టాటా అల్ట్రోజ్ డీజిల్ వేరియంట్ రివ్యూ.. వచ్చేసింది.. చూసారా !

10 కంటే ఎక్కువ రోల్స్ రాయిస్ కార్లు కలిగి ఉన్న బిలీనియర్ : అతని కార్ల వివరాలు

రోల్స్ రాయిస్ ఘోస్ట్ :

రోల్స్ రాయిస్ ఘోస్ట్ ప్రస్తుతం సంస్థ యొక్క చౌకైన మోడల్. ఇది ఓల్డ్ వెర్షన్ రోల్స్ రాయిస్ ఘోస్ట్ మోడల్. రోల్స్ రాయిస్ ఘోస్ట్ 6.75 లీటర్ ట్విన్-టర్బో వి 12 ఇంజిన్ కలిగి ఉంది, ఇది 571 బిహెచ్‌పి శక్తిని మరియు 850 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 4.8 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిలోమీటర్లు వేగవంతం అవుతుంది.

10 కంటే ఎక్కువ రోల్స్ రాయిస్ కార్లు కలిగి ఉన్న బిలీనియర్ : అతని కార్ల వివరాలు

రోల్స్ రాయిస్ రైత్ బ్లాక్ బ్యాడ్జ్ :

రోల్స్ రాయిస్ రైత్ ఒక కూపే మోడల్, అంతే కాకుండా ఇది సంస్థ యొక్క అత్యంత ఆకర్షణీయమైన మోడళ్లలో ఒకటి. అతని గ్యారేజ్ లో ఉన్న రోల్స్ రాయిస్ వ్రైత్ బ్లాక్ కలర్‌లో ఉంది, దీనికి ఎరుపు పిన్‌స్ట్రిప్స్ మరియు కస్టమైజ్ రెడ్ క్యాబిన్‌లు ఇవ్వబడ్డాయి. ఇది ప్రత్యేకమైన బ్లాక్ బ్యాడ్జ్ ఎడిషన్, అంటే దానిపై క్రోమ్ లేదు మరియు ఇది చూడటానికి చాలా స్పోర్టిగా కనిపిస్తుంది.

MOST READ:భయంకరమైన ప్రమాదంలో మరణాన్ని తప్పించిన మారుతి వితారా బ్రెజా.. ఎలాగో తెలుసా ?

Most Read Articles

English summary
Indian Billionaire Piyush Nagar Rolls Royce Collection. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X