ఫేమస్ దుబాయ్ 'యూట్యూబ్ పాప' ఇప్పుడు భారతదేశంలో ఏం చేస్తుందో చూడండి..!
టిక్‌టాక్, యూట్యూబ్ షార్ట్స్, రీల్స్ వంటి వీడియో యాప్స్ ద్వారా చాలా మంది సామాన్యులు కూడా సెలబ్రిటీలుగా మారిపోయారు. ప్రత్యేకించి యూట్యూబ్ ద్వారా ప్రాచుర్యం పొందిన వారి జాబితా అయితే లెక్కే లేదు. సాధారణంగా యూట్యూబర్లు వీక్షకులకు వినోదాన్ని పంచడంతో పాటుగా, మనం ఎన్నటికీ చూడలేని కొన్ని ప్రదేశాలను కూడా మనకు చూపిస్తుంటారు. అలాంటి, ఓ అరుదైన వీడియో గురించి మనం ఈ కథనంలో చూడబోతున్నాం. మరి ఆలస్యం ఎందుకు రండి.

యూట్యూబ్ ద్వారా ఫేమస్ అయిన దుబాయ్ యువతి 'లానా రోస్' గురించి నెటిజెన్లకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ అందాల భామ దుబాయ్ లోని విలాసవంతమైన వ్యక్తుల జీవనశైలిని, వారు ఉపయోగించే ఖరీదైన కార్లను మరియు వారి ఖరీదైన ఆహారపు అలవాట్లను నెటిజన్లకు తన వీడియోల ద్వారా చూపిస్తుంటుంది. ఇప్పుడు ఈ దుబాయ్ అమ్మడు, భారతదేశానికి వచ్చింది. అంతేకాదు, ఇక్కడ (భారత్‌లో) ఓ ధనవంతుడు ఉపయోగించే కార్ల గ్యారేజ్ ను కూడా షోకేస్ చేసింది.

నిజానికి, భారతదేశంలో అత్యధిక లగ్జరీ కార్ల యజమానుల జాబితాలో బహుశా అంబానీ కుటుంబం అగ్రస్థానంలో ఉంటుందేమో. ఎందుకంటే, వారి వద్ద లెక్కలేనన్ని లగ్జరీ కార్లు ఉన్నాయని, వాటి కోసం అంబానీ కుటుంబం నివసించే ముంబైలోని ఆంటిలియా ఇంటిలో పార్కింగ్ కోసం చాలా సైట్లు కేటాయించబడ్డాయని చెప్పుకుంటుంటారు. అయితే, ఇప్పుడు అంబానీ ఫ్యామిలీకి పోటీ ఇవ్వాలనుకున్నాడో ఏమో కానీ ఓ ఇండియన్ బిలీనియర్ తన గ్యారేజ్ లో అత్యధిక సంఖ్యలో కార్లను మెయింటైన్ చేస్తున్నాడు.
వివరాల్లోకి వెళితే.. లానా రోస్ మరియు ఆమె సోదరుడు మహమ్మద్ పోస్ట్ ఈ వీడియోలో పేర్కొన్న సమాచారం ప్రకారం, భారతదేశానికి చెందిన ఓ ధనవంతుడి వద్ద దాదాపు 100 కు పైగానే ఖరీదైన కార్లు ఉన్నాయి. వాటిలో కొన్ని ఖరీదైన సెక్యూరిటీ వాహనాలు కూడా ఉన్నాయి. మరి ఇంతకీ ఆ ధనవంతుడు ఎవరా అనుకుంటున్నారా? అతనే వికాస్ మాలు, కుబేర్ గ్రైన్స్ అండ్ స్పైసెస్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు. వందల కొద్దీ లగ్జరీ కార్లకు యజమాని. మరి ఆయన కలెక్షన్‌లో ఏమేమీ కార్లు ఉన్నాయో మీరు కూడా చూసేయండి.

ఎమ్ఓ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానెల్ ను నిర్వహిస్తున్న దుబాయ్ యువతి లానా రోస్ మరియు ఆమె సోదరుడు మహమ్మద్ తమ యూట్యూబ్ ఛానెల్ వీడియో కోసం వికాస్ మాలు గ్యారేజ్ ను సందర్శించారు. ఇందుకోసం వారిద్దరూ ఓ ప్రైవేట్ జెట్ విమానంలో భారతదేశానికి వచ్చినట్లు వీడియోలో తెలిపారు. వికాష్ మాలు వాడిన కార్లకు సంబంధించిన ఓ వీడియోని వారు తమ యూట్యూబ్ ఛానెల్ అప్‌లోడ్ చేశారు.

వికాస్ మాలుకు మాత్రమే కాకుండా అతనికి భద్రత కల్పించే సెక్యూరిటీ గార్డులకు కూడా లగ్జరీ కార్లు కేటాయించబడ్డాయి. టొయోటా ఫార్చ్యూనర్ వంటి కార్లలో వికాస్ మాలుకు రక్షణ కల్పిస్తారు. ఈ కార్లతో పాటు చాలా ఖరీదైన కార్లు అక్కడ పార్క్ చేయబడి ఉండటాన్ని చూడొచ్చు. నిజానికి, దీనిని కార్ గ్యారేజ్ అనడం కన్నా ఓ మినీ కార్ షో అని చెప్పుకోవ్చచు. ఈ కార్ ఫ్లీట్ లో లాంబోర్గినీ ఉరుస్ ఎస్‌యూవీ నుంచి రోల్స్ రాయిస్ ఫాంటమ్ వరకు చాలా లగ్జరీ కార్లు పార్క్ చేయబడి ఉన్నాయి.

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ వీడియోలో సదరు యువతి చూపించే దాదాపు అన్ని ఖరీదైన కార్లు కూడా స్కాక్ మోడళ్లు కావు, వాటిని సదరు వాహన యజమానుల అభిరుచికి అనుగుణంగా ప్రత్యేకంగా కస్టమైజ్ చేయబడినవి. ఉదాహరణకు, ఈ వీడియోలో చూపించే లంబోర్ఘిని ఉరుస్ ఎస్‌యూవీ కూడా లోపలి భాగంలో పూర్తి కస్టమైజేషన్ ను కలిగి ఉంటుంది. బ్లాక్ అండ్ ఆరెంజ్ ఇంటీరియర్ థీమ్, ఆరెంజ్ కలర్ బ్రేక్ కాలిపర్‌లు వంటి ఆరెంజ్ యాక్సెంట్స్ మరియు హైలైట్లతో ఇది చాలా స్పోర్టీగా కనిపిస్తుంది.

అదేవిధంగా, ఈ వీడియోలో చూపించిన అనేక కార్లు కూడా అదనపు అలంకరణలు మరియు ప్రత్యేక ఫీచర్లతో తయారు చేయబడినవే. ఈ కార్లలో ఆకర్షణీయమైన ఫీచర్లే కాకుండా కొన్ని ప్రత్యేకమైన సాంకేతిక ఫీచర్లను కూడా అమర్చారు. యజమాని తన సెక్యూరిటీ సిబ్బందితో సంప్రదింపులు చేయడానికి లేదా ఎమర్జెన్సీ సమయంలో పోలీసుల సాయం కోరడానికి ఈ సెక్యూరిటీ వాహనాలలో వైర్‌లెస్ రేడియో సిస్టమ్ కూడా అమర్చబడి ఉంటాయి.

వికాస్ మాలు కార్ కలెక్షన్‌లో బెంట్లీ కాంటినెంటల్ జిటి కూడా ఉంది, ఇది అత్యంత ఆకర్షణీయమైన ఫీచర్‌తో తయారైన కారు. దీనిని మన్సోరి అనే ప్రత్యేక వెహికల్ మోడిఫికేషన్ కిట్‌తో డిజైన్ చేశారు. కాబట్టి, ఇది చాలా ప్రత్యేకమైన కారుగా కనిపిస్తుంది. స్పోర్ట్స్ కార్ ప్రియులను ఆకట్టుకునే లాంబోర్గినీ హరికేన్ ఎస్‌టిఓ కూడా ఈ గ్యారేజీలో పార్క్ చేయబడింది. కేవలం ఈ ఒక్క కారు ధరే సుమారు రూ.4.99 కోట్లు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది.

అతని గ్యారేజీలో ఇంకా బెంట్లీ ఫ్లయింగ్ స్పర్, పెంటెకోస్ట్, మెర్సిడెస్ మేబ్యాక్ జిఎల్600 ఎస్‌యూవీ, టొయోటా తంత్ర పిక్-అప్, ఫోర్డ్ మస్టాంగ్ మరియు ప్రత్యేక ఫీచర్లతో కూడిన లాంగ్ వీల్‌బేస్ రోల్స్ రాయిస్ ఫాంటమ్ వంటి కార్లు చాలానే ఉన్నాయి. ఈ కార్లలో చాలా వరకు వాహనాలు రిజిస్ట్రేషన్ నంబర్ 0009 ను కలిగి ఉండటాన్ని ఈ వీడియోలో చూడొచ్చు.


Click it and Unblock the Notifications








