60 కోట్లకు దుబాయ్ ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్ కొనుగోలు చేసిన భారత వ్యాపార వేత్త
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో కార్ నెంబర్ ప్లేట్ కోసం జరిగే వేలం పాట పెద్ద సంబరం అని చెప్పాలి. అక్కడి వ్యక్తుల యొక్క స్టేటస్ మరియు సంపదకు ప్రతీకగా అతి చిన్న నెంబర్ కలిగిన ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్లను కోటానుకోట్లు వెచ్చించి మరీ కొనుగోలు చేస్తున్నారు.

సాధారణంగా మనం ఒక లైసెన్స్ నెంబర్ ప్లేట్ కోసం రెండు వేలు మొదలుకొను లక్షల చెల్లించడానికి కూడా సిద్దపడుతుంటాం. కాని దుబాయ్‌కి చెందిన భారతీయ వ్యాపార వేత్త ఏకంగా 60 కోట్ల రుపాయలు వెచ్చించి ఒక నెంబర్ ప్లేట్ కొనుగోలు చేశాడు.

బల్వింధర్ షాని అనే వ్యాపార వేత్త తన కొత్త రోల్స్ రాయిస్ కోసం దుబాయ్‌లో జరిగిన వేలంపాటలో పాల్గొని 9 మిలియన్ డాలర్లు (60 కోట్లు) వెచ్చించాడు.

ప్రాపర్టీ మేనేజ్‌మెంట్ కంపెనీ నిర్వహిస్తున్న షాని 2,80,000 డాలర్లు వెచ్చించి మరో నెంబర్ ప్లేట్ కూడా కొనుగోలు చేశాడు.

భారీ మొత్తాన్ని వెచ్చించి నెంబర్ ప్లేట్లను కొనుగోలు చేయడం షానికి ఇది మొదటి సారి కాదండోయ్. గత తొమ్మిదేళ్ల కాలంలో ఎన్నో నెంబర్ ప్లేట్లను వేలం ద్వారా కొనుగోలు చేసినట్లు అక్కడ మీడియా తెలిపింది.

సంపన్న దేశాలలో ఒకటి దుబాయ్ డబ్బుకు కొదవే లేదని చెప్పాలి. స్టేటస్, సంపద మరియు ధనవంతులం అనే భావన కోసం పోటీ పడి మరీ దుబాయ్ ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్లను కొనుగోలు చేశారు.

గరిష్టంగా గతంలో జరిగిన 2008 వేలం పాటలో 140 మిలియన్ డాలర్లు వెచ్చించి సయీద్ అల్ కౌర్ అనే వ్యక్తి నెంబర్ 1 అనే లైసెన్స్ ప్లేట్‌ను కొనుగోలు చేసాడు.

గత వారంలో దుబాయ్‌లో సుమారుగా 80 నెంబర్ ప్లేట్లకు వేలం నిర్వహించారు.

ప్రారంభంలో డి5 అనే నెంబర్ ప్లేట్ ను 5.5 మిలియన్ డాలర్లకు వేలం ద్వారా అమ్మేశారు.

వేలం పాట ద్వారా వచ్చిన మొత్తం సొమ్మును దుబాయ్ రహదారులు మరియు రవాణా అథారిటీ ఖజానాకు చేరుతుంది.

- భారత దేశపు డ్రైవింగ్ లైసెన్స్‌కు ఎన్ని దేశాలలో డ్రైవింగ్ అనుమతి ఉందో తెలుసా ?
- రెండు చేతులు లేని వ్యక్తికి డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు చేసిన అధికారులు
- ఇండియన్ ఆర్మీ వాహనాలపై నెంబర్‌ప్లేట్ల మీద ఉన్న పదాల అర్థం ఏమిటి ?


Click it and Unblock the Notifications








