ఆ కారుపై మనసు పారేసుకుంటున్న సెలబ్రిటీలు.. అక్షయ్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ సహా..

సెలబ్రిటీల జీవన విధానం అత్యంత విలాసవంతంగా ఉంటుంది. వారిలో చాలా మంది లగ్జరీ కార్లకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. సెలబ్రిటీల కార్‌ గ్యారేజీ సుమారుగా లగ్జరీ వాహనాలతో నిండి ఉంటుంది. అయితే ఒక్కొక్కరికి ఒక్కో కారుపై మోజు ఉంటుంది. కానీ ఓ కారుపై చాలా మంది సెలబ్రిటీలు మనసు పారేసుకుంటున్నారు. ఆ కారు వివరాలు తెలుసుకుందాం.

స్టెల్లాంటిస్‌కు చెందిన అమెరికన్‌ SUV తయారీ దిగ్గజం జీప్‌కు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆఫ్‌రోడ్‌ SUV విభాగంలో ఈ వాహనం టాప్‌లో ఉంటుంది. 2016లో ఈ సంస్థ భారత మార్కెట్‌లోకి ప్రవేశించింది. తక్కువ కాలంలోనే మంచి పేరు సంపాదించింది. ప్రారంభంలో ప్రీమియం ఎస్‌యూవీలు, రాంగ్లర్‌ సహా గ్రాండ్‌ చెరోకీలను భారత్‌ మార్కెట్‌లో విడుదల చేసింది. అనంతరం భారత మార్కెట్‌ డిమాండ్‌ ఆధారంగా Compass Jeep ను లాంచ్‌ చేసింది.

jeep compass

జీప్‌ కంపాస్‌ భారత్‌లో నాణ్యమైన బ్రాండ్‌గా గుర్తింపు పొందింది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ జీప్‌ అనేక మంది సెలబ్రీటీల మనసు దోచుకుంది. ఈ వాహనాన్ని చాలా మంది ప్రముఖులు కలిగి ఉన్నారు. వారి వివరాలు మీకోసం.

jeep compass

బాలీవుడ్‌ ఖిలాడి అక్షయ్‌కుమార్‌కు కార్లు అంటే చాలా ఇష్టం. లగ్జరీ కార్లు అయిన బెంట్లీస్‌, రేంజ్ రోవర్‌, రోల్స్‌ రాయిస్‌ సహా మరెన్నె విలాసవంతమైన వాహనాలు అక్షయ్‌కుమార్‌ గ్యారేజ్‌లో ఉన్నాయి. తాజాగా ఆయన నలుగు రంగు జీప్‌ కంపాస్‌ను డెలివరీ తీసుకున్నారు. వీటితో పాటు లగ్జరీ వాహనమైన హోండా CR-V అక్షయ్‌ సొంతం. ఈ కారులో ఆయన చాలా సార్లు కనిపించారు. అయితే ఈ జీప్‌లో చాలా అరుదుగా కనిపిస్తుంటారు. అక్షయ్‌ కుటుంబ సభ్యులు తమ రోజువారీ కార్యక్రమాల కోసం SUVలను ఎక్కువగా వినియోగిస్తారు.

jeep compass

ప్రముఖ నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌ కుమార్తె సారా అలీ ఖాన్‌ కూడా నీలి రంగు జీప్‌ కంపాస్‌ను కలిగి ఉన్నారు. ఈ కారులో ఆమె చాలా సార్లు కనిపించారు. ఈ కారు సారా అలీఖాన్‌ తల్లి పేరుమీద రిజిస్ట్రర్‌ చేసి ఉన్నట్లు సమాచారం. దాంతోపాటు భారత్‌లో అత్యంత తక్కువ రేంజ్‌ కారు అయిన ఆల్టో 800 వాహనంలోనూ చాలాసార్లు కనిపించారు. సారా అలీ ఖాన్‌ చాలాసార్లు తెలుపు రంగు మెర్సిడెస్‌ బెంజ్‌ G350d కారులోను కనిపించారు.

jeep compass

ప్రముఖ నటుడు రోనిత్‌రాయ్‌ సోదరుడు అయిన ప్రముఖ టీవీ నటుడు రోహిత్‌ రాయ్‌ కూడా ఈ జీప్‌ కంపాస్‌ను కలిగి ఉన్నారు. రోహిత్ రాయ్‌ ప్రీమియం మోటార్‌సైకిళ్లు మరియు కార్లంటే చాలా ఇష్టపడతారు. ఈ నటుడు ఇటీవలే తెలుపు రంగు జీప్‌ కంపాస్‌ను సొంతం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆయన షేర్‌ చేశారు.

jeep compass

సౌత్ ఇండస్ట్రీలో ప్రముఖ నటుడు ఉన్ని ముకుందన్‌కు కూడా కార్లంటే చాలా ఇష్టపడతారు. 2017లోనే ఎరుపు రంగు జీప్‌ కంపాస్‌ను కొనుగోలు చేశారు. మిడ్‌ రేంజ్‌ SUVల్లో ఈ నటుడు చాలాసార్లు కనిపించారు. ఇటీవలే ఈ నటుడు జావా మోటార్‌సైకిల్‌ను కొనుగోలు చేశారు.

jeep compass

ప్రముఖ బాలీవుడ్‌ నటి రియో చక్రవర్తి కూడా జీప్‌ కాంపాస్‌ను కలిగి ఉన్నారు. ఈ నటి అనేకసార్లు SUVలో ప్రయాణిస్తూ కనిపిస్తూ ఉంటారు. అయితే ఈ ఎస్‌యూవీ వివరాలు స్పష్టంగా తెలియకపోయినా, మిడ్‌ స్పెక్‌ వేరియంట్లలో ఒకటని తెలుస్తోంది.

jeep compass

ప్రముఖ కన్నడ నటుడు కిచ్చా సుదీప్‌ గత సంవత్సరం నలుపు రంగు జీప్‌ కంపాస్‌ను కొనుగోలు చేశారు. అనేక సార్లు ఈ వాహనాన్ని నడుపుతూ సుదీప్‌ కనిపించారు. లగ్జరీ MPV అయిన టయోటా వెల్‌ఫైర్‌ కూడా హీరో సుదీప్ వద్ద ఉంది. మరో ప్రముఖ నటి ఉర్ఫీ జావేద్‌ కూడా ఈ జీప్‌ కంపాస్‌ను కలిగి ఉన్నారు. ఇటీవలే 7 సీటర్‌ వెర్షన్‌ కంపాస్‌ను మెరిడియన్‌ SUV రూపంలో కొనుగోలు చేశారు.

jeep compass

ప్రముఖ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ కూడా అనేకమంది సెలబ్రిటీలు కలిగి ఉన్న జీప్‌ కంపాస్‌ను కలిగి ఉన్నారు. జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ తనతోపాటు తన మేకప్‌ ఆర్టిస్ట్ కోసం కూడా మరో వాహనం కొనుగోలు చేశారు. ఈ నటి రేంజ్‌ రోవర్‌తోపాటు మెర్సిడెస్‌ S500 లగ్జరీ కార్లను ఇప్పటికే కలిగి ఉన్నారు.

More from DriveSpark

Article Published On: Monday, May 15, 2023, 13:40 [IST]
English summary
Indian celebrities who own jeep compass
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+