క్రికెటర్ 'రహానే' కొత్త కారు చూసారా.. ధర తెలిస్తే తప్పకుండా షాకవుతారు!

ప్రముఖ ఇండియన్ క్రికెటర్ 'అజింక్యా రహానే' ఇటీవల ఖరీదైన జర్మన్ లగ్జరీ కారును కొనుగోలు చేశారు. ఇంతకీ రహానే కొనుగోలు చేసిన కారు ఏది? దాని ధర ఎంత? ఇప్పటికే ఈ మోడల్ ఎవరైనా కొన్నారా.. అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

అజింక్యా రహానే కొనుగోలు చేసిన కొత్త కారు 'మెర్సిడెస్ బెంజ్' (Mercedes Benz) కంపెనీకి చెందిన 'మేబ్యాచ్ జీఎల్ఎస్600' (Maybach GLS600) అని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలను డీలర్‌షిప్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో రహానే కారును డెలివెరీ చేసుకోవడం చూడవచ్చు. దీని ధర ఏకంగా రూ. 3.5 కోట్లు వరకు ఉందని తెలుస్తోంది.

Ajinkya Rahane Mercedes Maybach GLS 600

నిజానికి మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్600 కారు కొన్న మొదటి క్రికెటర్ రహానే అని తెలుస్తోంది. నెట్టింట్లో వైరల్ అవుతున్న ఫోటోలలో రహానే భార్య రాధిక ధోపావ్కర్ ఉండటం చూడవచ్చు. రహానే కొనుగోలు చేసిన కారు పోలార్ వైర్ కలర్ కలిగి చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది. ఇప్పటి వరకు ఏ క్రికెటర్ కూడా ఇలాంటి మెర్సిడెస్ బెంజ్ కారును కొంగులు చేయలేదు.

మేబ్యాచ్ జీఎల్ఎస్600 అనేది మెర్సిడెస్ బెంజ్ కంపెనీ యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పాశెట్టి కూడా కొనుగోలు చేశారు. అంతే కాకుండా రకుల్ ప్రీత్ సింగ్, కృతి సనన్, అర్జున్ కపూర్, రణ్ వీర్ సింగ్ భవ్నాని, తాప్సి మొదలైన వారు కూడా ఈ ఖరీదైన కారును ఇష్టపడి మరీ కొనుగోలు చేశారు.

Ajinkya Rahane Mercedes Maybach GLS 600

మెర్సిడెస్ మేబ్యాచ్ జీఎల్ఎస్600 (Mercedes Maybach GLS600)

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రతాజాదరణ పొందిన మెర్సిడెస్ మేబ్యాచ్ జీఎల్ఎస్600 అద్భుతమైన డిజైన్ కలిగి, చాలా అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది. పెద్ద వర్టికల్ స్లాట్ గ్రిల్, విండో లైన్, సైడ్ స్టెప్, ఫ్రంట్ అండ్ రియర్ బంపర్ల మీద డిజైన్ ట్వీక్స్, రూప్ రెయిల్స్ మరియు ఎగ్జాస్ట్ టిప్స్ కూడా ఇందులో చూడవచ్చు. మొత్తం మీద ఈ కారు చూపరులను ఒక్క చూపుతోనే కట్టిపడేస్తుంది.

ఇక ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో 12.3 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 12.3 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి. అంతే కాకుండా బర్మెస్టర్ సరౌండ్ సౌండ్ సిస్టం, యాంబియంట్ లైటింగ్, ఎలక్ట్రానిక్ పనోరమిక్ స్లైడింగ్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ మసాజింగ్ సీట్లు మరియు షాంపైన్ బాటిళ్లను నిల్వ చేసుకోవడానికి ఇందులో చిన్న రిఫ్రిజిరేటర్ కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

మెర్సిడెస్ మేబ్యాచ్ జీఎల్ఎస్600 కారులో 4.0 లీటర్ వీ8 ఇంజిన్ ఉంటుంది. ఇందులో 48V మైల్డ్ హైబ్రిడ్ సిస్టం కూడా ఉంటుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 557 పీఎస్ పవర్ మరియు 730 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. హైబ్రిడ్ సిస్టం 22 పీఎస్ పవర్ మరియు 250 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 9 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ ద్వారా నాలుగు చక్రాలకు పవర్ డెలివరీ చేస్తుంది.

మేబ్యాచ్ జీఎల్ఎస్600 కేవలం 4.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ కారు టాప్ స్పీడ్ గంటకు 250 కిమీ కావడం గమనార్హం. మంది డిజైన్ మరియు ఫీచర్స్ కలిగిన ఈ కారు పనితీరు పరంగా కూడా చాలా ఉత్తమంగా ఉంటుంది. మొత్తానికి ఇప్పుడు GLS600 కలిగి ఉన్న సెలబ్రిటీల జాబితాలో ఓ క్రికెటర్ కూడా చేరి పోయారు.

More from DriveSpark

Article Published On: Thursday, February 22, 2024, 8:54 [IST]
English summary
Indian cricketer ajinkya rahane buys mercedes maybach gls 600
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+