కొత్త బైక్ కొనుగోలు చేసిన 'రుతురాజ్ గైక్వాడ్'.. ధర ఎంతో తెలుసా?
భారత క్రికెటర్ 'రుతురాజ్ గైక్వాడ్' గురించి దాదాపు చాలామందికి తెలుసు. గత సంవత్సరం టైటిల్ విన్నర్స్ చెన్నై సూపర్ కింగ్స్ తరపున 635 పరుగులు చేసి అందరికి అభిమానాన్ని పొందగలిగాడు. అయితే ఇటీవల రుతురాజ్ గైక్వాడ్ ఒక కొత్త బైక్ కొనుగోలు చేశారు. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
రుతురాజ్ గైక్వాడ్ కొనుగోలు చేసిన బైక్ జావా కంపెనీ యొక్క '42 బాబర్' అని తెలుస్తోంది. ఇది మూన్‌స్టోన్ వైట్ కలర్ లో చాలా ఆకర్షణీయంగా ఉంది. ఈ బైక్ డెలివరీ తీసుకునే ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ బైక్ యొక్క ఎక్స్-షోరూమ్ ధర రూ. 2.07 లక్షలు. జావా 42 బాబర్ అనేది పాత పెరాక్ నుంచి ప్రేరణ పొందింది.

భారతీయ మార్కెట్లో జావా 42 బాబర్ మూడు కలర్ ఆప్సన్స్ లో లభిస్తుంది. అవి మిస్టిక్ కాపర్, మూన్‌స్టోన్ వైట్ మరియు జాస్పర్ రెడ్. కలర్ ని బట్టి ధరలు కూడా మారుతాయి. ఈ బైక్ మంచి డిజైన్ కలిగి ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. ఇందులో కొత్త రౌండ్ హెడ్‌ల్యాంప్, ఇండిపెండెంట్ క్లాక్ కన్సోల్, కొత్త హ్యాండిల్ బార్, ఫ్యూయల్ ట్యాంక్, పూర్తిగా రీడిజైన్డ్ అడ్జస్టబుల్ సీటు మరియు వెనుక ఫెండర్‌పై చిన్న లగేజ్ ర్యాక్ వంటివి ఉన్నాయి.
కొత్త జావా 42 బాబర్ బైక్ 334 సిసి సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 30.64 హెచ్‌పి పవర్ మరియు 32.64 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది, కావున మంచి పనితీరుని అందిస్తుంది. ఈ బైక్ నెగటివ్ LCD డిస్‌ప్లే పొందుతుంది. అయితే టెయిల్-ల్యాంప్ మాత్రం దాని పెరాక్ మోడల్ కి కొంత భిన్నంగా ఉండటం గమనించవచ్చు.
జావా 42 బాబర్ బైక్ రైడర్ కి మరింత సౌకర్యవంతమైన రైడింగ్ అనుభూతిని అందించడానికి అద్భుతమైన సస్పెన్షన్ సెటప్ కూడా అందిస్తుంది. అదే సమయంలో బ్రేకింగ్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ బైక్ స్పోక్డ్ వీల్స్ పొందుతుంది. జావా 42 బాబర్ అద్భుతమైన డిజైన్ కలిగి, మంచి పనితీరుని అందించేలా రూపొందించబడి ఉంటుంది. అయితే ప్రస్తుతం దీనికి ప్రత్యక్ష ప్రత్యర్థులు లేదు, కానీ ధరల విషయంలో మాత్రం జావా పెరాక్ కి ప్రత్యర్థిగా ఉంటుంది.
రుతురాజ్ గైక్వాడ్ కొనుగోలు చేసిన జావా 42 బాబర్ మూన్‌స్టోన్ వైట్ కలర్ లో ఉంది. కావున దీని ధర రూ. 2.07 లక్షలు (ఎక్స్-షోరూమ్). అయితే ఇది మిస్టిక్ కాపర్ మరియు జాస్పర్ రెడ్ అనే మరో రెండు కలర్ ఆప్సన్స్ లో కూడా లభిస్తుంది. వీటి ఎక్స్-షోరూమ్ ధరలు వరుసగా రూ. 2.06 లక్షలు మరియు రూ. 2.09 లక్షలు. ఈ లేటెస్ట్ బైక్ సాధారణ ప్రజలను మాత్రమే కాకుండా సెలబ్రిటీలను కూడా ఆకర్షిస్తోంది.
భారతదేశంలో ఖరీదైన బైకులు, కార్లు కొనుగోలు చేసే సెలబ్రిటీల సంఖ్య ఎక్కువగానే ఉంది. గతంలో మహమ్మద్ షమీ కూడా రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి 650 బైక్ కొనుగోలు చేసాడు. ఈ బైక్ సిల్వర్ కలర్ లో చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా షమీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేశారు. 'కాంటినెంటల్ జిటి 650' ప్రారంభ ధర భారతీయ మార్కెట్లో రూ. 3.04 లక్షలు.
రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి 650 మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవి స్టాండర్డ్, కస్టమ్ మరియు క్రోమ్ వేరియంట్స్. భారతీయ మార్కెట్లో అమ్ముడవుతున్న బైకులలో ఇది కూడా ఒకటి. ఇది 650 సిసి విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్. ఎక్కువమంది యువ రైడర్స్ ఇష్టపడే బైకుల్లో కాంటినెంటల్ జిటి 650 కూడా ఒకటి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








