జర్మన్ బ్రాండ్ కారు కొన్న 'సూర్యకుమార్ యాదవ్': ధర రూ. 2.15 కోట్లు

ఇండియన్ స్టార్ క్రికెటర్ 'సూర్య కుమార్ యాదవ్' (Suryakumar Yadav) గురించి దాదాపు అందరికి తెలుసు. అయితే ఇటీవల ఇతడు ఆధునిక జర్మన్ లగ్జరీ కారుని కొనుగోలు చేసాడు. ఈ కొత్త కారు ధర రూ. 2.15 కోట్లు. దీని గురించి మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

జర్మన్ బ్రాండ్ కారు కొన్న 'సూర్య కుమార్ యాదవ్': ధర రూ. 2.15 కోట్లు

'సూర్యకుమార్ యాదవ్' కొనుగోలు చేసిన ఈ కారు 'మెర్సిడెస్ బెంజ్' (Mercedes Benz) యొక్క 'జిఎల్ఎస్ ఏఎమ్‌జి63' (GLS AMG63) అని తెలిసింది. ఈ కారుని ముంబైలోని మెర్సిడెస్ డీలర్‌షిప్ ఆటో హ్యాంగర్ నుండి అతను తన భార్య 'దేవిషా శెట్టి' తో కలిసి డెలివరీ తీసుకున్నాడు. దీనికి సంబంధించి ఫొటోలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

జర్మన్ బ్రాండ్ కారు కొన్న 'సూర్య కుమార్ యాదవ్': ధర రూ. 2.15 కోట్లు

ప్రస్తుతం మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ రెండు వేరియంట్స్ లో అందుబాటులో ఉంది. అవి ఒకటి 'మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ ఏఎమ్‌జి 53 4మాటిక్' (Mercedes AMG GLS 53 4MATIC) కాగా, మరొకటి 'మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ ఏఎమ్‌జి 63 ఎస్ 4మాటిక్' (Mercedes AMG GLS 63 S 4MATIC). ఇందులో సూర్య కుమార్ ఏ వేరియంట్ కొనుగోలు చేసాడు అనేది ఖచ్చితంగా తెలియదు.

జర్మన్ బ్రాండ్ కారు కొన్న 'సూర్య కుమార్ యాదవ్': ధర రూ. 2.15 కోట్లు

మెర్సిడెస్ బెంజ్ యొక్క జిఎల్ఎస్ 63 4మాటిక్ అనేది 4.0-లీటర్ వి8 ట్విన్-టర్బో, పెట్రోల్ ఇంజన్‌ పొందుతుంది. ఇహి 612 బిహెచ్‌పి పవర్ మరియు 850 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ద్వారా నాలుగు చక్రాలకు పవర్ డెలివరీ చేస్తుంది. అదే సమయంలో ఇది కేవలం 3.8 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.

జర్మన్ బ్రాండ్ కారు కొన్న 'సూర్య కుమార్ యాదవ్': ధర రూ. 2.15 కోట్లు

మెర్సిడెస్ జిఎల్ఎస్ ఏఎమ్‌జి అద్భుతమైన డిజైన్ పొందుతుంది. ఇది వాలుగా ఉండే రూఫ్‌ని పొందింది, ఇది వెనుక భాగంలో ఉన్న టెయిల్ సెక్షన్‌తో కలిసిపోతుంది. GLS కూపే దాని స్టాండర్డ్ GLS కంటే భిన్నంగా ఉంటుంది. ఈ కారు యొక్క ముందు భాగంలో పాన్అమెరికానా గ్రిల్‌తో కూడిన స్పోర్టీ బంపర్ ఇవ్వబడింది, కావున మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.

జర్మన్ బ్రాండ్ కారు కొన్న 'సూర్య కుమార్ యాదవ్': ధర రూ. 2.15 కోట్లు

బెంజ్ జిఎల్ఎస్ ఏఎమ్‌జి ఆధునిక ఇంటీరియర్ ఫీచర్స్ పొన్చుతుంది. ఇది బ్లాక్ అండ్ రెడ్ టోన్‌లలో స్పోర్టీ లెథెరెట్ సీట్లు పొందుతుంది. ఈ సీట్లు చాలా సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా, మెరుగైన డ్రైవింగ్ పొజిషన్‌ను కూడా అందిస్తాయి. అంతే కాకుండా ఇందులో త్రీ-స్పోక్ స్పోర్టీ స్టీరింగ్ వీల్ కూడా ఇవ్వబడింది.

జర్మన్ బ్రాండ్ కారు కొన్న 'సూర్య కుమార్ యాదవ్': ధర రూ. 2.15 కోట్లు

భారతీయ మార్కెట్లో మెర్సిడెస్-బెంజ్ యొక్క జిఎల్ఎస్ అనేది జర్మన్ ఆటోమేకర్ యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన SUV కార్లలో ఒకటి. ఇటీవల సినీ నటి ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖామంత్రి RK రోజా కూడా తన కొడుకు కోసం 'బెంజ్ జిఎల్ఎస్ 400డి 4మ్యాటిక్' (GLS 400D 4Matic) కొనుగోలు చేసింది.

జర్మన్ బ్రాండ్ కారు కొన్న 'సూర్య కుమార్ యాదవ్': ధర రూ. 2.15 కోట్లు

నిజానికి సూర్యకుమార్ యాదవ్ కి కార్లంటే చాలా ఇష్టం ఈ కారణంగానే ఇతను 'పోర్షే టర్బో 911' సూపర్ కారును కూడా కలిగి ఉన్నారు. దీని ధర సుమారు రూ. 3.64 కోట్లు అని తెలిసింది. అంతే కాకుండా అతని వద్ద 'నిస్సాన్ జోంగా' కూడా ఉంది.

జర్మన్ బ్రాండ్ కారు కొన్న 'సూర్య కుమార్ యాదవ్': ధర రూ. 2.15 కోట్లు

ఇదిలా ఉండగా ఆసియా కప్ 2022 టోర్నీలో ఆడటానికి కూడా 'సూర్యకుమార్ యాదవ్' సెలక్ట్ అయ్యాడు. ఈ ఈవెంట్ 2022 ఆగస్ట్ 27నుండి యూఏఈలో జరగనుంది. ఇందులో మన భారత్ ఆగస్ట్ 28 న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ప్రత్యర్థి అయిన పాకిస్థాన్‌తో తలపడనుంది.

Most Read Articles

English summary
Indian cricketer surya kumar yadav buys mercedes benz amg gls coupe details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X