12 ఏళ్ల వయసులో కల కన్నాడు.. నేడు నిజం చేసుకున్నాడు.. ఇండియన్ క్రికెటర్ ఎమోషనల్ పోస్ట్
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ వృద్ధిమాన్ సాహా బీఎండబ్ల్యూ ఎక్స్ 7 (BMW X 7) లగ్జరీ ఎస్‌యూవీని కొనుగోలు చేశాడు. తాజాగా దానికి సంబంధించిన ఫోటోలను సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్)లో ఈ విషయాన్ని తానే వెల్లడించాడు. తన సొంత కారు కోరిక నెరవేరినట్లు అతను రాసుకొచ్చాడు. 39 ఏళ్ల వయసులో లగ్జరీ కారుని కొనుగోలు చేయడం ఆనందం వ్యక్తం చేశాడు. ఈ క్రికెటర్ కొనుగోలు చేసిన లగ్జరీ కారుపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. అనుకున్నది సాధిస్తే ఆ కిక్కే వేరు ఉంటుందని కామెంట్స్‌లో పొగడ్తలతో ముంచేశారు.
12 ఏళ్ల వయసులో సొంత లగ్జరీ కారుని కొనుగోలు చేయాలనే కల ఉన్నట్లు సాహా తెలిపాడు. తాజాగా ఇంటికి తీసుకువచ్చిన బీఎండబ్ల్యూ నాకు, నా కుటుంబానికి ఎమోషనల్ మూమెంట్‌గా పేర్కొన్నాడు. షోరూమ్‌లోని కొత్త కారు పక్కన నిలబడి ఫోటోకు పోజులివ్వడాన్ని మనం చూడవచ్చు. ఈ క్రికెటర్ వద్ద ఉన్న మొదటి లగ్జరీ కారు ఇదే అని తెలుస్తుంది. అతనికి లగ్జరీ కార్లు లేకపోవచ్చు.

ప్రస్తుతం భారత టెస్టు జట్టులో సాహా స్థానాన్ని కోల్పోయాడు. ఈ 39 ఏళ్ల క్రికెటర్ మళ్లీ దేశం తరఫున ఆడే అవకాశం ఉండకపోవచ్చని క్యాప్షన్‌లో పేర్కొన్నాడు. 2021లో ముంబయిలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత టెస్టు జట్టు తరఫున ఆఖరి సారి ప్రాతినిధ్యం వహించాడు. గత కొన్నేళ్లుగా త్రిపురకు ప్రాతినిధ్యం వహిస్తున్న సాహా ఇప్పుడు బెంగాల్‌కి తిరిగి వచ్చి సొంత జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు.
తనకున్న అనుభవంతో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించడంలో సాహా కీలకంగా వ్యవహరించాడు. ఐపీఎల్‌లో ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2022 సీజన్‌లో ఆ జట్టు కప్ తీసుకోవడంలో సాహా కీలక పాత్ర పోషించాడు. ఓపెనర్ బ్యాటర్‌గా తనదైన శైలిలో ఆడటం సాహాకు మాత్రమే దక్కుతుంది. గుజరాత్ టైటాన్స్ టీమ్‌లో ఈ వికెట్ కీపర్ బ్యాటర్ నిలకడగా రాణిస్తూ కీలకంగా మారాడు.
ఇక BMW X 7 ఆ సంస్థ నుంచి అందుబాటులో ఉన్న ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీగా ఉంది. ఇది మార్కెట్లో మూడు వేరియంట్లలో లభిస్తుంది. xDrive40i M స్పోర్ట్ ధర రూ .1.27 కోట్లు, xDrive40d D డిజైన్ ప్యూర్ ఎక్సలెన్స్ ధర రూ .1.29 కోట్లు, ఇక ఫైనల్ వేరియంట్ xDrive40d M Sport ధర రూ. 1.30 కోట్లుగా ఉన్నాయి. పైవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు.
సాహా వేరియంట్ xDrive40d D డిజైన్ ప్యూర్ వేరియంట్‌ని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ .1.29 కోట్లుగా ఉంది ఈ కారులో భారీ గ్రిల్, స్లీకర్ రీడిజైన్ చేసిన ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, క్రోమ్ గార్నిష్డ్ ఎయిర్ వెంట్స్, 3డీ టెయిల్ ల్యాంప్స్ వంటివి ఉన్నాయి.
బీఎండబ్ల్యూలో ఈ వేరియంట్ ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ కావడంతో, ఇది ఫుల్ ఫీచర్లతో లోడ్ చేయబడింది. ఈ కారు డ్యాష్ బోర్డు డ్యూయల్ స్క్రీన్లతో వస్తుంది. ఒకటి 12.3 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్, మరొకటి 14.9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ యూనిట్ ఉన్నాయి. వీటితో పాటు పనోరమిక్ సన్ రూఫ్, 14-కలర్ యాంబియంట్ లైటింగ్ మరియు డిజిటల్ కీ కూడా ఉన్నాయి.
మల్టిపుల్ ఎయిర్ బ్యాగులు, 360 డిగ్రీల కెమెరా, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ (డీఎస్సీ), కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్ (సీబీసీ) వంటి ఫీచర్లను బీఎండబ్ల్యూ అందిస్తోంది. 3.0-లీటర్ ఇన్లైన్ సిక్స్-సిలిండర్ ట్విన్-టర్బో ఇంజిన్‌తో పనిచేస్తుంది. డీజల్ వేరియంట్ గరిష్టంగా 340బిహెచ్ పి పవర్ మరియు 700ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 48V మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్ మరియు 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ స్టాండర్డ్‌గా ఉన్నాయి.


Click it and Unblock the Notifications








