బిఐసి ఫార్ములా వన్ ట్రాక్‌పై ధోనీ బాయ్స్ ఎంజాయ్..
ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్‌పై 4-0 తేడాతో ఘన విజయం సాధించిన ధోనీ బాయ్స్ తమ విజయాన్ని గ్రేటర్ నోయిడాలోని బుధ్ ఇంటర్నేషనల్ రేస్ (బిఐసి) ట్రాక్‌పై సెలబ్రేట్ చేసుకున్నారు. భారతదేశంలోని ఏకైక ఫార్ములా వన్ ట్రాక్ అయిన బిఐసిపై స్కిప్పర్ మహేంద్ర సింగ్ ధోనీతో పాటుగా ఆరుగురు క్రికెట్ క్రీడాకారులు తమ బైక్‌లు కార్లను రేస్ ట్రాక్‌లపై వేగంగా పరుగులు పెట్టిస్తూ సంబరాలు చేసుకున్నారు.
ధోనీ గడచిన సంవత్సరంలో కొనుగోలు చేసిన తన 'ఎక్స్132 హెల్‌క్యాట్' సూపర్‌బైక్‌తో సర్కూట్‌పై 5.14 కి.మీ. మేర చక్కర్లు కొట్టగా, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అలా సరదాగా టాక్సీ రైడ్ చేశారు. పేస్‌మ్యాన్ ఇషాంత్ శర్మ తన ఆడి ఆర్ఎక్స్5 సూపర్‌కారులో వేగాన్ని ఎంజాయ్ చేయగా, యువ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ తన స్పోర్ట్స్ కారులో షికార్లు కొట్టాడు.
స్పిన్నర్ ప్రగ్యాన్ ఓజా ధోనీ హెల్‌క్యాట్ బైక్‌ను ఇషాంత్ శర్మ కారును నడిపాడు. అజింక్యా రాష్నే కూడా హైస్పీడ్ యాక్షన్ టెస్ట్ చేశాడు. సచిన్ ఈ ట్రాక్‌పై జరిగిన తొలి ఇండియన్ గ్రాండ్ ప్రి 2011ను ప్రారంభించిన సంగతి తెలిసినదే. ధోనీ తొలిసారిగా ఈ ఫార్ములా వన్ రేస్ ట్రాక్‌ను సందర్శించాడు. వేగం అంటే ఇష్టపడే మహేంద్ర సింగ్ ధోనీ స్వతగా ఓ సూపర్ బైక్ రేసింగ్ టీమ్‌ను కూడా కలిగి ఉన్నాడు. ఇంత ఆలస్యంగా ఈ ట్రాక్‌ను ఎందుకు సందర్శించానా అని ధోనీ వాపోయాడు.
ఈ రేస్ ట్రాక్‌పై డ్రైవ్ చేయటం ఓ అద్భుతమైన అనుభూతి అని, ఈ ట్రాక్‌ను సందర్శించడంలో లేట్ చేసినప్పటికీ, ఇకపై జరగబోయే అన్ని సూపర్ స్పోర్ట్స్ సిరీస్ రేస్‌లకు ఇక్కడి విచ్చేస్తానని, ఈ ట్రాక్‌పై హెల్‌క్యాట్‌ను రైడ్ చేయటం బాగానే ఉన్నప్పటికీ, ఈసారి స్పోర్ట్స్ బైక్‌ను తీసుకువస్తానని ధోనీ చెప్పుకొచ్చాడు. విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. అత్యుత్తమమైన అనుభూతులలో ఇదొకటని, తాను ఇంత వేగంగా ఎప్పుడూ నడపలేదని చెప్పాడు.

బిఐసి ట్రాక్‌పై ఇండియన్ క్రికెటర్స్

బిఐసి ట్రాక్‌పై ఇండియన్ క్రికెటర్స్
తన హెల్‌క్యాట్ బైక్‌తో రేస్ ట్రాక్‌పై పరుగులు పెట్టేందుకు సిద్ధమవుతున్న మహేంద్ర సింగ్ ధోనీ.

బిఐసి ట్రాక్‌పై ఇండియన్ క్రికెటర్స్
తన ఆడి ఆర్ఎక్స్5 కారుతో ఇషాంత్ శర్మ.

బిఐసి ట్రాక్‌పై ఇండియన్ క్రికెటర్స్
రెడీ వన్.. టూ.. త్రీ.. వేగాన్ని రుచి చూసేందుకు ధోనీ సిద్ధం.

బిఐసి ట్రాక్‌పై ఇండియన్ క్రికెటర్స్
రేస్ ట్రాక్‌పై ధనాధన్ ధోనీ

బిఐసి ట్రాక్‌పై ఇండియన్ క్రికెటర్స్
మలుపుల వద్ద సైతం తగ్గని ధోనీ వేగం.

బిఐసి ట్రాక్‌పై ఇండియన్ క్రికెటర్స్
రైడ్ ముగిసిన తర్వాత తన అనుభూతిని వివరిస్తున్న ధోనీ.

బిఐసి ట్రాక్‌పై ఇండియన్ క్రికెటర్స్
బిఐసి రేస్ ట్రాక్‌పై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్.

బిఐసి ట్రాక్‌పై ఇండియన్ క్రికెటర్స్
బిఐసి రేస్ ట్రాక్‌పై విరాట్ కోహ్లీ.

బిఐసి ట్రాక్‌పై ఇండియన్ క్రికెటర్స్
బిఐసి ట్రాక్ రికార్డులను పరిశీలిస్తున్న సచిన్ టెండూల్కర్

బిఐసి ట్రాక్‌పై ఇండియన్ క్రికెటర్స్
బిఐసి ట్రాక్ రికార్డులపై ఆటోగ్రాఫ్ చేస్తున్న మహేంద్ర సింగ్ ధోనీ.

బిఐసి ట్రాక్‌పై ఇండియన్ క్రికెటర్స్
బిఐసి రేస్ ట్రాక్‌పై మహేంద్ర సింగ్ ధోనీ.

బిఐసి ట్రాక్‌పై ఇండియన్ క్రికెటర్స్
రేస్ ట్రాక్ గురించి వివరిస్తున్న సర్క్యూట్ స్టాఫ్.

బిఐసి ట్రాక్‌పై ఇండియన్ క్రికెటర్స్

బిఐసి ట్రాక్‌పై ఇండియన్ క్రికెటర్స్

బిఐసి ట్రాక్‌పై ఇండియన్ క్రికెటర్స్

బిఐసి ట్రాక్‌పై ఇండియన్ క్రికెటర్స్

బిఐసి ట్రాక్‌పై ఇండియన్ క్రికెటర్స్

బిఐసి ట్రాక్‌పై ఇండియన్ క్రికెటర్స్



Click it and Unblock the Notifications








