మనసున్న 'మహీంద్రా'.. ఎంతమంది క్రికెటర్లకు థార్ గిఫ్ట్ ఇచ్చారో తెలుసా ! ఇక్కడ చూడండి

దేశీయ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) ఇటీవక 'సర్పరాజ్ ఖాన్' తండ్రికి మహీంద్రా థార్ (Mahindra Thar) కారును గిఫ్ట్‌గా ప్రకటించారు. అయితే ఈయన అంతకు ముందు ఎవరెవరికి మహీంద్రా థార్ గిఫ్ట్‌గా ఇచ్చారనేది ఈ కథనంలో తెలుసుకుందాం.

సర్పరాజ్ ఖాన్ (Sarfaraz Khan)

ఇటీవల ఇంగ్లాండ్ క్రికెట్ టీమ్‌తో జరిగిన మ్యాచ్‌లో చెలరేగి అద్భుతమైన ప్రదర్శన చూపించిన 'సర్పరాజ్ ఖాన్' (Sarfaraz Khan) ఎంతోమంది క్రికెట్ అభిమానుల మనసు గెలుచుకున్నాడు. కొడుకు మ్యాచ్ చూసి తండ్రి నౌషాద్ ఖాన్ కంటతడి పెట్టారు. ఈ భావోద్వేగమైన క్షణాలు ఎంతోమంది నెటిజన్ల గుండెలను తాకాయి. ఇది చూసిన ఆనంద్ మహీంద్రా వారికి థార్ SUVని గిఫ్ట్‌గా స్వీకరించమని, అది తనకు చాలా ఆనందాన్ని కలిగిస్తుందని ట్వీట్ చేశారు.

Sarfaraz Khan

శుభ్‌మన్ గిల్ (Shubman Gill)

ఆస్ట్రేలియా మరియు భారత్ మధ్య 2021లో జరిగిన మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ అత్యుత్తమ ప్రదర్శన కనపరిచి, ఆస్ట్రేలియా మీద 2 - 1 తేడాతో భారత్ విజయానికి కీలక పాత్ర పోషించారు. దీనికి మెచ్చిన ఆనంద్ మహీంద్రా 'శుభ్‌మన్ గిల్'కు మహీంద్రా కంపెనీ యొక్క అద్భుతమైన ఆఫ్ రోడర్ థార్ SUVని గిఫ్ట్‌గా ప్రకటించారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా అప్పట్లోనే నెట్టింట్లో వైరల్ అయ్యాయి.

మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj)

బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ 2020 - 21 విజయం సాధించిన సమయంలో శుభ్‌మన్ గిల్‌తో పాటు మహ్మద్ సిరాజ్ కూడా అద్భుతమైన ప్రదర్శన కనపరిచారు. జట్టులో ప్రధాన వికెట్ టేకర్‌గా నిలిచిన ఇతనికి ఆనంద్ మహీంద్రా థార్ SUV గిఫ్ట్ ఇచ్చారు. సిరాజ్ మహీంద్రా థార్ SUVను ఇప్పటికే డెలివరీ కూడా తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చూడవచ్చు.

Mohammed Siraj

శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur)

ఇండియా టీమ్ ఫాస్ట్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ ప్రదర్శనకు మెచ్చిన ఆనంద్ మహీంద్రా.. అతనికి కూడా థార్ SUV గిఫ్ట్ ఇచ్చారు. 2024 రంజీ ట్రోఫీలో ముంబై జట్టు తరపున ప్రదర్శన కనపరిచారు. దీంతో 'శార్దూల్ ఠాకూర్'కు థార్ గిఫ్ట్‌గా లభించింది. మహీంద్రా థార్ కారును గిఫ్ట్‌గా స్వీకరించిన తరువాత ఠాకూర్ ఆనంద్ మహీంద్రాకు కృతజ్ఞతలు తెలిపారు.

తంగరాసు నటరాజన్ (Thangarasu Natarajan)

2020 - 21 బోర్డర్ - గవాస్కర్ రంజీ ట్రోఫీ విజయానికి కారణమైన వారిలో నటరాజన్ ఒకరు. నటరాజన్ ప్రదర్శనకు ముగ్దుడైన ఆనంద్ మహీంద్రా.. థార్ SUV గిఫ్ట్ ఇచ్చారు. నటరాజన్ రెడ్ కలర్ మహీంద్రా థార్ SUVని డెలివరీ తీసుకున్నారు. కారు అందుకున్న తరువాత ఆనంద్ మహీంద్రాకు కృతజ్ఞతలు తెలిపారు. ఇవన్నీ నెట్టింట్లో అప్పట్లోనే తెగ వైరల్ అయ్యాయి.

Thangarasu Natarajan

మహీంద్రా థార్ (Mahindra Thar)

భారతీయ మార్కెట్లో ప్రారంభం నుంచి గొప్ప అమ్మకాలతో ముందుకు దూసుకెళ్తున్న మహీంద్రా థార్ ఇప్పటికి కూడా అత్యద్భుతమైన అమ్మకాలను పొందుతోంది. మూడు ఇంజిన్ ఆప్షన్స్ కలిగిన ఈ ఆఫ్ రోడర్ మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి ఉండటమే కాకుండా పనితీరు పరంగా కూడా ఉత్తమంగా ఉంటుంది. ఈ SUV ధరలు మార్కెట్లో రూ.11.25 లక్షల నుంచి రూ.17.20 లక్షల మధ్య ఉన్నాయి.

దేశీయ మార్కెట్లో ఎంతోమంది వాహన ప్రేమికుల మనసుదోచిన ఈ మహీంద్రా థార్ SUV త్వరలోనే 5 డోర్ వెర్షన్ రూపంలో భారతీయ విఫణిలో విడుదల కానుంది. ఇప్పటికే పలు సందర్భాల్లో టెస్టింగ్ సమయంలో కనిపించింది. ఈ SUV సాధారణ థార్ మాదిరిగా అనిపించినప్పటికీ పరిమాణం పరంగా కొంత విశాలంగా ఉంటుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.

More from DriveSpark

Article Published On: Wednesday, February 21, 2024, 10:05 [IST]
English summary
Indian cricketers received thar suv as gift from anand mahindra
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+