ఆ కార్లపై భారతీయుల క్రేజ్‌.. డబ్బుకు అస్సలు వెనుకడాటం లేదట.!!

దేశంలో కార్ల వినియోగం క్రమంగా పెరుగుతోంది. చాలా వరకు సొంత వాహనాలకే ప్రాధాన్యత ఇస్తూ తమ బడ్జెట్‌ ధరలో కార్లను కొనుగోలు చేస్తున్నారు. అయితే కార్లలో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి కొత్త కార్లు(New Cars).. మరొకటి పాత కార్లు(Old Cars). కాగా జనం ఎక్కువగా కొత్త కారు కొనేందుకే మొగ్గు చూపుతున్నారని ఓ సర్వేలో వెల్లడైంది. పూర్తి సమాచారం ఈ కథనంలో..

భారత్‌లో పాత కార్ల కంటే ఆధునిక టెక్నాలజీతో వస్తున్న కొత్త కార్లు కొనడానికే కస్టమర్లు ఆసక్తి కనబరుస్తున్నారని ఓ నివేదిక చెబుతోంది. డెలాయిట్‌ యొక్క 2024 గ్లోబల్‌ ఆటోమోటివ్‌ కన్జ్యూమర్‌ స్టడీ(GACS) నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దాదాపు 50 శాతం మంది భారతీయ కస్టమర్లు కొత్త టెక్నాలజీతో ఉన్న కార్లను కొనుగోలు చేస్తున్నారని వెల్లడించింది.

Indians-Prefer-New-Cars-Than-Old-Cars

ఆటో మొబైల్‌ రంగంలో విస్తృతమైన మార్పులతో కస్టమర్ల ప్రాధాన్యతలో కూడా మార్పులు వచ్చాయని GACS చెబుతోంది. పర్యావరణానికి(Indians Prefer New Cars Than Old Cars) హాని కలిగించే ఐసీఈ వాహనాలకు ప్రత్యామ్నాయంగా హైబ్రిడ్‌ ఎలక్ట్రిక్‌ కార్లను కొనుగోలు చేసేందుకు దాదాపు 24 శాతం మంది ఆసక్తి కనబరుస్తున్నాని సర్వే వెల్లడించింది.

కాగా ఎవరు ఏ కొంటారు అనేది వారు పెట్టే బడ్జెట్‌పై ఆధారపడి ఉంటుంది. అయితే 80 శాతం మంది వినియోగదారులు రూ. 5 లక్షల నుంచి రూ. 25 లక్షల ధరలో మధ్య వాహనాలను ఎంచుకుంటున్నారని(Hybrid Electric Cars) వెల్లడైంది. కాగా ఈ ధరల మధ్యలో ఇంకో ఆసక్తికరమైన విషయం కూడా ఉంది.

Indians-Prefer-New-Cars-Than-Old-Cars

ముఖ్యంగా రూ. 10 లక్షల నుంచి రూ. 25 లక్షల ధర మధ్యలో కార్లను కొనుగోలు చేసే కస్టమర్లలో.. 59 శాతం పెట్రోల్‌ లేదా డీజిల్‌ కార్లను కొనుగోలు చేస్తుండగా.. 58 శాతం మంది ఎలక్ట్రిక్‌ కార్లకు ప్రాధాన్యత ఇస్తున్నారట.. రూ. 10 లక్షల కంటే తక్కువ ధర కలిగిన వాహనాల్లో ఐసీఈ వాహనాలకు 23 శాతం మంది డిమాండ్‌ ఉండగా.. 22 శాతం మంది ఈవీలను కొనుగోలు చేస్తున్నారట.

కాగా పర్యావరణం హితం కోసం ఆలోచిస్తూ హైబ్రిడ్‌, ఎలక్ట్రిక్‌(Electric Cars) కార్ల వైపు 68 శాతం మళ్లుతండగా.. 63 శాతం మంది ఫ్యూయెల్‌ ఖర్చుల తగ్గుతాయని భావనపై HEV, EV మోడల్‌ కార్లను ఎక్కువగా కొంటున్నారని నివేదికలో వెల్లడైంది. అయితే ఎలక్ట్రిక్‌ కార్లు కొనుగోలు చేయాలంటే ఛార్జింగ్‌ మౌళిక సదుపాయాల లభ్యత ఇక్కడ కీలకం.

Indians-Prefer-New-Cars-Than-Old-Cars

ఎలక్ట్రిక్‌ కార్లకు ప్రాధాన్యత ఇచ్చేవారిలో 66 శాతం మంది తమ వాహనాలను ఇంటి వద్దే ఛార్జింగ్‌ చేయాలని భావిస్తుండగా.. 22 శాతం మంది పబ్లిక్‌ ఛార్జింగ్‌ స్టేషన్లను ఎంచుకుంటున్నారు. అంతేకాకుండా DC ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను సెలెక్ట్‌ చేసుకుంటున్నారు. ఇక పేమెంట్‌ విషయంలో క్యాష్‌ కంటే క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల చెల్లింపులనే చెల్లింపులనే ఎక్కువగా సౌకర్యంగా ఫీల్‌ అవుతున్నారని GACS చెబుతోంది.

సాధారణంగా ఎలక్ట్రిక్‌ కార్లలో ఛార్జింగ్‌ సమయం, మౌళిక సదుపాయాల లభ్యత, బ్యాటరీ సేఫ్టీ లాంటి సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ హైబ్రిడ్‌ టెక్నాలజీకి కస్టమర్లు ప్రాధాన్యత ఇస్తున్నట్లు అధ్యయనం వెల్లడిస్తోంది. బ్యాటరీ మెయింటెనెన్స్‌, ప్రత్యేకమైన రీసైక్లింగ్‌ కంపెనీలపై నమ్మకంతో భారతీయులు.. ఐసీఈ వాహనాలను పక్కనబెట్టి హైబ్రిడ్‌ ఎలక్ట్రిక్‌ కార్లను కొనుగోలు చేసేందుకు చూస్తున్నారట.

Indians-Prefer-New-Cars-Than-Old-Cars

ఈ అధ్యయనం ద్వారా ఆటోమోటివ్‌ రంగంలో వస్తున్న మార్పులను తెలియజేస్తుంది. దీని ద్వారా కస్టమర్లు ఆధునిక టెక్నాలజీకి ఎంతగా స్వీకరిస్తున్నారో స్పష్టమవుతుంది. కారు ధరతో పోలిస్తే అందులో లభించే ఫీచర్లు, ఎకో ఫ్రెండ్లీ ఆప్షన్లను ఎక్కువగా ఇష్టపడుతున్నారని తెలుస్తోంది. అంతే కాకుండా కారు కొనుగోలు చేయగానే.. 83 శాతం మంది కస్టమర్లు వారి సేఫ్టీ, ఖర్చుల ఆదాను దృష్టిలో ఉంచుకుని నేరుగా ఇన్సూరెన్స్‌ చేయించడానికి ఆసక్తి చూపిస్తున్నారని సర్వే చెబుతోంది.

ఎక్కువగా యువ కస్టమర్లు వాహన సబ్‌స్క్రిప్షన్లు చేసుకునేందుకు కూడా ముందుకు వస్తున్నారు. దీని ద్వారా కొత్త ఫీచర్లను తెలుసుకోగలుగుతున్నారు. ఇంకా కారు కొనుగోలు చేసిన అనంతరం తమ ఫీడ్‌బ్యాక్‌, డ్రైవింగ్‌ అనుభవాలను కార్ల తయారీదారులతో పంచుకోవడంతో.. ఆ రివ్యూ ద్వారా భద్రతకు మరింత ప్రాధాన్యత ఆటో మేకర్లు తమ ఉత్పత్తులను రూపొందిస్తున్నారు.

More from DriveSpark

Article Published On: Friday, March 8, 2024, 11:16 [IST]
English summary
Indian customers prefer new cars over used ones here you should know why
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+