2016 ఆర్థిక సంవత్సరంలో 11 శాతం పెరగనున్నఇంధన వినియోగం
2016 ఆర్థిక సంవత్సరానికి భారత్‌కు సాధారణంగా కన్నా 11 శాతం ఎక్కువ ఇంధన కావాల్సి ఉంటుంది. గత రెండేళ్ల కాలం నుండి పరిశీలించినట్లయితే దేశీయంగా ఇంధన వినియోగం భారీగా పెరుగుతోంది.

మార్చి 31 వరకు లెక్కగట్టిని ఇంధన వినియోగంలో గత అర్థిక సంవత్సరంలో సుమారుగా 183.5 మిలియన్ టన్నుల ఇంధనాన్ని భారత్ వినియోగించుకుంది. అంతకు ముందు ఏడాదిలో 165.5 మిలియన్ టన్నుల ఇంధనాన్ని ఇండియా వినియోగించుకుంది. వీటి మధ్య తేడాను పరిశీలించినట్లయితే 10.9 శాతం ఇంధన వినియోగం పెరిగింది. దీనికి సంభందించిన డేటాను కేంద్ర ఇంధన శాఖ విడుదల చేసింది.
Also Read: విశ్వంలో ఉన్న అతి పెద్ద విమానం ఎయిర్‌బస్ ఎ380 గురించి ఆసక్తికర విషయాలు
మార్చి నెలలో మాత్రమే 16.42 నుండి 17.09 టన్నుల ఇంధన వినియోగం జరిగింది అయితే గత ఏడాది ఇదే మార్చి నెలలో ఇంధ వినియోగం 14.67 టన్నుల ఇంధన వినియోగం జరిగింది. ఈ వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే పెట్రోల్ మరియు డీజల్ వినియోగం రానున్న 2016-23017 ఆర్థిక సంవత్సరంలో 11 శాతం మేర పెరగనున్నట్లు అంచనాలు.
Also Read: నార్వే రాజు కోసం ప్రత్యేకంగా పొడవైన ఆడి ఏ8ఎల్
ప్రస్తుతం ఇండియాలో ఇంధన వినియోగం పెరగడానికి వ్యవసాయం పరంగా వాహనాలను వినియోగించడం, గత కొన్నేళ్లనుండి వాహనాలను ఎక్కువగా కొనుగోలు చేయడం మరియు పెట్రోల్ మరియు డీజల్ ధరల మధ్య తక్కువ వ్యత్యాసం ఉండటం వంటి కారణాల వలన దేశీయంగా పెట్రోల్ మరియు డీజల్ డిమాండ్ పెరుగుతోంది.
మానవరహిత సంయుక్త యుద్ద నౌకను రూపొందించిన అమెరికా
15 లక్షల విలువ చేసే విమాన ప్రయాణాన్ని రూ. 7,000 లతో చేశాడు
నాగసాకి, హిరోషిమా నగరాల మీద బాంబుల వర్షం కురిపించిన చారిత్రక విమానం గురించి


Click it and Unblock the Notifications








