22 ఏళ్లకే ఆన్‌లైన్ గేమింగ్ ద్వారా కోట్లు విలువ చేసే కార్లు కొన్న యూట్యూబర్.. కొత్తగా లంబోర్ఘిని హురాకాన్ సైతం
ప్రస్తుతం ప్రపంచమంతా డిజిటల్ ట్రెండ్ నడుస్తోంది. చాలా మంది చిన్న వయసు నుంచే కొత్త టెక్నాలజీలను ఉపయోగించుకుని కోట్లలో సంపాదిస్తున్నారు. ముఖ్యంగా యూట్యూబర్‌లు ఇతర వ్యాపారస్తులు, ఉద్యోగార్థుల కంటే కూడా ఎక్కువగా సంపాదన ఆర్జిస్తూ, ఖరీదైన భవనాలు, లగ్జరీ కార్లు, ఇతర ఆస్తులను కొనుగోలు చేస్తుంటారు. ఇటీవల కాలంలో యూట్యూబర్‌ల లగ్జరీ స్టైల్ గురించి కొన్ని వార్తలు కూడా వచ్చాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. జోనాథన్ అనే 22 ఏళ్ల వయసు కలిగిన యూట్యూబర్ ఆన్‌లైన్ గేమింగ్స్ ఆడుతూ కోట్లు సంపాదిస్తున్నాడు. ఇతను తాజాగా కోట్లు విలువ చేసే లంబోర్ఘిని కారును సొంతం చేసుకున్నాడు. అతను కొన్నటువంటి లగ్జరీ కారు పేరు 'హురాకాన్'. ఇది చూడటానికి స్పోర్ట్ మోడల్ లుక్‌ను కలిగి ఉంది.
జోనాథన్ కొనుగోలు చేసినటువంటి లంబోర్ఘిని హురాకాన్ డెలివరీని ఇటీవల అందుకున్నాడు. ప్రస్తుతం అతని యూట్యూబ్ ఛానెల్‌కు దాదాపు 6.5 మిలియన్ల మంది సబ్‌స్కైబర్లు ఉన్నారు. కారు డెలివరీని అందుకున్న వీడియోను తన ఛానెల్‌లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఇది బాగా వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసినట్లయితే యూట్యూబర్‌కు చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ కార్లు అంటే చాలా ఇష్టం ఉన్నట్లు తెలుస్తుంది.

ఇతని వద్ద ఇప్పటికే BMW తో పాటు ముస్టాంగ్ కార్ ఉంది. అతను షేర్ చేసిన వీడియో మొదట్లో, జోనాథన్ డీలర్ వద్దకు రావడం కనిపించింది. డీలర్ అతనికి అక్కడ ఉన్న కార్ల గురించి వివరంగా చెప్తాడు. జోనాథన్ ప్రతి మోడల్ గురించి ఆసక్తికరంగా తెలుసుకుంటాడు. వీడియోలో బెంట్లీ, బీటిల్, లంబోర్ఘిని ఉరస్ వంటివి కనిపిస్తాయి. బీటిల్ ధర రూ. 40 లక్షలు ఉంటుందని డీలర్ జోనాథన్‌కు చెప్తాడు.
తర్వాత, బెంట్లీ గురించి అడగ్గా ఇది 1.85 కోట్లు ఉంటుందని అంటాడు. మరో కారు లంబోర్ఘిని ఉరస్ ధర రూ.4 కోట్ల కంటే ఎక్కువగా ఉంటుందని వీడియోలో డీలర్ యూట్యూబర్‌కు చెబుతున్నట్టుగా ఉంది. ఆ తర్వాత అతను, తన కుటుంబంతో కలిసి క్రికెట్ స్టేడియానికి వెళ్లాడు. అనంతరం అక్కడే గేమర్ జోనాథన్ తన కుటుంబంతో కలిసి లంబోర్ఘిని హురాకాన్‌ను ఆవిష్కరించాడు.

ఈ వీడియోలో కారు డెలివరీ అందుకున్న తర్వాత కుటుంబం అంతా కలిసి సంబరాలు చేసుకున్నారు. కేక్ కట్ చేసి అందరూ ఒకరినొకరు తినిపించుకున్నారు. లంబోర్ఘిని హురాకాన్ స్పోర్ట్స్ మోడల్ లుక్ సరికొత్తగా ఉంది. దీని ధర రూ.3.21 కోట్ల నుంచి 4.99 కోట్ల వరకు ఉంటుంది. ఈ ధరలు ఎక్స్‌షోరూమ్ ఢిల్లివి. ఈ కారు బ్లాక్ వీల్స్‌తో చాలా అందంగా ఉంది.
లంబోర్ఘిని హురాకాన్ 5.2 L V10 ఇంజిన్‌తో రన్ అవుతుంది. ఇది 640 hp పవర్, 600 Nm గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 7-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంది. ప్రధానంగా హురాకాన్ స్పైడర్, కూపే డిజైన్‌లతో వచ్చింది. జోనాథన్ మాత్రం కూపేనే ఎంచుకున్నట్లు తెలుస్తుంది. ఈ వేరియంట్ దాదాపు 0 నుంచి 100 కి.మీ వేగాన్ని 2.9 సెకన్ల నుంచి 3.5 సెకన్లలో అందుకుంటుంది.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








