కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. అధునాతన యుద్ధ విమానాల కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్..!
భారత దేశంలో రక్షణ రంగ పరంగా కీలక స్థానంలో ఉంది. భారీ సంఖ్యలో సైనిక దళాలతోపాటు అధునాతన వస్తువులను కలిగి ఉన్నారు. దీంతోపాటు ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం వీటిని అప్‌గ్రేడ్ చేస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ చర్య ద్వారా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (Indian Airforce) మరింత బలోపేతం కానుంది.
కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కోసం 12 Su-30 MKI జెట్‌ల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విమానాలను భారత్‌లోనే తయారు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారుచేయనుంది. ఈ విమానాల్లో 60 శాతం విడిభాగాలను దేశీయంగా తయారుచేయనున్నారు.

దేశీయంగా తయారీ : రష్యాకు చెందిన ప్రముఖ విమానాల తయారీ సంస్థ సుఖోయ్‌తో కలిగి హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఈ జెట్‌లను తయారుచేయనుంది. భారత వైమానిక దళంలో ఇప్పటికే 260 ఈ తరహా యుద్ద విమానాలున్నాయి. కొత్తగా తయారుకానున్న ఫైటర్ జెట్‌లు మరింత అధునాతర టెక్నాలజీని కలిగి ఉంటాయని తెలుస్తోంది.
ప్రతికూల వాతావరణంలోనూ తయారీ : Su-30MKI ఫైటర్ జెట్‌లు మల్టీ రోల్ ఎయిర్ డామినెన్స్ ఫైటర్ జెట్‌లు. ఇవి ఆస్ట్రా Mk-1 లాంగ్ రేంజ్ ఎయిర్ టూ ఎయిర్, బ్రహ్మోస్ ఎయిర్ లాంచ్ క్షిపణులు సహా అనేక రకాల ఆయుధాలను మోయగలదు. ప్రస్తుత 4.5 తరం Su-30Mk1 ప్రతికూల వాతావరణంలోనూ అధిక, తక్కువ వేగాల్లో మెరుగైన సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

గాల్లోనే ఇంధనం నింపుకొనే సామర్థ్యం : ఈ పైటర్ జెట్‌లు 90 డిగ్రీల వద్ద కూడా నేరుగా ఆకాశంలోకి ఎగరగలవు. ఈ విమానాలు పెద్ద ఇంధన ట్యాంక్‌లతో అందించబడతాయి. మరియు గాల్లోనే ఇంధనం నింపుకొనే సామర్థ్యం ఈ విమానాల సొంతం. భారత ప్రభుత్వం గత 20 సంవత్సరాలుగా Su-30MKI యుద్ధ విమానాలను వినియోగిస్తోంది.
భారత్ దేశ బడ్జెట్‌లో గణనీయ స్థాయిలో రక్షణ రంగానికి కేటాయిస్తోంది. అధునాతన రక్షణ వ్యవస్థలు కొనుగోలు చేయడం సహా కొన్నింటిని అప్‌గ్రేడ్ చేస్తోంది. సైనిక దళాలకు అధునాతన ఆయుధాలు సరఫరా సహా ఇతర ఏర్పాట్లు చేస్తున్నారు. ఫలితంగా రక్షణ దళాల ఆధునికరణ జరుగుతుంది.

గతంతో పోలిస్తే సైనిక దళాల అధునికీకరణకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. రఫేల్ జెట్‌లు ఇప్పటి వరకు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అందుకుంది. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో వైమానికి దళం బలోపేతం అయింది. అయితే తాజా SU-30MK1 ఫైటర్ జెట్‌లతో భారత వైమానిక దళం మరింత బలోపేతం కానుంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








