సూపర్ కార్లలో ఇండియన్ బామ్మలు.. వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

భారతదేశంలో ఖరీదైన అన్యదేశ్య కార్లు అరుదుగా కనిపిస్తాయి. అయితే యూఏఈ వంటి అరబ్ దేశాల్లో ఖరీదైన కార్లు సర్వసాధారంగా కనిపిస్తాయి. సూపర్ కార్లు, కోట్ల విలువ చేసే కార్లు కూడా ఆ దేశాల్లో విరివిగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ ఖరీదైన కార్లను లేదా సూపర్ కార్లను యువత మాత్రమే ఎక్కువ డ్రైవ్ చేయడం చూసి ఉంటాము. కానీ ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఇద్దరు బామ్మలు లంబోర్గినీ హురాకాన్ మరియు ఉరుస్‌ వంటి కార్లలో ప్రయాణించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం..

సోషల్ మీడియాలో వైరాల్ అవుతున్న వీడియోలో మొదట బామ్మ మెర్సిడెస్ బెంజ్ కారులో కూర్చుని ఉండటం చూడవచ్చు. ఆ సమయంలో అక్కడున్న వ్యక్తి.. (బహుశా మనవడు అయి ఉండొచ్చు) బామ్మను ఫెరారీ కావాలా, పోర్స్చే కారు కావాలా అని అడిగినప్పుడు, రెండు వద్దు లంబోర్ఘిని కావాలని చెబుతుంది. ఆ తరువాత ఇద్దరు బామ్మలు కనిపిస్తారు. నిజానికి మనదేశంలో చాలామంది బామ్మలకు సూపర్ కార్ల గురించి పెద్దగా తెలియదు.

Indian Grandmas Experience Expensive Lamborghini

సూపర్ కార్లను డ్రైవ్ చేయడం కొంత కష్టంతో కూడుకున్న పనే. వీడియోలో ఇద్దరు బామ్మలు లంబోర్ఘిని హురాకాన్ మరియు ఉరుస్ కార్ల పక్కన నిలబడి ఉండటం కనిపిస్తుంది. ఈ వీడియో షేర్ చేస్తూ వయసు కేవలం సంఖ్య మాత్రమే అని క్యాప్షన్ ఇచ్చి ఉండటం కూడా చూడవచ్చు. వీడియోలో కమనిస్తే ఇద్దరు బామ్మలు కార్లలోకి వెళతారు. ఇందులో ఒక బామ్మ హురాకాన్‌లోకి ప్రవేశిస్తుంది, మరొకరు ఉరుస్‌లోకి ప్రవేశిస్తారు.

ఇలాంటి స్పోర్ట్స్ కార్లలోకి వెళ్లడం మరియు బయటకు రావడం కూడా కొంత కష్టంతో కూడుకున్న పని. ఇది వృద్దులకు మరింత కష్టమైన పని. అయితే మొత్తం మీద ఎడారిలో బామ్మలు సూపర్ కార్లలో ప్రయాణిస్తారు. అయితే కార్లను డ్రైవర్స్ డ్రైవ్ చేసినట్లు తెలుస్తోంది. కార్లను వేగంగా డ్రైవ్ చేస్తూ డ్రైవర్స్ ఇసుకలో దుమ్మురేపడం కూడా ఇక్కడ చూడవచ్చు. అయితే బామ్మలు ఏ మాత్రం భయపడినట్లు ఎక్కడా కనిపించలేదు.

Indian Grandmas Experience Expensive Lamborghini

లంబోర్ఘిని ఉరస్ అనేది 4 వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో కూడిన సరైన SUV. కాబట్టి ఇది డూన్ బాషింగ్ మరియు ఆఫ్ రోడింగ్‌ను నిర్వహించగలదు. డ్రైవర్ ఉరుస్‌ను రెండుసార్లు ఇసుకలోకి తీసుకువెళతాడు, ఆ తరువాత హురాకాన్ రోడ్డుపై డ్రైవ్ చేస్తారు. వారిద్దరూ రోడ్డు మీద మరియు బయట సరదాగా గడిపారు. బామ్మలు సూపర్ కార్లను డ్రైవ్ చేయలేదు.

దుబాయ్‌లో అన్ని వాహనాలకు ఎడమ వైపు స్టీరింగ్ ఉంటుంది. బామ్మలు కుడి వైపు నుంచి కార్లలోకి వెళ్తారు. కాబట్టి బామ్మలు కార్లను డ్రైవ్ చేయలేదని స్పష్టంగా తెలుస్తోంది. ఇక్కడ కనిపించే లంబోర్ఘిని ఉరుస్ ఇటాలియన్ సూపర్ కార్ తయారీదారు యొక్క మొట్టమొదటి నాలుగు డోర్ల SUV. దీనికి గ్లోబల్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఎక్కువమంది లంబోర్ఘిని ప్రియులు ఈ కార్లనే ఇష్టపడి కొనుగోలు చేస్తారు.

వీడియోలో కనిపించే ఉరుస్ 4.0-లీటర్ ట్విన్ టర్బో వీ8 ఇంజిన్‌ పొందినట్లు సమాచారం. ఇది 666 పీఎస్ పవర్, 850 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది దాని పాత వెర్షన్ కంటే 16 పీఎస్ పవర్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక హురాకాన్ 5.2-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ కలిగిన రెండు సీట్ల స్పోర్ట్స్ కారు. వీటి ధరలు రూ.4 కోట్ల (ఎక్స్-షోరూమ్) కంటే ఎక్కువని తెలుస్తోంది.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Monday, July 8, 2024, 12:30 [IST]
English summary
Indian grandmas experience expensive lamborghini cars in dubai
Read more on: #off beat #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+