లాక్‌డౌన్‌లో కారు, బైకు కాదు ఏకంగా హెలికాఫ్టర్ తయారు చేసేసాడు: పూర్తి వివరాలు

కరోనా మహామ్మారి ప్రపంచాన్నే ముప్పుతిప్పలు పెట్టి అందరిని ఇళ్లకే పరిమితం చెసింది. ఈ లాక్ డౌన్ సమయంలో చాలామంది వ్యక్తులు తమ సమయాన్ని వృధాకానీయకుండా.. వారిలోని సృజనాత్మకతను బయటకు తీశారు. ఈ విధంగా కొన్ని ఎలక్ట్రిక్ బైకులు, చెక్కతో తయారైన సైకిల్స్ పుట్టుకొచ్చాయి. అయితే కేరళకు చెందిన ఒక వ్యక్తి ఏకంగా హెలికాఫ్టర్ తయారు చేశారు. వినటానికి కొంత ఆశ్చర్యంగా ఉన్నా.. ఇదే నిజం. ఇంతకీ లాక్ డౌన్ సమయంలో హెలికాఫ్టర్ తయారు చేసిన వ్యక్తి ఎవరు, తయారు చేయడానికి ఎంత ఖర్చు అయ్యింది అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూద్దాం.. రండి.

లాక్‌డౌన్‌లో కారు, బైకు కాదు ఏకంగా హెలికాఫ్టర్ తయారు చేసేసాడు: పూర్తి వివరాలు

కేరళ రాష్ట్రంలోని అలప్పుజాకు చెందిన 'అశోక్ అలిసెరిల్ థమరాక్షన్' అనే తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణించేందుకు ఎప్పటి నుంచో చిన్న విమానం ఉంటె బాగుంటుందని అనుకుంటూనే ఉన్నాడు. అయితే అతనికి కరోనా లాక్‌డౌన్ ఒక రకంగా కలిసి వచ్చింది. ఆ సమయంలో ఏమాత్రం ఆలోచించకుండా 4 సీటర్ హెలికాఫ్టర్ తయారు చేసారు.

లాక్‌డౌన్‌లో కారు, బైకు కాదు ఏకంగా హెలికాఫ్టర్ తయారు చేసేసాడు: పూర్తి వివరాలు

అశోక్ అలిసెరిల్ థమరాక్షన్ నిజానికి మెకానికల్ ఇంజనీర్ కావడం ఈ హెలికాఫ్టర్ తయారీకి మరింత ఉపయోగపడింది. మొత్తం మీద దాదాపు 18 నెలలు కృషి చేసి నలుగురు వ్యక్తులు ప్రయాణించడానికి అవసరమయ్యే ఒక చిన్న హెలికాఫ్టర్ తయారు చేశారు. ఆ హెలికాఫ్టర్ కి తన చిన్న కూతురు 'దియా' పేరు పెట్టాడు. కావున ఈ హెలికాఫ్టర్ మీద జి-దియా అని ఉండటం కూడా చూడవచ్చు.

లాక్‌డౌన్‌లో కారు, బైకు కాదు ఏకంగా హెలికాఫ్టర్ తయారు చేసేసాడు: పూర్తి వివరాలు

అశోక్ ఈ హెలికాఫ్టర్ తయారు చేయడానికి జోహన్నెస్‌బర్గ్‌లోని స్లింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ నుంచి అసెంబ్లీ కిట్‌ను కొనుగోలు చేశాడు. మొత్తం ఈ హెలికాఫ్టర్ తయారు కావడానికి రూ. 1.8 కోట్లు ఖర్చు అయినట్లు తెలిపాడు. హెలికాఫ్టర్ నిర్మాణం పూర్తయిన తరువాత దానిని UK పౌర విమానయాన అధికారులు కూడా పర్యవేకసించడం కూడా జరిగింది.

లాక్‌డౌన్‌లో కారు, బైకు కాదు ఏకంగా హెలికాఫ్టర్ తయారు చేసేసాడు: పూర్తి వివరాలు

అశోక్ తయారు చేసిన ఈ 4 సీటర్ విమానం గరిష్టంగా గంటకు 200 కిమీ వేగంతో ప్రయాణించగలదు. అదే సమయంలో ఇది గంటకు 20 లీటర్ల ఇంధనం ఉపయోగించుకుంటుంది. దీని ఫ్యూయెల్ టాక్ కెపాసిటీ దాదాపు 180 లీటర్ల వరకు ఉంటుంది. కావు దూరప్రయాణాలకు కూడా ఇది చాలా అనుకూలంగా ఉంటుంది.

లాక్‌డౌన్‌లో కారు, బైకు కాదు ఏకంగా హెలికాఫ్టర్ తయారు చేసేసాడు: పూర్తి వివరాలు

ఇప్పటికే అతనికి పైలట్ లైసెన్స్ కూడా ఉంది. కావున 2018 లో 2 సీట్ల హెలికాఫ్టర్ అద్దెకు తీసుకున్నారు. ఆ తరువాత వారికి ఇద్దరు పిల్లలు పుట్టారు, కావున ఇప్పుడు వారికి 4 సీట్ల హెలికాఫ్టర్ అవసరం అయ్యింది. ఈ కారణంగానే లాక్ డౌన్ లో ఈ 4 సీటర్ విమానం తయారు చేసాడు.

లాక్‌డౌన్‌లో కారు, బైకు కాదు ఏకంగా హెలికాఫ్టర్ తయారు చేసేసాడు: పూర్తి వివరాలు

ఇప్పుడు అశోక్ అలిసెరిల్ థమరాక్షన్ తాను తయారు చేసిన హెలికాఫ్టర్ తో జర్మనీ, ఆస్ట్రియా మరియు చెక్ రిపబ్లిక్‌ వంటి దేశాలను హిత్తీ వచ్చారు. ఈ హెలికాఫ్టర్ వారి ప్రయాణానికి చాలా ఉపయోగపడుతోంది. ఇంకా మరిన్ని దేశాలు చుట్టిరావడానికి ఇది వారికి చాలా అనుకూలంగా ఉంటుంది.

లాక్‌డౌన్‌లో కారు, బైకు కాదు ఏకంగా హెలికాఫ్టర్ తయారు చేసేసాడు: పూర్తి వివరాలు

నిజానికి 'అశోక్ అలిసెరిల్ థమరాక్షన్' కేరళ మాజీ ఎమ్మెల్యే ఏవీ తమరాక్షన్ కుమారుడు. అతడు ఉన్నత చదువులు చదవడానికి 2006 లోనే UK కి వెళ్ళాడు. ఆ తరువాత 2016 లో తన భార్య మరియు ఇద్దరు కుమార్తెలతో లండన్‌లోనే స్థిరపడ్డారు. ప్రస్తుతం ఫోర్డ్ మోటార్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.

లాక్‌డౌన్‌లో కారు, బైకు కాదు ఏకంగా హెలికాఫ్టర్ తయారు చేసేసాడు: పూర్తి వివరాలు

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

కరోనా వైరస్ ఎంతో మంది ప్రజల జీవన విధానాన్ని మార్చి వేసింది. లాక్ డౌన్ సమయంలో ఎమ్ చేయాలో తెలియక చాలామంది బిక్కు బిక్కు మంటూ టీవీలకు అతుక్కోపోయారు, అయితే కొంతమంది ఆ సమయాన్ని వృధా చేయకుండా వారి సృజనాత్మకతకు రూపం పోశారు. చాలామంది ఈ లాక్ డౌన్ లో చెక్కతో సైకిల్స్ చేయడం వంటివి కూడా చేశారు, దీని గురించి ఇప్పటికే తెలుసుకున్నాం.

అయితే వాటన్నింటికి భిన్నంగా పుట్టుకొచ్చిన ఒక అరుదైన రూపమే 4 సీటర్ హెలికాఫ్టర్. నిజంగా 'అశోక్ అలిసెరిల్ థమరాక్షన్' చేసిన అద్భుత సృష్టి ఎంతోమందిని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఇది ఎంతోమంది సృజనాత్మకత కలిగిన వ్యక్తులకు ఆదర్శప్రాయం. ఎప్పటికప్పుడు ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడంతో పాటు, కొత్త బైకులు మరియు కార్లను గురించి మరింత సమాచారం తెకుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' ఫాలో అవ్వండి.

Most Read Articles

English summary
Indian man built 4 seater plane during lockdown details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X