దేశం మారిన మన సాంప్రదాయాలు మారలేదు.. విదేశంలో కొత్త విమానానికి హిందూ పూజ
భారతీయులు తమ కొత్త వాహనాలను కుటుంబంలో ఏదైనా వాహనం చేరితే దానిని కుటుంబంలో భాగంగా చూస్తారు. అయితే కొత్త వాహనాలను ఇంట్లోకి వచ్చాక ఆలయానికి తీసుకెళ్లి పూజలు చేసిన తర్వాతే వినియోగించే ఆనవాయతీ ఉంది. మనం ఇండియాలో ఉన్నప్పుడే కాదు, ప్రపంచంలో ఏ మూలన ఉన్నా మన ప్రజలకు వారి సంప్రదాయాలు, సంస్కృతికి విలువ ఇచ్చిన సందర్భాలు ఎన్నోసార్లు చూశాం. విదేశాల్లో ఉంటున్న ఓ వ్యక్తి తన ఖరీదైన చిన్న విమానానికి కొబ్బరికాయ కొట్టి పూజలు చేస్తున్న వీడియో నెట్టింట్‌లో వైరల్‌గా మారింది.
ఖరీదైన విమానానికి పూజ చేస్తున్న వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో చిన్న విమానం కోసం పూజలు చేస్తున్న వ్యక్తి పేరు ముదిత్ ఆనంద్ అనే వ్యక్తి దీనిని కొనుగోలు చేశారని తెలుస్తోంది. అలాంటి విమానాన్ని కొనాలన్నది ఆయన కలగా ఆయన చెప్పారు. విదేశాల్లో నివసిస్తున్న ముదిత్ ఆనంద్ తన హిందూ ఆచారం ప్రకారం డ్రైవింగ్ చేసే ముందు పూజలు చేశాడు.

విమానం ముందు ఓ ప్లేట్‌లో కర్పూరం, కొబ్బరికాయ, నిమ్మకాయ, ధూపం ఉంచడం వీడియోలో గమనించవచ్చు. ముదిత్ ఆనంద్ మూడు సార్లు కర్పూరంతో తీసుకొని కొబ్బరికాయ కొట్టి హిందూ ఆచారాల ప్రకారం విమానానికి పూజ కార్యక్రమాలు నిర్వహించాడు. ఆఖర్లో కొబ్బరికాయ కొట్టిన తర్వాత ముదిత్ ఆనంద్ తన చేతితో విమానం ముందు భాగంలో స్వస్తిక్ గీసి పూజను ముగించాడు.
విమానం లోపల కూడా ఈ సింబల్ పెట్టాడు. హిందూ మతంలో స్వస్తిక్ చిహ్నం శ్రేయస్సు మరియు మంచి శకునాన్ని సూచిస్తుందని అందరి నమ్మకం. విమానం లోపల, బయట కొన్ని చోట్ల ఈ చిహ్నాన్ని నిమ్మకాయలతో తొక్కించి అనంతరం ముతిత్ ఆనంద్ వెంటనే విమానం చుట్టూ ప్రదక్షిణలు చేశాడు. ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోలో చూడొచ్చు. ముదిత్ ఆనంద్‌కి పైపర్ చెరోకీ 140 అని రాసి ఉంది.

ఫైబర్ ఎయిర్ క్రాఫ్ట్ అభివృద్ధి చేసిన ఇది తేలికైన సింగిల్ ఇంజిన్ విమానం. విమానంలో మొత్తం 4 సీట్లు ఉన్నాయి. ఇలాంటి విమానాలను ఎక్కువగా పైలట్లకు శిక్షణ తరగతులకు ఉపయోగిస్తారు. విదేశాల్లోని ఎయిర్ ట్యాక్సీ సర్వీసుల్లో కూడా ఇలాంటి చిన్న విమానాలు విరివిగా గమనించవచ్చు. అలాగే, ముదిత్ ఆనంద్ వంటి చాలా మంది ఈ విమానాలను వ్యక్తిగత ఉపయోగం కోసం కొనుగోలు చేస్తారు.
చెరోకీ 140 1964 నుంచి ఉత్పత్తిలో ఉంది. మొదట్లో పైలట్లకు శిక్షణ కోసం కేవలం 2 సీట్లతో వీటిని రూపొందించారు. నాలుగు సీట్ల వెర్షన్‌ని 1971లో ప్రవేశపెట్టారు. ఈ ఇంజిన్ గరిష్టంగా 150 PS శక్తిని ఉత్పత్తి చేయగలదు. ముదిత్ ఆనంద్ పాత చెరోకీ 140 విమానాన్ని కొనుగోలు చేశాడు. భారత్ లో కూడా కొందరికి ఇలాంటి చిన్న విమానాలు ఉండటం గమనార్హం.
డ్రైవ్స్‌పార్క్ ఒపీనియన్: భారత్‌లో మనం సొంతంగా ఎంత పెద్ద విమానాన్ని కొనుగోలు చేసినా కచ్చితంగా పూజ చేసిన తర్వాతే ఉపయోగించడం ప్రారంభిస్తారు. ఆ మేరకు పూజా ఆచారాలు మన ప్రజలతో ముడిపడి ఉన్నాయి. తొలినాళ్లలో గుర్రపు బండ్ల ముందు నిమ్మకాయతో తొక్కిచండ వస్తుంది. అప్పటి నుంచి ఈ సంస్కృతి కొనసాగుతుంది. దేశంలో దీనిని అందరు ఒక ఆనవాయతీగా భావిస్తారు. ఇది భారతదేశ కట్టుబాట్లకు అద్ధం పడుతుంది.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








