వరద సహాయక చర్యలకు చేతక్ హెలికాఫ్టర్లను ఎందుకు ఉపయోగిస్తారు.. ఏంటి వీటి ప్రత్యేకత?

తమిళనాడు భారీ వర్షాలతో అతలాకుతలం అయింది. తిరునెల్వేలి, ట్యుటికోరిన్‌ జిల్లాలు సహా రాష్ట్రావ్యాప్తంగా పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఫలితంగా జనజీవనం అస్తవ్యస్తం అయింది. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రభుత్వం పెద్ద సంఖ్యలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. అయితే కొన్ని ప్రాంతాల్లో వరద ఉద్ధృతి అధికంగా ఉంది.

రుతుపవనాలు కారణంగా తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున సహాయక చర్యలను ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వ సహాయక చర్యలకు కేంద్ర రక్షణ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. దీంతో పాటు వరద ఉద్ధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో భారత నావికాదళం రంగంలోకి దిగింది.

Indian navy chetak helicopters

ఇండియన్‌ నేవీకి చెందిన AHL చేతక్‌ హెలీకాప్టర్‌లను సహాయక చర్యల కోసం వినియోగించాయి. అయితే ఇండియన్‌ నేవీ వద్ద అనేక హెలీకాప్టర్‌లు ఉండగా.. ఈ చేతక్‌ చాపర్‌లనే ఎందుకు వినియోగించింది. దీని ప్రత్యేకతలు ఏంటి, వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎటువంటి పనితీరు కనబరిచింది. ఈ కథనంలో తెలుసుకుందాం.

హిందూస్థాన్‌ ఏరోనాటిక్ లిమిటెడ్‌ తయారీ : కేంద్ర ప్రభుత్వానికి చెందిన హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (HAL).. ఈ తేలికపాటి చేతక్‌ హెలికాప్టర్‌లను తయారుచేసింది. ఇవి అధునాతన సాంకేతికతను కలిగి ఉంటాయి. 7 మంది ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణం చేయవచ్చు. మరియు రెండు టన్నుల వరకు సరకును రవాణా చేసే సామర్థ్యం ఈ హెలికాప్టర్‌ల సొంతం.

chetak helicopters

ఇండియన్‌ నేవీ వద్ద ఎన్ని హెలికాఫ్టర్లు ఉన్నాయంటే : విపత్తు రక్షణ సహా సరకు మరియు ఆయుధాల రవాణా చేసేందుకు చేతక్‌ హెలికాప్టర్‌లను ఉపయోగిస్తారు. ప్రస్తుతం భారత నావికాదళంలో (ఇండియన్‌ నేవీ) వద్ద సుమారు 350 హెలికాఫ్టర్లు ఉన్నాయి. ప్రస్తుతం ఇందులో కొన్ని తమిళనాడు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. భారత్‌ కాకుండా నమీబియా వంటి దేశాల్లో ఈ హెలికాఫర్లను వినియోగిస్తున్నారు.

సెర్చ్‌ అండ్‌ రెస్క్యూ ఆఫరేషన్‌ : చేతక్‌ హెలికాఫ్టర్‌లను సామగ్రి, గాయపడిన సిబ్బందిని తీసుకొచ్చేందుకు, సెర్చ్‌ అండ్‌ రెస్క్యూ, ఏరియల్‌ సర్వే మరియు పెట్రోలింగ్ సహా అత్యవసర వైద్య అవసరాల కోసం ఉపయోగిస్తుంది. ఈ హెలీకాప్టర్లను అన్ని రకాల డ్రిల్‌ చేయడం వల్ల ఎలాంటి సమస్య ఉత్పన్నం కాదు. అందుకే హెలికాఫ్టర్లను వరదల సహాయక చర్యలకు ఉపయోగిస్తారు.

Indian navy chetak helicopters

తమిళనాడు సహా ఇతర రాష్ట్రాల్లో వరదలు సహా పెద్ద విపత్తులు సంభవించినప్పుడు సహాయక బృందాలు చేతక్‌ వంటి తేలికపాటి హెలికాఫ్టర్‌లను ఉపయోగిస్తుంటారు. ఇవి ఎటువంటి ఇబ్బందులు లేకుండా బాధితులను సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు ఉపయోగపడతాయి. తక్కువ ఎత్తులో ఎగురుతూ బాధితులను రక్షిస్తాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Wednesday, December 20, 2023, 19:53 [IST]
English summary
Indian navy use chetak helicopter in flood relief operation
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+