సమ్మర్‌లో ట్యాంక్‌ ఫుల్‌ చేస్తే బైక్‌ పేలుతుందా.?? క్లారిటీ ఇచ్చిన ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌

దేశంలో వేడిగాలుల ప్రభావం రోజురోజుకూ విపరీతంగా పెరుగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి కాస్త ముందస్తుగానే వేసవి సమీపించింది. దీంతో ఉష్ణోగ్రతలు(Fuel Full Tank Fake News) పెరగడంతో బయటకు రావడానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్న ఓ ఫేక్‌ న్యూస్‌ వాహనదారులను భయాందోళనకు గురిచేస్తోంది.

సోషల్‌ మీడియాలో ఇటీవల ఇండియన్‌ ఆయిల్ పేరుతో పోస్ట్ అయిన ఫేక్ న్యూస్ చాలా మంది వాహన యజమానులను సందేహానికి గురి చేసింది. ఇంతకీ ఆ ఫేక్ మెసేజ్ ఏంటంటే.. 'ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ బైక్‌ ఫ్యూయెల్‌ ట్యాంకును పెట్రోల్‌తో పూర్తిగా నింపవద్దు. ఇంతకు మించి ఇంధన ట్యాంక్ పూర్తిగా నిండితే బైక్‌ పేలిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సగం ట్యాంక్ మాత్రమే నింపండి. మిగిలిన ట్యాంక్‌ను ఖాళీగా ఉంచండి'.

IOC-Clarity-On-Full-Tank-Petrol-Fake-News

ఇది ఫేక్ న్యూస్‌లో చెప్పబడింది. అయితే ఇది నిజం కాదని స్వయంగా ఇండియన్‌ ఆయిల్ కార్పొరేషన్‌(Indian Oil Corporation) స్పష్టం చేసింది. వాస్తవానికి, ఇండియన్ ఆయిల్ వాహన యజమానులకు ఎప్పుడూ అలాంటి హెచ్చరిక జారీ చేయలేదు. ఈ ఫేక్ న్యూస్‌లో ఇండియన్ ఆయిల్ కంపెనీ పేరు ఉండడంతో.. ఇప్పుడు దీనికి సంబంధించి వివరణ ఇచ్చింది.

'మేము ఈ తప్పుడు వార్తలను ఖండిస్తున్నాం. ఆటో తయారీ కంపెనీలు అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే వాహనాలను అభివృద్ధి చేస్తాయి. కాబట్టి వేసవి కాలం, శీతాకాలం, వర్షాకాలం అనే తేడా లేకుండా మీ బైక్‌లో పెట్రోల్‌ పూర్తిగా నింపుకోవచ్చు. ఇందులో ఏ ప్రమాదం లేదు. ఇది సురక్షితమైనది'. అని ఇండియన్ ఆయిల్ వివరణ ఇచ్చింది.

IOC-Clarity-On-Full-Tank-Petrol-Fake-News

ఈ సమాచారాన్ని ఇండియన్ ఆయిల్ కంపెనీ తన సోషల్ మీడియా పేజీల ద్వారా అధికారికంగా షేర్‌ చేసింది. అయితే ఇక్కడ ముందుగా ప్రస్తావించాల్సిన విషయం ఏంటంటే, ఇండియన్ ఆయిల్ కంపెనీ పేరును ఉపయోగించి ప్రతి సంవత్సరం ఇలాంటి ఫేక్ న్యూస్ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలో షేర్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఏడాది కూడా మళ్లీ అదే ఫేక్ న్యూస్ విస్తృతంగా వ్యాపించింది.

ఎప్పటిలాగే ఇండియన్ ఆయిల్ కంపెనీ(Indian Oil On Fuel Full Tank Fake News) దీనిపై వివరణ ఇచ్చి బైక్‌ యజమానుల్లో గందరగోళానికి ఫుల్‌స్టాప్‌ పెట్టింది. కాబట్టి వేసవి లేదా శీతాకాలం అయినా, మీరు మీ బైక్‌ ఫ్యూయెల్‌ ట్యాంక్‌ను పూర్తిగా నింపుకోవచ్చు. ఇలా ఫేక్ న్యూస్‌లు నమ్మి గందరగోళంలో పడవద్దని వాహనదారులకు సూచించింది.

IOC-Clarity-On-Full-Tank-Petrol-Fake-News

వేసవిలో ఇంధన ట్యాంక్‌ను పూర్తిగా ఫిల్‌ చేయడం వల్ల వాహనం పేలిపోతుందనే ఫేక్ న్యూస్ కొన్నాళ్లుగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే.. దీనిపై ఇండియన్ ఆయిల్ కంపెనీ పలుమార్లు వివరణ ఇచ్చినా ఇప్పటికీ కొందరు ఇలాంటి ఫేక్‌న్యూస్‌లనే నమ్మడం ఆందోళన కలిగిస్తోంది.

ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పుడు వార్తలను నమ్మవద్దని ఆయిల్‌ కంపెనీ అధికారులు సూచిస్తున్నారు. సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో ఉండే సమాచారం అంతా నిజం కాదు.. అయితే సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో వస్తున్న సమాచారం నిజమేనా?.. కాదా.?? అని 'క్రాస్ చెక్' చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, April 2, 2024, 11:31 [IST]
English summary
Indian oil corporation stated that vehicles dont explode if fuel tank is full in summer
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+