వరల్డ్స్ ఫాస్టెస్ట్ కార్ తయారీలో భారతీయ సంసతి మహిళ సాయం

By Ravi

దక్షిణాఫ్రికాలోని భారతీయ సంతతికి చెందిన 29 ఏళ్ల మహిళ ప్రపంచంలో కెల్లా అత్యంత వేగంగా పరుగులు పెట్టే కారు తయారీలో కీలక పాత్ర పోషించనుంది. యూకెలో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు కోసం ఎంపిక చేసిన నిపులైన ఇంజనీర్ల బృందంలో 'బెవర్లీ సింగ్' కూడా ఒకరు.

పోర్ట్ ఎలిజబెత్ నుంచి మెకానికల్ ఇంజనీర్ అయిన బెవర్లీ సింగ్, యూకేలోని బ్రిస్టల్‌కు సమీపంలోని ఓ హైటెక్ కేంద్రంలో నిర్మిస్తున్న 'బ్లడ్‌హౌండ్ సూపర్‌‌సోనిక్ కార్'ను నిర్మిస్తున్న 30 మంది ఇంజనీర్ల బృందంలో ఈమె కూడా తన వంతు సాయం చేయనుంది. రాకెట్ ఇంజన్‌తో నడిచే ఈ సూపర్ కారును, టెస్ట్ రన్ సిరీస్‌ల కోసం (కొద్ది నెలల పాటు) 2015లో దక్షిణాఫ్రికాకు తీసుకురానున్నారు.

ప్రస్తుత ల్యాండ్ స్పీడ్ రికార్డ్ (గంటకు 1228 కి.మీ., థ్రస్ట్ సూపర్‌సోనిక్ కారుతో 1997లో ఈ రికార్డును సృష్టించారు)ను బ్రేక్ చేసేందుకు ఈ కారును తయారు చేస్తున్నారు. ఈ వేగాన్ని కన్నా 30 శాతం ఎక్కువ వేగం (గంటకు సుమారు 1609 కి.మీ.)తో 2016లో ఈ బ్లడ్‌హౌండ్ సూపర్‌సోనిక్ కారుతో రికార్డును నెలకొల్పనున్నారు.

ఈ సూపర్‌సోనిక్ కారుకు సంబంధించిన మరింత సమాచారాన్ని క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

రోల్స్ రాయిస్ సపోర్ట్

రోల్స్ రాయిస్ సపోర్ట్

ఈ బ్లడ్‌హౌండ్ సూపర్‌సోనిక్ కారు ప్రాజెక్టుకు బ్రిటీష్ ఆటో దిగ్గజం రోల్స్ రాయిస్ తమ వంతు మద్దతు అందిస్తోంది. ఇందులో భాగంగానే, ఈ ప్రాజెక్టుకు కావల్సిన ఇంజన్, ఆర్థిక మరియు సాంకేతిక మద్ధతులను రోల్స్ రాయిస్ అందిస్తోంది.

జెట్ ఇంజన్

జెట్ ఇంజన్

బ్లడ్‌హౌండ్ సూపర్‌సోనిక్ కారులో రోల్స్ రాయిస్ ఈజె200 జెట్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఇదే ఇంజన్‌ను యూరోఫైటర్ టైఫూన్ కోంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో ఉపయోగించారు.

దక్షిణాఫ్రికాలో టెస్టింగ్

దక్షిణాఫ్రికాలో టెస్టింగ్

గంటకు గరిష్టంగా 1600 కిలోమీటర్లకు పైగా వేగంతో ప్రయాణించే ఈ కారును నడపాలంటే సాధారణ రోడ్లు పనికిరావు. అందుకే ఈ బ్లడ్‌హౌండ్ కారును దక్షిణాఫ్రికాలోని నార్తర్న్ కేప్ ప్రావిన్స్‌లో ఉన్న హాక్‌స్కీన్ పాన్ అనే ఎండిపోయిన సరస్సు లోపల మాత్రమే టెస్ట్ చేయనున్నారు.

హాక్‌స్కీన్ పాన్ సరస్సు

హాక్‌స్కీన్ పాన్ సరస్సు

ఈ కారును టెస్టింగ్ చేసేందుకు దక్షిణాఫ్రికాలోని నార్తర్న్ కేప్ ప్రావిన్స్‌లో ఉన్న హాక్‌స్కీన్ పాన్ అనే ఎండిపోయిన ఈ సరస్సు గర్భాన్ని రేస్‌ ట్రాక్‌గా మారుస్తున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.

సరస్సు క్లీనింగ్

సరస్సు క్లీనింగ్

బ్లడ్‌హౌండ్ సూపర్‌కారు అంత గరిష్ట వేగంతో వెళ్తుంది కాబట్టి, కారుకు ఏ చిన్న రాయి తగిలినా చాలా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అందుకే సుమారు 20 కిలోమీటర్ల పొడవు, 1.5 కిలోమీటర్ల వెడల్పు ఉండేలా ఈ సరస్సు గర్భాన్ని దాదాపు 300 మంది కార్యకర్తలు శుభ్రం చేస్తున్నారు. చిన్నచిన్న రాళ్లను ఏరిపారేస్తున్నారు.

బ్లడ్‌హౌండ్ ప్రాజెక్ట్ సారధి

బ్లడ్‌హౌండ్ ప్రాజెక్ట్ సారధి

బ్లడ్‌హౌండ్ ప్రాజెక్టుకు రిచర్డ్ నోబెల్ సారథ్యం వహిస్తున్నారు. ఆయన ఈ తరహా కారు నిర్మించడం ఇదే మొదటిసారి కాదు.

బ్లడ్‌హౌండ్ సూపర్‌సోనిక్ కారు

థ్రస్ట్-2 సూపర్‌సోనిక్ కార్

గతంలో రిచర్డ్ నోబెల్ గరిష్టంగా గంటకు 1019 కిలోమీటర్ల వేగంతో నడిచే ‘థ్రస్ట్-2'ను విజయవంతంగా నడిపి చూపించారు.

బ్లడ్‌హౌండ్ సూపర్‌సోనిక్ కారు

థ్రస్ట్ సూపర్‌సోనిక్ కార్

ఆ తరువాత ఈయన ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న థ్రస్ట్ సూపర్‌సోనిక్ కార్ 1997లోనే గంటకు 1228 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లి సరికొత్త రికార్డులు సృష్టించింది.

More from DriveSpark

Article Published On: Tuesday, August 27, 2013, 12:09 [IST]
English summary
A 29-year-old Indian-origin woman from South Africa is set to join the team of specialist engineers building the world's fastest car in the UK. Beverly Singh, a mechanical engineer from Port Elizabeth, will help design the Bloodhound supersonic car, currently being built by a team of about 30 engineers in a high-tech centre near Bristol.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+