ఆటోపైలట్ మోడ్‌లో స్టంట్ చేసిన ఇండో-అమెరికన్ అరెస్ట్; వివరాలు

అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన భారతీయ సంతతికి చెందిన వ్యక్తి తన టెస్లా కారులో స్టంట్స్ చేసినందుకు జైలుపాలయ్యాడు. ఈ చర్యకు పాల్పడిన వ్యక్తి పరం శర్మగా గుర్తించబడ్డాడు. ఆటో పైలట్ మోడ్ ద్వారా టెస్లా కారులో స్టంట్ చేసినందుకు పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. దీని గురించి మరింత సమాచారం ఈ ఆర్టికల్ లో చూద్దాం.

ఆటో పైలట్ మోడ్‌లో స్టంట్ చేసిన ఇండో-అమెరికన్ అరెస్ట్; వివరాలు

అరెస్టయిన పరం శర్మ గతంలో కూడా చాలాసార్లు ఇలాంటి స్టంట్స్ చేసినట్లు తెలిసింది. అతని టెస్లా కారు ఆటోపైలట్ మోడ్‌లో డ్రైవ్ చేస్తున్న అనేక వీడియోలు బయటపడ్డాయి. 25 ఏళ్ల వయసున్న ఈ ఇండో-అమెరికన్ తన విలాసవంతమైన జీవనశైలిని చూపించే ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా బాగా ప్రాచుర్యం పొందాడు.

ఆటో పైలట్ మోడ్‌లో స్టంట్ చేసిన ఇండో-అమెరికన్ అరెస్ట్; వివరాలు

నివేదికల ప్రకారం గత వారం అతను తన టెస్లా మోడల్ 3 ను ఆటోపైలట్‌ మోడ్ లో ఉంచి వెనుక సీట్లో కూర్చున్నాడు. ఈ కారణంగా అతన్ని కాలిఫోర్నియా హైవే పోలీసులు అరెస్టు చేసినట్లు నివేదించారు. టెస్లా కారు వెనుక సీట్లో ఒక వ్యక్తి బే ఏరియా రోడ్ వైపు వెళుతున్నట్లు వారు గమనించారని పోలీసులు చెబుతున్నారు.

MOST READ:వేలానికి సిద్ధంగా ఉన్న సూపర్ కండిషన్‌లో ఉన్న 42 ఏళ్ల మెర్సిడెస్ బెంజ్; వివరాలు

ఆటో పైలట్ మోడ్‌లో స్టంట్ చేసిన ఇండో-అమెరికన్ అరెస్ట్; వివరాలు

ఏ ప్రమాదం జరగకముందే జరగకముందే పరం శర్మను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పరం శర్మపై నిర్లక్ష్యంగా వాహనం డ్రైవ్ చేయడం మరియు పోలీసు అధికారికి అవిధేయత చూపినందుకు శాంటా రీటాలో రెండు కేసులు నమోదయ్యాయి.

ఆటో పైలట్ మోడ్‌లో స్టంట్ చేసిన ఇండో-అమెరికన్ అరెస్ట్; వివరాలు

ఈ రెండు కేసులకు సంబంధించి కాలిఫోర్నియా హైవే పోలీసులు పరం శర్మను అరెస్ట్ చేశారు. ఆ కేసులలో, పరం శర్మను అరెస్టు చేసి, తరువాత విడుదల చేశారు. హైవే పోలీసులను ట్రోలింగ్ చేయడం, డ్రైవర్‌లేని కారులో డ్రైవింగ్ చేయడం వంటి వీడియోలను శర్మ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు.

MOST READ:కూరగాయల అమ్మకానికి కొత్త టయోటా ఫార్చ్యూనర్.. వినటానికి వింతగా ఉన్నా, ఇది నిజమే

ఆటో పైలట్ మోడ్‌లో స్టంట్ చేసిన ఇండో-అమెరికన్ అరెస్ట్; వివరాలు

మరొక వీడియోలో అతను టెస్లా కారు వెనుక సీట్లో కూర్చున్న తన పాయింట్ ఆఫ్ వ్యూ వీడియోను పోస్ట్ చేశాడు. ఈ సమయంలో టెస్లా కారు ఓపెన్ రోడ్డుపై కదులుతోంది. డ్రైవర్‌లేని కారు హిల్స్‌బరోలోని ఇంటర్‌స్టేట్ 280 వైపు వెళుతున్నట్లు కారు ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ తెలిపింది.

ఆటో పైలట్ మోడ్‌లో స్టంట్ చేసిన ఇండో-అమెరికన్ అరెస్ట్; వివరాలు

ఈ తరహా వీడియోలను పరం శర్మ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. హైవే పోలీసులు అతని డ్రైవర్ లెస్ టెస్లా కారులో డ్రైవింగ్ చేస్తున్న స్క్రీన్ షాట్ తీశారు. టెస్లా ఆటోపైలట్ మోడ్ ఇంతకు ముందు చాలాసార్లు దుర్వినియోగం చేయబడింది. ఇటీవల కాలంలో టెస్లా కార్లు ఆటో ఫైలెట్ మోడ్ లో చాలా ప్రమాదాలకు కారణమైనట్లు కూడా కేసులు నమోదయ్యాయి.

MOST READ:బెంగళూరులో అందుబాటులో ఉన్న ఆక్సిజన్ బస్సులు; పూర్తి వివరాలు

Source: Cartoq

Most Read Articles

English summary
Indian Origin Youth Arrested For Doing Stunt In Autopilot Mode. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X