ఇండియన్ పొలిటికల్ లీడర్స్ డ్రైవ్ చేసే కార్లు: ఇవే, చూసారా?

భారతదేశంలో ఆటో మొబైల్ ఔత్సాహికులు ఎక్కువగానే ఉన్నారు. కానీ మన దేశాన్ని పూర్తిగా ఆటోమొబైల్ ఔత్సాహికుల దేశంగా పరిగణించలేము.చాలా మంది సినీ పరిశ్రమల వారు, రాజకీయ నాయకులు మొదలైన వారు చాలా లగ్జరీ కార్లను కలిగి ఉంటారు. కానీ ఈ కార్లకు డ్రైవర్లను కూడా కలిగి ఉంటారు. భారతదేశంలో సొంత కార్లు నడుపుతున్న రాజకీయ నాయకులు తక్కువ మంది మాత్రమే ఉన్నారు. సొంత కార్లను ఎక్కువగా నడిపే ఇండియన్ పొలిటికల్ లీడర్ల జాబితా ఇక్కడ ఉంది. దీని గురించి పూర్తి సమాచారం మనం ఇక్కడ చూద్దాం..

ఇండియన్ పొలిటికల్ లీడర్స్ ఎలాంటి వాహనాలు డ్రైవ్ చేస్తారో తెలుసా ?

ఉద్దవ్ ఠాక్రే :

మహారాష్ట్రకు కొత్తగా ఎన్నికైన ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే తన సొంత కారు నడపడానికి చాలా ఇష్టపడతారు. ఉద్ధవ్ ఠాక్రే మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ లో తిరుగుతాడు. అంతే కాకుండా అతను ముఖ్యమంత్రిగా ఎన్నికైన తరువాత కూడా చాలా తరచుగా దీనిని డ్రైవ్ చేస్తూ ఉంటాడు.

ఇండియన్ పొలిటికల్ లీడర్స్ ఎలాంటి వాహనాలు డ్రైవ్ చేస్తారో తెలుసా ?

COVID-19 మహమ్మారి తరువాత, ఉద్దవ్ తన కారులో ఎవరు కూర్చోవడానికి ఇష్టపడలేదు. ఇటీవల కాలంలో కూడా అతను మెర్సిడెస్ బెంజ్‌ను స్వయంగా నడుపుతున్నట్లు గుర్తించారు.

MOST READ:పెరిగిన టొయోటా ఇన్నోవా క్రిస్టా బిఎస్6 ధరలు

ఇండియన్ పొలిటికల్ లీడర్స్ ఎలాంటి వాహనాలు డ్రైవ్ చేస్తారో తెలుసా ?

ఒమర్ అబ్దుల్లా :

జమ్మూ కాశ్మీర్ మాజీ సిఎం ఒమర్ అబ్దుల్లా చాలా పాత టయోటా ల్యాండ్ క్రూయిజర్ ఎస్‌యూవీని కలిగి ఉన్నారు. ఈ కారుని వేరొకరికి ఇవ్వడం కంటే డ్రైవ్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతాడు.

ఇండియన్ పొలిటికల్ లీడర్స్ ఎలాంటి వాహనాలు డ్రైవ్ చేస్తారో తెలుసా ?

ఒమర్ కారుపై అద్భుతమైన నియంత్రణ కలిగి ఉన్నాడు. అంతే కాకుండా జమ్మూ కాశ్మీర్ లో అతను తరచుగా మంచు మీద కూడా ఎంతో నైపుణ్యంతో కారుని డ్రైవ్ చేస్తాడు.

MOST READ:టివిఎస్ స్పోర్ట్ బిఎస్ 6 బైక్ ఇప్పుడు మరింత కాస్ట్లీ, ఎంతో తెలుసా !

ఇండియన్ పొలిటికల్ లీడర్స్ ఎలాంటి వాహనాలు డ్రైవ్ చేస్తారో తెలుసా ?

రాజ్ ఠాక్రే :

రాజ్ ఠాక్రే MNS యొక్క చీఫ్. అతను తన సొంత కార్లను కూడా డ్రైవ్ చేస్తాడు. రాజ్ ఠాక్రే తన సోదరుడిలాగే మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ లో తిరుగుతాడు. అతను తన సెక్యూరిటీ గార్డులతో తన పక్కన కూర్చొని కాన్వాయ్లో డ్రైవింగ్ చేయడాన్ని కూడా గుర్తిచడం జరిగింది.

ఇండియన్ పొలిటికల్ లీడర్స్ ఎలాంటి వాహనాలు డ్రైవ్ చేస్తారో తెలుసా ?

ప్రియాంక గాంధీ :

సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ కూడా తన కారుని తానే డ్రైవ్ చేస్తుంది. బహుశా తన కారును నడిపే ఏకైక మహిళా భారతీయ రాజకీయ నాయకురాలు. రాజకీయ ప్రచారం సందర్భంగా, ప్రియాంక తన సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి టయోటా క్వాలిస్‌ను డ్రైవ్ చేశారు.

MOST READ:ఎంవి అగస్టా యొక్క కొత్త సూపర్ బైక్.. చూసారా !

ఇండియన్ పొలిటికల్ లీడర్స్ ఎలాంటి వాహనాలు డ్రైవ్ చేస్తారో తెలుసా ?

రాహుల్ గాంధీ :

రాహుల్ గాంధీ కూడా తన కార్లను ఎక్కువగా డ్రైవ్ చేస్తాడు. రాజకీయ నాయకుడు అయిన రాహుల్ గాంధీ తన తల్లి సోనియా గాంధీతో ఎక్కువసార్లు డ్రైవింగ్ చేస్తున్నట్లు గుర్తించారు.

ఇండియన్ పొలిటికల్ లీడర్స్ ఎలాంటి వాహనాలు డ్రైవ్ చేస్తారో తెలుసా ?

రాహుల్ గాంధీ ఎక్కువగా టాటా సఫారిలో తిరుగుతాడు. అతను ఎక్కువగా ఢిల్లీలో డ్రైవింగ్ చేస్తున్నట్లు గుర్తించబడ్డాడు. అంతే కాకుండా అతను నగరం నుండి బయటకు వెళ్ళినప్పుడు కూడా తన సొంత కారును నడపడానికి ఇష్టపడతాడు. రాహుల్ గాంధీ గతంలో ట్రాక్టర్ కూడా నడిపారు.

MOST READ:మిడతల దాడిని ఎదుర్కోవడానికి రాజస్థాన్ గవర్నమెంట్ ఏం చేస్తుందో తెలుసా !

ఇండియన్ పొలిటికల్ లీడర్స్ ఎలాంటి వాహనాలు డ్రైవ్ చేస్తారో తెలుసా ?

సచిన్ పైలట్ :

ప్రముఖ కాంగ్రెస్ రాజకీయ నాయకుడు సచిన్ పైలట్ తనకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టమని, తనకు వీలైనప్పుడల్లా డ్రైవ్ చేస్తానని చెప్పాడు. సచిన్ పైలట్ ఒక టయోటా ఫార్చ్యూనర్‌లో తిరుగుతాడు.

ఇండియన్ పొలిటికల్ లీడర్స్ ఎలాంటి వాహనాలు డ్రైవ్ చేస్తారో తెలుసా ?

సచిన్ పైలట్ ఒక ఇంటర్వ్యూలో అతనికి కార్లు నడపడం చాలా ఇష్టమని చెప్పాడు. పొలిటికల్ ర్యాలీలలో సచిన్ తరచూ ఇతర రాజకీయ నాయకులతో కలిసి తిరుగుతూ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు.

ఇండియన్ పొలిటికల్ లీడర్స్ ఎలాంటి వాహనాలు డ్రైవ్ చేస్తారో తెలుసా ?

కిరెన్ రిజిజు :

బిజెపి పొలిటికల్ లీడర్ కిరెన్ రిజిజు కూడా ఆటో మొతివె ఔత్సాహికుడు. అంతే కాకుండా కార్లలో తిరగడం అతనికి చాలా ఇష్టం. ఇటీవల ఆయన హిమాలయ రోడ్లపై మహీంద్రా థార్ నడిపారు. అతను పొలారిస్ కారు నడపడానికి కూడా ప్రయత్నించాడు. కిరెన్ రిజిజు తన నైపుణ్యాలను చూపిస్తూ తరచుగా పర్వత రహదారులపై తిరుగుతూ ఉంటాడు.

ఇండియన్ పొలిటికల్ లీడర్స్ ఎలాంటి వాహనాలు డ్రైవ్ చేస్తారో తెలుసా ?

పెమా ఖండు :

అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు ఇటీవల మంచుతో కూడిన రోడ్లపై పొలారిస్ ఎటివిలో తిరిగారు. అతను హిమాలయాల ఎత్తైన రహదారులపై చాలా సాహసోపేతంగా నడిపాడు. ఈ విధంగా కారు నడిపేటప్పుడు చాలా కాన్ఫిడెంట్ తో కార్ డ్రైవ్ చేసాడు.

ఇండియన్ పొలిటికల్ లీడర్స్ ఎలాంటి వాహనాలు డ్రైవ్ చేస్తారో తెలుసా ?

పవన్ కళ్యాణ్ :

జనసేన పార్టీ అధ్యక్షుడు మరియు తెలుగు సినీ పరిశ్రమలో ఎక్కువ అభిమానులను కలిగి ఉన్న పవన్ కళ్యాణ్ మెర్సిడెస్ బెంజ్ జి-వాగెన్‌ను కలిగి ఉన్నాడు . పవన్ కళ్యాణ్ నగరంలో తిరిగేటప్పుడు స్వయంగా తన కారుని డ్రైవ్ చేస్తాడు. పవన్ కళ్యాణ్ కూడా ఆటో మొబైల్ ఔత్సాహికుడు అంతే కాకుండా వాహనాలను డ్రైవ్ చేయడంలో మంచి నైపుణ్యాన్ని కలిగి ఉన్నాడు.

ఇండియన్ పొలిటికల్ లీడర్స్ ఎలాంటి వాహనాలు డ్రైవ్ చేస్తారో తెలుసా ?

జ్యోతిరాదిత్య సింధియా :

జ్యోతిరాదిత్య సింధియా ఇటీవల కాంగ్రెస్ పార్టీని వీడినందుకు ఎక్కువ వార్తల్లో నిలిచారు. ఈ రాజకీయ నాయకుడు ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్‌లో తిరుగుతూ చాలా సార్లు కార్ డ్రైవ్ చేస్తూ కనిపించాడు.

ఇండియన్ పొలిటికల్ లీడర్స్ ఎలాంటి వాహనాలు డ్రైవ్ చేస్తారో తెలుసా ?

ఇటీవల కాలంలో చాలామంది తమ కార్లను సొంతంగా డ్రైవ్ చేయడానికి ఇష్టపడతారు. ఈ నేపథ్యంలో భాగంగానే రాజకీయ నాయకులు, సెలబ్రెటీలు వంటివారు కూడా తమకు ఇష్టమైన కార్లను స్వయంగా నడపడానికి ఉత్సాహాన్ని కనపరుస్తున్నారు.

Most Read Articles

English summary
Indian politicians who drive their own cars: Rahul Gandhi to Uddhav Thackeray. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X