సెలబ్రిటీలనే ఔరా అనిపిస్తున్న రాజకీయ నాయకుల కార్లు

ఇండియన్ పొలిటీషియన్స్ ఒకప్పుడు ఎక్కువగా మహీంద్రా స్కార్పియో వాహనాలు వినియోగించే వారు. అయితే వాటి స్థానంలో ఇప్పుడు టయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీలను ఉపయోగిస్తున్నారు. కానీ, కొంత మంది రాజకీయ నాయకులు మాత్రం

By N Kumar

ఇండియన్ పొలిటీషియన్స్ ఒకప్పుడు ఎక్కువగా మహీంద్రా స్కార్పియో వాహనాలు వినియోగించే వారు. అయితే వాటి స్థానంలో ఇప్పుడు టయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీలను ఉపయోగిస్తున్నారు. కానీ, కొంత మంది రాజకీయ నాయకులు మాత్రం సెలబ్రిటీలను సైతం ఆశ్చర్యానికి గురి చేసే విధంగా అత్యంత ఖరీదైన విలాసవంతమైన కార్లను కలిగి ఉన్నారు.

ఇవాళ్టి ఆఫ్ బీట్ శీర్షికలో ఇండియన్ పొలిటీషియన్స్ వద్ద ఎలాంటి విలాసవంతమైన కార్లు ఉన్నాయో చూద్దాం రండి...

ఇండియన్ పొలిటీషియన్స్, వారి అద్భుతమైన కార్లు

ప్రతీక్ యాదవ్

ఉత్తర ప్రదేశ్‌లో సమాజ్ వాద్ పార్టీ స్థాపించిన ములాయం సింగ్ యాదవ్ చిన్న కుమారుడు ప్రతీక్ యాదవ్. ములాయం సింగ్ కుమారులు అఖిలేష్ యాదవ్ మరియు ప్రతీక్ యాదవ్ ఇద్దరూ రాజకీయ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో కీలకంగా రాణిస్తున్న యువ పొలిటీషియన్ ప్రతీక్ యాదవ్ వద్ద అత్యంత ఖరీదైన ల్యాంబోర్ఘిని హురాకాన్ స్పైడక్ కారు ఉంది.

ఇండియన్ పొలిటీషియన్స్, వారి అద్భుతమైన కార్లు

ఇటాలియన్ సూపర్ కార్ల దిగ్గజం ల్యాంబోర్ఘిని తయారు చేసిన హురాకాన్ స్పైడర్ సూపర్ కారులో అత్యంత శక్తివంతమైన 5.2-లీటర్ సామర్థ్యం గల వి10 పెట్రోల్ ఇంజన్ కలదు, ఇది గరిష్టంగా 610బిహెచ్‌పి పవర్ మరియు 560ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

ఇండియన్ పొలిటీషియన్స్, వారి అద్భుతమైన కార్లు

ఉదయ్‌నిధి స్టాలిన్

తమిళనాట రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తున్న స్టాలిన్ కుమారడు ఉదయ్‌నిధి స్టాలిన్. మరియు డీఎమ్‌కే పార్టీ అధ్యక్షుడు కరణానిధి మనువడుయ ఉదయ్‌నిధి స్టాలిన్ పలు చిత్రాల్లో నటించాడు మరియు రాజకీయాల్లో కీలకంగా రాణిస్తున్నాడు.

ఇండియన్ పొలిటీషియన్స్, వారి అద్భుతమైన కార్లు

ఉదయ్ వద్ద అమెరికాకు చెందిన ట్రూ బ్లూ లగ్జరీ ఎస్‌యూవీ హమ్మర్ హెచ్3 ఉంది. ఇందులో అత్యంత శక్తివంతమైన 3.5-లీటర్ సామర్థ్యం గల 5-సిలిండర్ల ఎల్52 ఇంజన్ కలద. ఇది గరిష్టంగా 220బిహెచ్‌‌‌పి పవర్ మరియు 305ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

ఇండియన్ పొలిటీషియన్స్, వారి అద్భుతమైన కార్లు

రామ్ కదమ్

మహారాష్ట్రకు చెందిన రామ్ కదమ్ చివరిసారిగా ఎన్నికల్లో బీజేపీ పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రాతినిధ్యం వహించారు. తొలుత మహారాష్ట్ర నననిర్మాణ్ సేన పార్టీలో మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. లగ్జరీ కార్లంటే విపరీతంగా ఇష్టపడే రామ్ కదమ్ గతంలో తన 13 ఏళ్ల కుమారుడికి మెర్సిడెస్ బెంజ్ కారును కానుగా ఇచ్చి వార్తల్లో నిలిచాడు.

ఇండియన్ పొలిటీషియన్స్, వారి అద్భుతమైన కార్లు

రామ్ కదమ్ వద్ద మెర్సిడెబ్ బెంజ్ ఇ350 క్యాబ్రియోలెట్, జాగ్వార్ ఎక్స్‌జె ఎల్ లగ్జరీ సెడాన్ ఉన్నాయి. ఇంకా లోతుగా రీసెర్చ్ చేస్తే, రోల్స్ రాయిస్ ఘోస్ట్ మరియు బెంట్లీ కార్లు కూడా ఉన్నట్లు తెలిసింది.

ఇండియన్ పొలిటీషియన్స్, వారి అద్భుతమైన కార్లు

నరేంద్ర మెహ్తా

పొలిటీషియన్ నరేంద్ర మెహ్తా తన భార్య సుమన్ మెహ్తాకు ల్యాంబోర్ఘిని హురాకాన్ కారును బహుకరించాడు. భాదాకరమైన విషయం ఏమిటంటే... ఆమె ఈ కారును హ్యాండిల్ చేయలేకపోవడం. షోరూమ్‌లో డెలివరీ తీసుకుని రోడ్డెక్కిన మొదటి రోజునే యాక్సిడెంట్ చేసింది.

ఇండియన్ పొలిటీషియన్స్, వారి అద్భుతమైన కార్లు

నరేంద్ర మెహ్తా బీజేపీ ఎమ్మెల్యేగా ఉండటంతో కమల పువ్వుకు సూచకంగా, కాషాయం రంగులో ఉన్న కారును కొనుగోలు చేశాడనే వార్తలున్నాయి. కారు విషయానికి వస్తే, ల్యాంబోర్ఘిని హురాకాన్ సూపర్ కారులో 5.2-లీటర్ సామర్థ్యం గల న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ వి10 పెట్రోల్ ఇంజన్ ఉంది. 3.2-సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100కిమీల వేగాన్ని అందుకునే ఇది 610బిహెచ్‌పి పవర్ మరియు 560ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

ఇండియన్ పొలిటీషియన్స్, వారి అద్భుతమైన కార్లు

ప్రమోద్ మద్వరాజ్

ప్రమోద్ మద్వరాజ్ కర్ణాటకలోని ఉడిపి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ప్రమోద్ ఎమ్మెల్యే మాత్రమే కాదు, విజయవంతైమన వ్యాపారవేత్త కూడా. ప్రమోద్ మద్వరాజ్ వద్ద అత్యంత ఖరీదైన రోల్స్ రాయిస్ ఘోస్ట్ లగ్జరీ కారు ఉంది.

ఇండియన్ పొలిటీషియన్స్, వారి అద్భుతమైన కార్లు

రూ. 5.8 కోట్లకు రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారును కొనుగోలు చేసినట్లు ప్రమోద్ పేర్కొన్నాడు. ఇందులో 6.6-లీటర్ కెపాసిటి గల వి12 పెట్రోల్ ఇంజన్ కలదు, ఇది గరిష్టంగా 603బిహెచ్‌పి పవర్ మరియు 840ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

ఇండియన్ పొలిటీషియన్స్, వారి అద్భుతమైన కార్లు

రాజీవ్ చంద్రశేఖర్

రాజీవ్ చంద్రశేఖర్ భారత రాజకీయ వేత్త మరియు వేల కోట్లు విలువ చేసే వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి. భారత పార్లమెంటులోని ఎగువ సభకు ఎంపీగా ప్రాథినిధ్యం వహించారు. రావీవ్ వద్ద ల్యాంబోర్ఘిని, ఫెరారి వంటి లగ్జరీ కార్లే ఉన్నాయి.

ఇండియన్ పొలిటీషియన్స్, వారి అద్భుతమైన కార్లు

రాజీవ్ చంద్రశేఖర్ కార్ గ్యారేజీలో ఫెరారి డినో, ల్యాంబోర్ఘిని మర్సియోలాజో బార్చెట్టా, ఫెరారి ఎఫ్355 స్పైడర్, బిఎమ్‌డబ్ల్యూ ఎమ్5(ఇ60) మరియు హమ్మర్ హెచ్2 వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి.

ఇండియన్ పొలిటీషియన్స్, వారి అద్భుతమైన కార్లు

నిఖిల్ కుమార స్వామి

నిఖిల్ కుమార స్వామి కర్ణాటక ముంఖ్యమంత్రి హెచ్‌.డీ కుమార స్వామి కుమారుడు మరియు మాజీ ప్రధాని హెచ్‌.డి దేవే గౌడ మనువడు. కర్ణాట రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న నితిన్ వద్ద ల్యాంబోర్ఘిని గల్లార్డో సూపర్ కారు ఉంది.

ఇండియన్ పొలిటీషియన్స్, వారి అద్భుతమైన కార్లు

చిరంజీవి

సినీ, రాజకీయ, వ్యాపార జగత్తులో చిరంజీవి గురించి తెలియని వారుండరు. చిత్ర నిర్మాత, నటుడు, వ్యాపార వేత్త మరియు రాజకీయ వేత్తగా కూడా రాణించాడు. ప్రజా రాజ్యం పార్టీతో రాజకీయ ఆరంగేట్రం చేసిన చిరంజీవి కొన్నాళ్ల తరువాత పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి, కేంద్ర మంత్రిగా పనిచేశాడు.

ఇండియన్ పొలిటీషియన్స్, వారి అద్భుతమైన కార్లు

ప్రభావవంతమైన రాజకీయాలకు గత కొన్నేళ్లుగా దూరంగా ఉన్న చిరంజీవి గత ఏడాది మళ్లీ తెరంగేట్రం చేశారు. చిరంజీవి వద్ద ఇండియాలోనే అత్యంత ఖరీదైన రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారు ఉంది. దీని ధర సుమారుగా రూ. 9.5 కోట్లుగా ఉంది. సాంకేతికంగా ఇందులో 453బిహెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ చేసే 6.75-లీటర్ వి12 పెట్రోల్ ఇంజన్ కలదు.

ఇండియన్ పొలిటీషియన్స్, వారి అద్భుతమైన కార్లు

పవన్ కళ్యాణ్

రాజకీయాల్లోకి ప్రవేశించిన పవన్ కళ్యాణ్ ఎంతో సినీ కెరీర్‌ను ప్రక్కన పెట్టి ఆంధ్ర రాజకీయాల్లో ఉత్సాహంగా రాణిస్తున్నాడు. జనసేన పార్టీని స్థాపించి విభిన్న శైలితో ముందుకెళుతున్నాడు. అయితే, రానున్న ఎన్నికల్లో జనసేను ఎలా ఆదరిస్తారో చూడాలి మరి.

ఇండియన్ పొలిటీషియన్స్, వారి అద్భుతమైన కార్లు

పవన్ కళ్యాణ్ వద్ద ఉన్న ఎన్నో కార్లను చాలా వరకు అమ్మేసినట్లు తెలుస్తోంది. గతంలో పలుమార్లు మీడియా ముందుకు వచ్చినపుడు మెర్సిడెస్ జి55 ఏఎమ్‌జి ఎస్‌యూవీలో పట్టుబడ్డాడు. అయితే దానిని కూడా అమ్మేసినట్లు తెలిసింది.

ఇండియన్ పొలిటీషియన్స్, వారి అద్భుతమైన కార్లు

జగన్ మోహన్ రెడ్డి

దేశ రాజకీయాలలో పరిచయం లేని వ్యక్తి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి. తండ్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి అకాల మరణానంతరం, తెలుగు ప్రజల ఆశయన సాధనకై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.

ఇండియన్ పొలిటీషియన్స్, వారి అద్భుతమైన కార్లు

జగన్ మోహన్ రెడ్డి వైఎస్సార్‌సీపీ స్థాపించకు ముందుకు ఎక్కువగా బ్లాక్ కలర్ మహీంద్రా స్కార్పియోలో ప్రయాణించేవాడు. ఇటీవల జాగ్వార్ ఎక్స్‌జె ఎల్ లగ్జరీ సెడాన్ ఉపయోగిస్తున్నాడు. సాంకేతికంగా ఇది 3.0-లీటర్ డీజల్ లేదా 5.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లలో లభ్యమవుతోంది.

Most Read Articles

English summary
Read In Telugu: Indian politicians & their EXOTIC cars: Lamborghini Huracan to Rolls Royce
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X