ప్రసిడెంట్ ప్రతిభా పాటిల్ కోసం ఆరు కోట్లు ఖరీదైన కారు!

Pratibha Patil Car
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా గతంలో మన దేశానికి వచ్చినప్పుడు ఓ దెయ్యం (ఘోస్ట్) కారును తన వెంట తీసుకువచ్చారు గుర్తుందా..!? అత్యంత శక్తివంతమైన, సురక్షితమైన మరియు అధునాతమైన పొడవాటి క్యాడిలాక్ కారను అధ్యక్ష వాహనంగా బరాక్ ఒబామాకు అమెరికా ప్రభుత్వం ఆఫర్ చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే, మనదేశ అధ్యక్షురాలికి కూడా ఇలాంటి ఓ వాహనాన్నే భారత ప్రభుత్వం ఆఫర్ చేయనుంది.

మెర్సిడెస్ బెంజ్ ఎస్600ఎల్ పుల్‌మ్యాన్ అనే పొడావిటి కారును అధ్యక్ష వాహనంగా శ్రీమతి ప్రతిభా పాటిల్‌కు భారత సర్కారు అందజేయనుంది. అయితే, ఇది బరాక్ ఒబామా ఉపయోగిస్తున్నటువంటి 'ది బీస్ట్' అంతటి అధునాతనమైన కారు కాకపోయినప్పటికీ, అన్ని ఆయుధాలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలతో కారు లోపలి వ్యక్తులను పరిరక్షించేలా దీన్ని రూపొందించారు. దీని ఖరీదు సుమారు ఆరు కోట్ల రూపాయలు.

ఈ అధ్యక్ష లీమోజైన్‌ను దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత అప్‌గ్రేడ్ చేసినట్లు తెలుస్తుంది. అయితే, ఈ విషయంపై స్పందించేందుకు ఇటు రాష్ట్రపతి భవన్ కానీ, అటు మెర్సిడెస్ బెంజ్ అధికారులు కానీ నిరాకరించారు. ఈ ఏడాది మధ్య భాగంలో ప్రెసిడెంట్ కోసం ఈ కారును కొనుగోలు చేశారని, దీన్ని పూర్తి సాయుధ సామాగ్రితో ప్రత్యేక రక్షణ వాహనంగా తీర్చిదిద్దేందుకు ఒక ఏడాది సమయం పట్టిందని ప్రభుత్వ వర్గాల సమాచారం.

అత్యంత విశాలమైన ఇంటీరియర్స్ కలిగిన ఈ కారులో శక్తివతంమైన 5513సీసీ 12-సిలిండర్ బై-టర్బో ఇంజన్‌ను అమర్చారు, ఇది 517 హార్స్ పవర్‌ల శక్తిని విడుదల చేస్తుంది. ప్రమాదకర పరిస్థితులు, అత్యవసర సమయాల్లో ఈ కారు శక్తివంతగా పరుగులు తీస్తుంది. 2010లో జరిగిన ఢిల్లీ ఆటో ఎక్స్‌పో మెర్సిడెస్ బెంజ్ 'ఎస్600ఎల్ పుల్‌మ్యాన్' కారును ప్రదర్శించింది.

More from DriveSpark

Article Published On: Wednesday, October 12, 2011, 17:07 [IST]
English summary
Now Indian President will use new car, Mercedes Benz S600 Pullman. It's not a official announcement but our sources said that, Rashtrapati Bhawan has bought this new car for president. According to information, The price of this car is around 6 crore.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+