ప్రధాని వద్ద కేవలం మారుతి 800 కారు మాత్రమే ఉందట!

PM Car
సాధారణంగా మన రాజకీయ నాయకులు ప్రజలకు ఏదో సేవ చేద్దామని రాజకీయాల్లోకి వస్తారు. ఆ తర్వాత వాళ్లు చేసే ప్రజా సేవలేంటో ప్రజలందరూ గమనిస్తున్నారనుకోండి. సరే అదంతా అటుంచి, అసలు విషయానికి వస్తే.. ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న వారిలో సుమారు లక్షాధికారులు, కోటీశ్వరులే అధిక శాతం మంది ఉన్నారనే విషయాన్ని ఇటీవల కప్పులు తెప్పులుగా వెలుగులోకి వస్తున్న కుంభకోణాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఇటీవల కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ శాఖల మంత్రులు చివరకు మనదేశ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్‌ కూడా తమ తమ ఆస్తుల వివరాలను ప్రజలకు వెల్లడించారు. మరి మన్మోహన్ ప్రధానమంత్రి కదా ఆయన వద్ద కొన్ని కోట్లు విలువ చేసే కార్లు ఉన్నాయనుకుంటే మనం కారులో కాలేసినట్లే. ప్రస్తుతం ఆయన వద్ద ఒకే ఒక్క కారు ఉంది. అది కూడా 1996వ సంవత్సరానికి చెందిన 'మారుతి 800' కారు.

ప్రధానమంత్రి వెల్లడించిన ఆస్తుల వివరాల ప్రకారం ఆయన వద్ద ఉన్న కారు ఇదేనట. ప్రస్తుత మార్కెట్ వ్యాల్యూ ప్రకారం ఈ కారు విలువ సుమారు రూ.27,500 లకు వరకూ ధర పలకవచ్చు. అయితే, ఇదే కారును వేలంలో విక్రయించినట్లయితే, మన్మోహన్ సింగ్ ఉపయోగించిన కారు కాబట్టి లక్షల్లో ధర పలికినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇది కాకుండా.. ఆయనకు ప్రభుత్వం కేటాయించిన ఓ బుల్లెట్ ప్రూఫ్ బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ కారు కూడా ఉంది.

ప్రధాని నగర సంచారానికి బయలుదేరినప్పుడు ముందు వెనుక పెద్ద పెద్ద ఎస్‌యూవీ (స్పోర్ట్స్ యుటిలిటీ వాహనా)లు ఈ బిఎమ్‌డబ్ల్యూ కారును అనుసరిస్తూ ఉంటాయి. ఒకవేళ ప్రధానిగా మన్మోహన్ సింగ్ తప్పుకున్నట్లుయితే, ఆయన ఈ కారును తిరిగి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది. ప్రధాని మన్మోహన్ సింగ్ వెల్లడించిన ఆస్తుల వివరాల ప్రకారం ఆయన మొత్తం సంపద విలువ కేవలం రూ.5.10 కోట్లు మాత్రమేనట.

More from DriveSpark

Article Published On: Thursday, September 15, 2011, 12:17 [IST]
English summary
The Indian Prime Minister Manmohan Singh owns a 1996 Maruti 800 clearly indicating his bureaucratic roots. He might not have to use the 800 much as he is usually chauffeur driven in a plush bullet proof BMW 7-Series. The Prime minister's car is now valued at just Rs.27,500.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+