రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. మే 1 నుంచి కొత్త రూల్.. ఇకపై వారికి స్లీపర్, AC బోగీల్లోకి నో ఎంట్రీ!

మీరు తరచూ రైలు ప్రయాణం చేసేవారు అయితే, మే 1 నుండి అమలులోకి రానున్న భారత రైల్వే కొత్త నిబంధనలను తప్పకుండా తెలుసుకోవాలి. ఇప్పటి వరకు, వెయిటింగ్ టికెట్ ఉన్న ప్రయాణికులు కొన్నిసార్లు స్లీపర్ లేదా ఏసీ కోచ్‌లలో ప్రయాణించేవారు. టికెట్ కన్ఫర్మ్ కాకపోయినా, స్థానికంగా టీటీ సహాయంతో లేదా ప్రయాణ సందర్భాన్ని బట్టి అనుమతితో ప్రయాణం సాగించగలిగేవారు. కానీ ఇకపై అటువంటి వెసులుబాటు ఉండదు. భారత రైల్వే తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం, మే 1, 2025 నుండి వెయిటింగ్ టికెట్ ఉన్న ప్రయాణికులను ఏసీ లేదా స్లీపర్ కోచ్‌లలోకి అనుమతించరు. కన్ఫర్మ్ టికెట్ లేకపోతే, ఆ ప్రయాణికుడు కేవలం జనరల్ (అన్‌రిజర్వ్డ్) కోచ్‌లో మాత్రమే ప్రయాణించవచ్చు.

అంటే మీరు టికెట్ బుక్ చేసుకున్నా అది కన్ఫర్మ్ కాలేదు అంటే, ఏసీ లేదా స్లీపర్ కోచ్‌లలోకి ఎక్కి ప్రయాణం చేయడానికి వీలు లేదు. భారత రైల్వేలో మే 1, 2025 నుండి అమల్లోకి రానున్న కొత్త నిబంధనలు రైలు ప్రయాణికులకు మళ్లీ ఓసారి డిసిప్లిన్‌ను గుర్తు చేస్తున్నాయి. ముఖ్యంగా స్లీపర్ లేదా AC కోచ్‌లకు సంబంధించి వెయిటింగ్ టికెట్ ఉన్నవారిపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది.

Indian Railway Alert No Travel In Sleeper

ఇప్పటి వరకూ కొంతమంది ప్రయాణికులు టికెట్ కన్ఫర్మ్ కాకపోయినా, ఏదో ఒక విధంగా కోచ్‌లోకి ఎంటర్ అయి ప్రయాణం సాగించే పరిస్థితులు కనిపించేవి. కానీ ఇకపై అలా జరగదు. ఒకవేళ ఎవ్వరైనా వెయిటింగ్ టికెట్‌తో స్లీపర్ లేదా AC కోచ్‌లో ప్రయాణిస్తున్నట్టు టిటిఇ గుర్తిస్తే, అతనికి జరిమానా విధించే అవకాశం ఉంటుంది. అంతటితో కాదు, అవసరమైతే అతనిని జనరల్ కోచ్‌కి పంపించవచ్చు.

ఇది కేవలం నిబంధన ఉల్లంఘన అనే కోణంలోనే కాకుండా, ఇతర ప్రయాణికుల ప్రయాణ అనుభవాన్ని మరింత మెరుగుపరిచే ఉద్దేశంతో తీసుకున్న చర్య అని తెలుస్తోంది. మొత్తానికి, టికెట్ బుక్ చేయడమే కాదు, అది కన్ఫర్మ్ అయిందో లేదో కూడా ఇప్పటినుంచి ప్రతి ప్రయాణికుడు కచ్చితంగా చెక్ చేయాల్సిన సమయం వచ్చింది. ప్రయాణానికి ముందు టికెట్ స్టేటస్‌ను చెక్ చేయడం, అవసరమైతే వేరే డేట్ లేదా ట్రైన్ కోసం చూస్తేనే మంచిది.

Indian Railway Alert No Travel In Sleeper Or Ac Coach

లేదంటే, మీరు బుక్ చేసిన AC టికెట్ చేతిలో ఉన్నా, ప్రయాణం మాత్రం జనరల్ కోచ్‌లో సాగాల్సిన పరిస్థితి ఎదురవచ్చు. ఐఆర్‌సీటీసీ(IRCTC) ద్వారా బుక్ చేసిన ఆన్‌లైన్ టికెట్ల విషయంలో వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నట్లయితే రైలు బయల్దేరే సమయానికి కూడా ఆ టికెట్ కన్ఫర్మ్ కాకపోతే, అది ఆటోమేటిక్‌గా క్యాన్సిల్ అవుతుంది. అంటే ప్రయాణానికి ముందు మీరు ప్రత్యేకంగా క్యాన్సిల్ చేయకపోయినా, IRCTC వ్యవస్థ దానిని చెల్లుబాటు కానిదిగా చేస్తుంది.

అలాగే, స్టేషన్ కౌంటర్‌ వద్ద కొనుగోలు చేసే వెయిటింగ్ టికెట్ల విషయానికి వస్తే, చాలా మంది స్లీపర్ లేదా ఏసీ కోచ్‌లలో ఎక్కి ప్రయాణిస్తున్న విషయం తెలిసిన విషయమే. ఇది అనధికారిక ప్రయాణంగా మారుతుండటంతో, రైల్వే ఇకపై దీనిపై కఠినంగా వ్యవహరించనుంది. ఒకవేళ వెయిటింగ్ టికెట్ ఉన్న ప్రయాణికుడు రిజర్వ్డ్ కోచ్‌లో ప్రయాణిస్తే, కన్ఫర్మ్ టికెట్ ఉన్నవారు తమ సీట్లు పొందడంలో ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఇకపై సమస్య తీరనుంది.

Indian Railway Alert

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Thursday, May 1, 2025, 7:30 [IST]
English summary
Indian railway alert no travel in sleeper or ac coach on waiting ticket from may 1st 2025
Read more on: #offbeat #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+