Charging not Allowed in Trains ప్రయాణికులకు రైల్వే షాక్‌.. ఇక నుంచి ఆ సమయంలో రైళ్లలో ఛార్జింగ్ బంద్‌..

రైలులో ప్రయాణించేటప్పుడు చేతిలో సెల్‌ఫోన్‌ లేదా ల్యాప్‌టాప్‌ లేకుండా ప్రయాణించడం చాలా కష్టం. సుదూర ప్రయాణంలో అదే మనకు కాలక్షేపం. అందుకే ప్రయాణికుల సౌలభ్యం కోసం ఛార్జింగ్ సదుపాయాన్ని రైళ్లలో రైల్వే శాఖ అందుబాటులో ఉంచింది. కానీ ఇటీవల జరుగుతున్న కొన్ని పరిణామాల దృష్ట్యా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రయాణికుల భద్రత కోసం భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రైళ్లలో రాత్రిపూట ప్రయాణికులు ఛార్జింగ్‌ పాయింట్లను ఉపయోగించకుండా చర్యలు చేపట్టింది. వారి భద్రతను దృష్టిలో ఉంచుకుని అగ్నిప్రమాదాలను నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. రైళ్లలో ఛార్జింగ్‌ పాయింట్లను రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఆరు గంటల పాటు స్విచ్‌ ఆఫ్‌ చేయాలని నిర్ణయించింది.

Charging not Allowed in Trains

రైళ్లలో ఇటీవల వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్న దృష్ట్యా రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 వరకు ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు మరియు ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలను ఛార్జ్‌ చేసుకునే అవకాశం ఉండదు. ముందు జాగ్రత్త చర్యగా రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ సూచనలు కొత్త కాదు.. ఇప్పటికే పశ్చిమ రైల్వే మార్చి 16 న ఛార్జింగ్‌ పోర్టులకు సరఫరాను నిలిపివేసింది.

రైలు బోగీల్లో ఉండే చార్జింగ్‌ స్టేషన్లను రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల మధ్యలో స్విచ్ఛాఫ్‌ చేసి ఉంచాలని గతంలోనే రైల్వే సేఫ్టీ కమిషనర్‌ ప్రతిపాదించారు. 2014 లో బెంగళూరు- హజూర్‌ సాహిబ్‌ నాందేడ్‌ ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనతో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్య ఛార్జింగ్ పాయింట్లను స్విచ్‌ ఆఫ్‌ చేయాలని రైల్వే బోర్డు అన్ని జోన్‌లను ఆదేశించింది.

Charging not Allowed in Trains

'ఇటీవలి అగ్ని ప్రమాదాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇది కేవలం ముందు జాగ్రత్త చర్య. అంతకుముందు కూడా రైల్వే బోర్డు ఈ విధమైన ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రైళ్లలో ప్రధాన స్విచ్‌ బోర్డు నుంచి ఛార్జింగ్‌ పాయింట్లకు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు స్విచ్‌ ఆఫ్‌ చేయబడుతుంది.' అని తెలిపారు.

రైళ్లలో అగ్ని ప్రమాదాలను తగ్గించడానికి ఇటీవల రైల్వే ధూమపానంపై అనేక కార్యక్రమాలను నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఎందుకంటే ఈ కారణంతోనే ఆన్‌బోర్డ్ రైళ్ళలో కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. దేశంలోని మొత్తం 5,950 రైల్వే స్టేషన్లలో వైఫై సదుపాయం ఉంది. ఇందులో ప్రీపెయిడ్ వైఫై సదుపాయం 4000 స్టేషన్లలో లభిస్తుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, May 26, 2023, 14:37 [IST]
English summary
Indian railway ban charging of electronic gadgets between 11pm and 5am
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+