Vande Bharat వందే భారత్ రైలు క్యాబిన్ వీడియో చూశారా.. ఆకట్టుకుంటున్న డిజైన్ సహా టెక్నాలజీ..!
వందే భారత్ రైలు.. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల మధ్య రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ రైలు కోచ్ లోపలి భాగం సహా సేఫ్టీ ఫీచర్ల గురించి ఇప్పటికే (Vande Bharat) అనేక వీడియోలు బయటకు వచ్చాయి. ఇతర రైళ్లో అధునాతన టెక్నాలజీ సహా మెరుగైన భద్రతా వ్యవస్థలున్నాయి. మరియు ఇతర రైళ్లలో పోలిస్తే ప్రయాణికులను త్వరగా గమ్యస్థానాలను చేరుస్తున్నాయి.
వందే భారత్ రైలు క్యాబిన్ వీడియో విడుదల : ఇటీవల అమృత్ భారత్ పేరిట మరో రైలును రైల్వే శాఖ ప్రారంభించింది. మధ్య తరగతి ప్రయాణికులను దృష్టిలో పెట్టుకొని ఈ రైలును ప్రారంభించింది. ఈ అమృత్ భారత్ రైలును ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల ప్రారంభించారు. అయితే తాజాగా వందే భారత్ రైలు క్యాబిన్ వీడియోను (Vande bharat cabin view video) భారతీయ రైల్వే శాఖ విడుదల చేసింది.

భారతీయ రైల్వే తన అధికారిక X ఖాతా ద్వారా ఈ వీడియోను విడుదల చేసింది. అయితే ఈ వీడియో ఆకట్టుకుంటుంది. క్యాబిన్ లోపల అధునాతన టెక్నాలజీ సహా ప్రీమియం లుక్‌ను కలిగి ఉంది. కేవలం లోకోపైలెట్‌లు మాత్రమే చూడగలిగే క్యాబిన్‌ను తొలిసారి రైల్వే శాఖ విడుదల చేసింది. లోక్‌పైలెట్ సీట్ల నుంచి ట్రాక్ వ్యూ ఆకట్టుకుంటుంది.
మెరుగైన సౌకర్యాలు, వివాదాలు : వందే భారత్ రైలు ప్రారంభం నుంచి ఈ రైళ్ల వేగం సహా సేఫ్టీ ఫీచర్లు సహా అధునాతన సౌకర్యాలపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే దీంతోపాటు ఈ రైలు ప్రమాదాలు, వందే భారత్ రైలుపై దాడి వంటి ఘటనలు కూడా అనేకం చోటుచేసుకున్నాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా వైరల్ అయ్యాయి.

అధునిక టెక్నాలజీ, సౌకర్యాలు : ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న వందే భారత్ రైళ్లలో అనేక అధునాతన సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నాయి. రైలులో ఆటోమేటిక్ డోర్ల నియంత్రణ పూర్తిగా డ్రైవర్ వద్దనే ఉంటుంది. ప్లాట్‌ఫారమ్ ఉన్న చోట మాత్రమే తలుపులు తెరుచుకుంటాయి. మరియు తలుపులు మూసిన అనంతరమే రైలు ప్రారంభం అవుతుంది. దాంతోపాటు సీసీ కెమెరాలు, అధునాతన భద్రతా వ్యవస్థ ఉంటుంది.
తొలిసారిగా వందే భారత్ ఎప్పుడు ప్రారంభం అయిందంటే : తొలిసారిగా ఢిల్లీ- కాన్పూర్- అలహాబాద్- వారణాసి మార్గంలో 2019 ఫిబ్రవరి 15న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాన మంత్రి మోడీ ప్రారంభించారు. ఈ రైళ్లను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేస్తున్నారు. చెన్నైలోని పెరంబలూరు ఐసీఎఫ్ ఫ్యాక్టరీలో వందే భారత్ రైళ్లను తయారు చేస్తున్నారు. ఇక్కడ ఈ రైళ్ల కోసం ప్రత్యేక విభాగం ఉంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








