Mahindra Bolero: రైల్వే ట్రాక్ పై బొలెరోతో టెస్ట్ డ్రైవ్.. అధికారుల వినూత్న ఆలోచన

భారతీయ రైల్వే ప్రపంచంలోని అతిపెద్ద రైల్ నెట్‌వర్క్‌ దేశాల్లో ఒకటిగా ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా, దేశంలోని మారుమూల ప్రాంతాలను అనుసంధానిస్తూ.. మొత్తం వ్యవస్థను మెరుగుపరచడానికి దేశ నలుమూలల్లో మరింతగా విస్తరిస్తోంది. ప్రస్తుతం, భారతీయ రైల్వే జమ్మూ & కాశ్మీర్‌లో ఒక అద్భుత ఇంజనీరింగ్ కళాకండాన్ని నిర్మిస్తోంది. అక్కడ చోటుచేసుకున్న వింత సందర్భాన్ని ఈ కథనంలో వివరించే ప్రయత్నం చేస్తాం.

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన నిర్మాణాన్ని జమ్మూ కాశ్మీర్ లోని చీనాబ్ నదిపై రైల్వేశాఖ నిర్మిస్తోంది. ఈ వంతెన నిర్మాణం చివరి దశలో ఉంది. వంతెన ప్రారంభానికి ముందు టెస్టింగ్ కోసం రైల్వే అధికారులు పరిశీలిస్తున్నారు. అందులో భాగంగా ఆన్ లైన్ లో విడుదలైన ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. రైల్వై ట్రాక్ పై మహీంద్రా బొలెరో తనిఖీ రైలుగా ఉపయోగించారు. దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకోసం..

బొలెరో

మెటల్ వీల్స్..
టెస్టింగ్ పనులను సులభతరం చేయడానికి మహీంద్రా నుంచి పేరుందిన బొలెరోను తనిఖీ ట్రాలీగా రైల్వే అధికారులు మార్చారు. కంపెనీ నుంచి వచ్చే ఒరిజినల్ వీల్స్ టైర్లు కాకుండా, ముందు వెనుక ట్రాలీ లేదా లోకో వంటి అదనపు మెటల్ వీల్స్‌ను దీనికి జోడించారు. ట్రాక్ పై సులభంగా ప్రయాణించేలా వీటిని ఏర్పాటు చేశారు. సాధారణ టైర్లులా కాకుండా అదనపు శక్తిని ఈ వీల్స్ పొందనున్నాయి. వెనక చక్రాల నుంచి ఈ వాహనం శక్తిని అందిస్తుంది.

సాధారణంగా, రైల్వేలు ఇటువంటి తనిఖీల కోసం మోటరైజ్డ్ ట్రాలీలను ఉపయోగిస్తాయి. ఈ ట్రాలీలు వెనుక భాగంలో చిన్న ఇంజన్‌ను కలిగి ఉంటాయి. దీనిపై నలుగురు కూర్చోవచ్చు. ఈ సందర్భంలో, మహీంద్రా బొలెరోలో 7-8 మంది కూర్చోవచ్చు. రైల్వే ట్రాక్‌పై సాధారణ కారును తనిఖీ వాహనంగా ఉపయోగించడం బహుశా ఇదే మొదటిసారి కావడం విశేషం. నిర్మాణ దశలో రైల్వే ట్రాక్‌లపై ఎక్స్‌కవేటర్లు, ట్రక్కులను ఉపయోగించడం ఇది వరకు చూశాము.

బొలెరో ట్రాక్

ఈఫిల్ టవర్ కంటే ఎత్తు..
ఈ వీడియోను జర్నలిస్ట్, రచయిత రాజేంద్ర బి అక్లేకర్ ఆన్ లైన్ లో షేర్ చేశారు. జమ్మూ కాశ్మీర్‌లో చీనాబ్ నదిపై నిర్మించిన ఈ వంతెన నదీగర్భం నుంచి దాదాపు 359 మీటర్ల ఎత్తులో ఉంది. ఆన్‌లైన్‌లో కనిపించిన వీడియోలో, లోపల ఉద్యోగులతో పాటు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా కూర్చున్నారు. బొలెరో రైల్వే ట్రాక్‌లను పరిశీలిస్తోంది మరియు ఈ వంతెన పారిస్‌లోని ఈఫిల్ టవర్ కంటే ఎత్తుగా ఉండటం గమనార్హం. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చ్ వంతెనగా చరిత్ర సృష్టించనుంది.

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి పనులు దాదాపు పూర్తి అయ్యాయి. ఈ బ్రిడ్జి ఇప్పటికే అనేక రకాలుగా పరీక్షించబడింది. ఈ వంతెన అత్యంత వేగవంతమైన గాలులు, భూకంపాలు, తీవ్ర ఉష్ణోగ్రతలు జలసంబంధ ప్రభావాలను తట్టుకునేలా రైల్వే శాఖ నిర్మించింది. వంతెన ప్రధాన ట్రాక్ నిర్మాణం ఏప్రిల్ 2021లో పూర్తయింది ఈ వంతెన 120 సంవత్సరాల జీవితకాలం వరకు చెక్కు చెదరకుండా ఉంటుందని రైల్వే తెలిపింది.

బ్లాస్ట్ ప్రూఫ్..
ఈ ప్రాజెక్టులో ప్రభుత్వం దాదాపు 1,400 కోట్ల పెట్టుబడి పెట్టింది. భారతదేశంలో, విమానంలో ప్రయాణించడం కంటే చౌకైనందున ఎక్కువ మంది జనాభా ఇప్పటికీ రైల్వేలపైనే ఆధారపడుతున్నారు. చీనాబ్ నదిపై నిర్మించిన వంతెన కత్రా నుంచి బనిహాల్ వరకు 111 కి.మీ.లను కలుపుతూ కీలక పాత్ర పోషిస్తుంది. చీనాబ్ నదిపై నిర్మించిన రైల్వే వంతెన 1.3 కి.మీ పొడవు, 266 కి.మీ వేగంతో గాలులను తట్టుకోగలదు.

ఇది బ్లాస్ట్ ప్రూఫ్ కూడా ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా (యుఎస్‌బిఆర్‌ఎల్) రైలు లింక్ పూర్తిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత వందే భారత్ ఎక్స్‌ప్రెస్ త్వరలో జమ్మూ శ్రీనగర్‌లను కలుపుతుందని రైల్వే మంత్రి తెలిపారు. బ్రిడ్జి నిర్మాణం డిసెంబర్ 2023 లేదా జనవరి 2024 నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

More from DriveSpark

Article Published On: Wednesday, March 29, 2023, 13:42 [IST]
English summary
Indian railway uses mahindra bolero as a testing vehicle details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+