రైల్వే ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. త్వరలో రానున్న వందే భారత్‌ స్లీపర్‌, మెట్రో రైళ్లు

రైల్వే ప్రయాణికులకు భారతీయ రైల్వే శాఖ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఇప్పటివరకు వందేభారత్‌ సెమీ హై స్పీడ్‌ రైళ్లు ప్రయాణికులకు సేవలందిస్తుండగా.. త్వరలో వందే భారత్‌ స్లీపర్‌, మెట్రో రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఇవి ఈ ఆర్థిక సంవత్సరంలోనే పట్టాలెక్కుతాయని రైల్వే అధికారి తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

దేశంలో మొదటి వందే భారత్ స్లీపర్ రైలును వచ్చే ఏడాది మార్చిలో ప్రవేశపెట్టేలా.. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ 2024 రోల్‌అవుట్‌ను లక్ష్యంగా పెట్టుకుందని ICF జనరల్‌ మేనేజర్‌ BG మాల్యా తెలిపారు. వందే భారత్‌ స్లీపర్ కోచ్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో.. అంటే మొదటి రైలు ఉత్పత్తిలో ఉందని, వచ్చే ఏడాది మార్చిలో అందుబాటులోకి వస్తుందని తెలిపారు.

Vande-Bharat-Sleeper-Metro

వందేభారత్‌ స్లీపర్ రైలుతో పాటు, వందే మెట్రో అని పిలువబడే మరో రైలును కూడా ICF ఉత్పత్తి చేస్తోంది. అధికారుల సమాచారం ప్రకారం వందే మెట్రో 12-కోచ్‌లను కలిగి ఉంటుంది. ఈ రైలును స్వల్ప దూర ప్రయాణానికి వినియోగించనున్నారు. కాగా ఈ రైలు స్లీపర్‌ కంటే ముందుగా అంటే.. జనవరి 2024 నాటికి అందుబాటులోకి వస్తుందని మాల్యా వెల్లడించారు.

ప్రస్తుతం ప్రయాణికులకు సేవలందిస్తున్న వందే భారత్ సెమీ హై స్పీడ్‌ రైళ్లు అన్నీ సీటర్ కోచ్‌లుగా ఉన్నాయి. ఇవి రాత్రిపూట ప్రయాణాలకు అనుకూలంగా ఉండవు. దీంతో రాత్రి పూట ప్రయాణాలకు అనుగుణంగా కొత్త స్లీపర్‌ రైళ్లను ప్రవేశపెట్టనున్నారు. దీంతో ప్రయాణికుల సంఖ్య మరింతే పెరిగే అవకాశం ఉంది.

Vande-Bharat-Sleeper-Metro

ఈ స్లీపర్ రైళ్లను దేశంలోని రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (RVNL) మరియు రష్యాకు చెందిన TMH గ్రూప్‌ తయారు చేస్తున్నాయి. న్యూ వెర్షన్‌ వందే భారత్‌ 200 స్లీపర్‌ రైళ్లలో 120 రైళ్లను TMH సరఫరా చేయనుంది. మిగిలిన 80 రైళ్లను టిటాగర్ వ్యాగన్లు మరియు BHEL సంయుక్తంగా రూపొందిస్తాయి.

ప్రతి వందే భారత్ స్లీపర్ రైలు గంటకు 160 కి.మీ వేగంతో ప్రయాణించేలా రూపొందించబడుతుందని RVNL మెకానికల్‌ GM అలోక్‌ కుమార్ మిశ్రా ఇటీవల వెల్లడించారు. ఇందులో 16 బోగీలు ఉంటాయని చెప్పారు. వాటిలో 11- 3 AC, 4- 2 AC, ఒక AC 1 కోచ్ ఉంటుందని వివరించారు. భవిష్యత్తులో రైల్వే కోచ్‌ల సంఖ్యను 20 లేదా 24 వరకు పొడిగించే అవకాశం ఉందన్నారు.

స్వదేశీ పద్ధతిలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను తయారు చేసేందుకు భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం ఇది. మొదటి వందే భారత్‌ రైలును ఫిబ్రవరి 15, 2019న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ రైలు న్యూఢిల్లీ - వారణాసి మధ్య సేవలందిస్తోంది

స్వదేశీ సెమీ హై స్పీడ్ రైలు సెట్‌లను తయారు చేసే ప్రాజెక్ట్ 2017 సంవత్సరంలో ప్రారంభమైంది. అత్యంత తక్కువకాలంలోనే అంటే కేవలం 18 నెలల్లోనే, ICF చెన్నై రైలు-18ని పూర్తి చేసింది. దేశంలో మొట్టమొదటి సెమీ హై స్పీడ్ రైలు మేడ్-ఇన్-ఇండియా అని తెలియజేసేందుకు జనవరి 2019లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌గా పేరు మార్చారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Saturday, September 16, 2023, 18:59 [IST]
English summary
Indian railway will launch vande bharat sleeper and metro trains soon in this financial year
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+