Indian Railways రైల్వే స్టేషన్లలో ఇకపై కొత్త సైన్ బోర్డులు.. మార్పులకు కారణం ఇదే..!

ప్రపంచంలోనే భారతీయ రైల్వే అతిపెద్ద రైలు నెట్‌వర్క్‌లలో ఒకటి. దీని ద్వారా ప్రతిరోజూ లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. రైల్వే స్టేషన్లలోని సైన్ బోర్డులు ప్రయాణీకులకు మార్గదర్శకంగా పనిచేస్తాయి. అంతే కాకుండా వారి రైలు ప్రయాణానికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని పొందవచ్చు. అయితే, రైల్వే స్టేషన్లలో ఈ సైన్ బోర్డుల ద్వారా ప్రజలకు పూర్తి సమాచారం అందడం లేదని కేంద్రం భావించింది. దీంతో ఓ సరికొత్త నిర్ణయం తీసుకుంది.

మరికొద్ది రోజుల్లో రైల్వే స్టేషన్లలో సైన్ బోర్డులను పూర్తిగా మార్చనున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ సోమవారం ప్రకటించారు. ఇకపై దేశమంతటా ఒకే రకమైన సైన్ బోర్డులు కనిపించబోవని భారతీయ రైల్వే తెలిపింది. ప్రయాణికుల సౌకర్యార్థం రంగులు, ఫాంట్‌లు, పిక్టోగ్రాఫ్‌ల వినియోగానికి సంబంధించి దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లలోని సంకేతాలను ప్రామాణికంగా ఉంచుతామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు.

Indian Railways

'అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్' కింద దేశమంతటా 1,275 స్టేషన్లను భారతీయ రైల్వే పునరాభివృద్ధి చేస్తోంది. ఈ క్రమంలో భారతీయ రైల్వే ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేలా అన్ని స్టేషన్లలో ఏకరీతి సూచికలను ఉంచడానికి ప్రయత్నిస్తోంది. భారత్‌లో రైళ్లు అత్యంత ముఖ్యమైన రవాణా సాధనంగా పరిగణించబడుతున్నాయి. రైల్వేకు సంబంధించిన ప్రతి చిన్న, పెద్ద సమాచారం చాలా ముఖ్యమైనది. స్టేషన్లలో ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని రైల్వేశాఖ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

మనకు ప్రతి రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫామ్‌కు రెండు వైపులా సైన్‌ బోర్డులు కనిపిస్తాయి. పసుపు రంగు బోర్డుపై నలుపు అక్షరాలతో ఆ స్టేషన్‌ పేరు రాసి ఉంటుంది. స్టేషన్‌ కొంత దూరంలో ఉండగానే మనం ఏ స్టేషన్‌లో ఉన్నామో ఈజీగా తెలుసుకోవచ్చు. లోకో పైలట్‌ సైతం ఆ స్టేషన్‌ పేరు కనిపించిన తర్వాత వేగాన్ని తగ్గిస్తారు. ఇకపై ఈ తరహా సైన్‌ బోర్డులు కాకుండా పలు సాంకేతిక మార్పులు చేస్తూ ఏకరీతి సైన్‌ బోర్డులను ఏర్పాటు కానున్నాయి.

Indian Railways

ఈ నిర్ణయం ద్వారా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న అన్ని రైల్వే స్టేషన్లలో కూడా ఒకే తరహా సైన్ బోర్డులు ఇకపై దర్శనమివ్వనున్నాయి. దీని ద్వారా ప్రజలు చాలా సులభంగా సమాచారాన్ని అందుకుంటారని అశ్విని వైష్ణవ్‌ వెల్లడించారు. ఈ క్రమంలో ప్రయాణికులు దేశవ్యాప్తంగా కొత్త రంగు రూపాల్లో సైన్ బోర్డులను చూడబోతున్నారు. ఇందులో డిజిటల్ సైన్ బోర్డులు కూడా ఉంటాయి.

ప్రస్తుత వ్యవస్థలోని లోపాలను అధిగమించేందుకు రైల్వే స్టేషన్లలో కొత్త ఫార్మాట్‌లో (ఫాంట్, ఫాంట్ పరిమాణం, రంగు, నేపథ్యం మొదలైనవి) సైన్ బోర్డులను సరిగ్గా అమర్చనున్నట్లు రైల్వే తెలిపింది. ప్రయాణికులు ఈ బోర్డులను చూసేందుకు వీలుగా స్టేషన్లలోని సరైన ప్రదేశాల్లో ఈ యూనిఫాం సైన్ బోర్డులు అమర్చుతారు.

Indian Railways

భారత రైల్వే స్టేషన్‌లలోని హ్యాండ్‌బుక్.. సాధారణ భాష, స్పష్టమైన ఫాంట్‌లు, సులభంగా కనిపించే రంగులు, సహజమైన పిక్టోగ్రాఫ్‌లకు ప్రాధాన్యతనిస్తుంది. వృద్ధులు, మహిళలు, పిల్లలు మరియు 'దివ్యాంగజన్' ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని దీనిని రూపొందించినట్లు మంత్రిత్వ శాఖ ప్రకటన తెలిపింది. కొత్త సైన్‌బోర్డ్‌ను రూపొందించేటప్పుడు డిజైన్, వర్గీకరణ, స్థానం మొదలైనవాటిని పరిగణనలోకి తీసుకుని అది బోర్డుపై స్పష్టంగా కనిపించేలా సులభమైన భాషలో ఉండనుంది. దీని ఫాంట్ పరిమాణం ప్రయాణికులకు సులభంగా కనిపిస్తుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, May 16, 2023, 16:06 [IST]
English summary
Indian railways decide to change sign boards at stations soon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+