ప్రయాణికుల కోసం బ్యాటరీతో నడిచే వాహనాలను ప్రవేశపెట్టనున్న ఇండియన్ రైల్వే
ఇండియన్ రైల్వేలోని జోనల్ రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల అవసరాల కోసం బ్యాటరీ ద్వారా నడిచే వాహనాలను అందుబాటులో ఉంచడానికి ఇండియన్ రైల్వే సుముఖంగా ఉంది. బధిరులు, వికలాంగులు, వృద్దులు మరియు అనారోగ్యంగా ఉన్న ప్రయాణికుల కోసం బ్యాటరీతో నడిచే వాహనాలను రైల్వే స్టేషన్లలో అందుబాటులో ఉంచనున్నారు.

ఈ బ్యాటీరీతో నడిచే వాహనాలను ఎన్‌జిఓలు, ఛారిటబుల్ ట్రస్టులు, కార్పోరేట్లు మరియు సామాజిక బ్యాధ్యత గల కార్పోరేట్స్‌కు వీటి నిర్వహణ భాధ్యతలను అందివ్వనున్నారు. బ్యాటరీ ద్వారా ఆపరేట్ అయ్యే వాహనాలతో ఉచితంగా సర్వీసును అందిస్తారు.
Also Read: ఇండియా మీదుగా వెళ్లే పది అంతర్జాతీయ రైలు మార్గాలు
మొత్తం 59 బ్యాటరీతో నడిచే వాహనాలను సుమారుగా 40 మేజర్ రైల్వే స్టేషన్లకు సరఫరా చేయనున్నారు. దాతలు అందించే వాహనాల సంఖ్యను బట్టి మరియు రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీని బట్టి వీటిని వితరణ చేయనున్నారు.


Click it and Unblock the Notifications








