రైలు ప్రయాణికులకు సూపర్ న్యూస్.. ఈ స్కీమ్‌తో మీరు విమానంలో జర్నీ చేస్తున్న ఫీల్‌ను పొందవచ్చు.!!
మీరు తరచూ రైలు ప్రయాణాలు ఎక్కువగా చేస్తుంటారా.?? అయితే మీకు భారతీయ రైల్వే శాఖ శుభవార్త తీసుకొచ్చింది. ప్రయాణికుల కోసం ఇండియన్ రైల్వే 'యాత్రి సేవా అనుబంధ్ స్కీమ్'ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా రైళ్లలో ప్రయాణించేవారికి సూపర్ బెనిఫిట్స్ లభించనున్నాయి. ఈ స్కీమ్‌కు సంబంధించి పూర్తి సమాచారం ఈ కథనంలో చదవండి.
భారతీయ రైల్వే శాఖ.. పైలెట్ ప్రాజెక్టు కింద యాత్రి సేవా అనుబంధ్(Yatri Seva Anubandh Scheme) స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. అయితే ఈ స్కీమ్ అన్ని రైళ్లలో అందుబాటులో లేదు. భారత ప్రభుత్వం విప్లవాత్మకంగా చేపట్టిన వందే భారత్(Vande Bharat) ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణించే వారికి మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది.

యాత్రి సేవా అనుబంధ్ స్కీమ్ కింద వందే భారత్ రైలు ప్రయాణికులు పలు వాల్యూ యాడెడ్ సర్వీసులు పొందవచ్చు. ప్రయాణికులకు విమానం తరహాలో సేవలు అందించాలనే ఉద్దేశంతో రైల్వే శాఖ ఈ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ ద్వారా వందేభారత్‌లో ప్రయాణించే ప్రయాణికులు విమానంలో ప్రయాణించే అనుభవాన్ని, సర్వీసులను పొందవచ్చు.
యాత్రి సేవా అనుబంధ్ స్కీమ్ ద్వారా ఎక్కాల్సిన, దిగాల్సిన రెండు రైల్వే స్టేషన్లలో వందే భారత్ ట్రైన్ టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు పలు బెనిఫిట్స్ లభిస్తాయి. జర్నీ ప్రారంభం అయ్యే స్టేషన్ నుంచి, అలాగే గమ్య స్థానమైన స్టేషన్‌కు చేరేవరకు ప్రయాణికులకు ఈ కొత్త స్కీమ్ సర్వీసులు అందించనుంది.

క్యాబ్ బుకింగ్‌తో పాటు వీల్ చెయిర్, బగ్గీ డ్రైవ్ వంటి సేవలను ప్రయాణికులకు రైల్వే శాఖ అందిస్తుంది. అంతేకాకుండా ట్రావెల్ ఎసెన్షియల్స్, యాక్సెసరీస్ కూడా అందిస్తారు. ప్రయాణికులు ఆన్‌బోర్డ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లో క్వాలిటీ కంటెంట్ పొందొచ్చు. ఇంకా ప్రయాణికులు జర్నీలో ఉన్నప్పుడు తమకు నచ్చిన ఫుడ్‌ను ఆర్డర్ చేసుకునే సదుపాయం కూడా ఉంటుంది.
ఎక్స్‌క్లూజివ్ ఫుడ్ మెనూ నుంచి ప్రయాణికులు తమకు నచ్చిన వంటకాలను ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ ఆహారాన్ని ISO సర్టిఫైడ్ బేస్ కిచెన్స్ నుంచి తయారుచేసి మీకు ఈ ఫుడ్ అందిస్తారు. ఇందుకోసం ఎలాంటి అవకతవకలు జరగుకుండా కాంట్రాక్టర్లపై రైల్వే శాఖ ఓ కన్నేసి ఉంచుతుంది. ఆహారం తయారీ విషయంలో వీరికి కొన్ని మార్గదర్శకాలను కూడా జారీ చేస్తుంది.
ప్రయాణీకులు టికెట్ బుకింగ్ సమయంలో లేదా యాత్రి సేవా యాప్ ద్వారా ప్రీ-పెయిడ్ భోజనాన్ని ఆర్డర్ చేసుకునే సదుపాయం ఉంది. ఇంకా విమానంలో లా కార్టే సేవలను కూడా ప్రయాణికులు ఎంచుకోవచ్చు. ఆహారాన్ని అందించడంతోపాటు రైలు కోచ్‌లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసేందుకు తగిన సిబ్బందిని నియమించాలని రైల్వే యాజమాన్యం నిర్ణయించింది. వీటిని పర్యవేక్షించడానికి ప్రతి రైలులో ఓ ఉద్యోగిని నియమిస్తారు.
ప్రస్తుతానికి, వందే భారత్ రైళ్లలో భోజనం ఆర్డర్ సిద్ధం చేయడానికి.. చెన్నైలో భారీ వంటగదిని ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీంతో ప్రయాణీకులు తమ ప్రయాణ సమయంలో లేదంటే యాత్రి సేవా యాప్ ద్వారా తమకు నచ్చిన ఆహారాన్ని ఆర్డర్ చేయవచ్చు.
ప్రస్తుతం భారత్‌లో అత్యంత వేగవంతమైన, సౌకర్యవంతమైన రైలుగా వందే భారత్ రైళ్లు ప్రసిద్ధి చెందాయి. అందుకే చాలా మంది సుదూర ప్రాంతాలకు ప్రయాణించేందుకు వందే భారత్‌ను ఎంచుకుంటున్నారు. కాగా ప్రస్తుతం ఉన్న సీటింగ్ సౌకర్యాలతో వందే భారత్ రైళ్లు పగటి పూట మాత్రమే నడుస్తున్నాయి.
సాధారణ రైళ్లతో పోలిస్తే వందే భారత్ రైలు ప్రయాణ సమయం చాలా తక్కువ. అంతే కాకుండా ఈ సెమీ హై స్పీడ్ రైళ్లు కొన్ని స్టేషన్లలో మాత్రమే ఆగడంతో ఎక్కువగా ఈ రైళ్లలో ప్రయాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇందులో విమానాల్లో అందించే సర్వీసును అందించాలనే ఉద్దేశంతో పైలెట్ ప్రాజెక్టుగా యాత్రి సేవా అనుబంధ్‌ను తీసుకొచ్చింది. ఈ సర్వీసులను మొదటగా దక్షిణ భారత రైళ్లలో అందించనున్నారు.


Click it and Unblock the Notifications








