భారతీయ రైళ్లను చూసి అన్ని దేశాలు ఆశ్చర్యపోబోతున్నాయి! ఇది పూర్తిగా జరిగితే చాలా సమస్యలు పరిష్కారమవుతాయి
భారతీయ రవాణా వ్యవస్థలో రైల్వేలు ఒక ప్రముఖ స్థానం సంపాదించుకున్నాయి. దేశం అంతటా విస్తరించిన వేరు వేరు రైలు మార్గాల ద్వారా భారతీయ రైల్వేలు లక్షలాది మంది ప్రజలకు ప్రతిరోజూ సేవలందిస్తూ, వారి ప్రయాణాలను తక్కువ ఖర్చులో మరింత సౌకర్యవంతంగా అందిస్తున్నాయి. రైల్వేలు భారతదేశానికి ఒక వెన్నెముక లాంటివి. ప్రతిరోజూ కోట్ల మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తున్నారు. ఇది ప్రపంచంలోని అతిపెద్ద రవాణా వ్యవస్థల్లో ఒకటిగా భారతీయ రైల్వేలను నిలబెడుతోంది. ఇది కేవలం ప్రయాణికులకు మాత్రమే కాదు, సరుకుల రవాణాకు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వ్యవసాయం నుండి పరిశ్రమల వరకు అన్ని రంగాలకూ రైల్వేలు ముఖ్యమైన శక్తిగా ఉన్నాయి.
గత దశాబ్దంలో (10 ఏళ్లలో) భారతీయ రైల్వే వ్యవస్థ అభివృద్ధి దిశగా కీలకమైన మార్పులను చవిచూసింది. ప్రయాణికుల అవసరాలను మెరుగైన రీతిలో తీర్చడమే లక్ష్యంగా తీసుకున్న చర్యల ఫలితంగా, రైల్వే నాణ్యత పలు రంగాల్లో అభివృద్ధిని సాధించింది. వందే భారత్ వంటి హై-స్పీడ్ రైళ్లు రావడం, వేగంగా ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు తీసుకెళ్ళడం వంటి కీలక మార్పులు వచ్చాయి. రైల్వే స్టేషన్ల అభివృద్ధి కూడా చాలా వరకు పెరిగింది.

డిజిటల్ సమాచారం, వేయిటింగ్ లాంజులు, ఫుడ్ కోర్టులు వంటి ఆధునిక సదుపాయాలతో స్టేషన్లు మరింత అందంగా ముస్తబవుతున్నాయి. కొన్ని ప్రధాన స్టేషన్లు అయితే విమానాశ్రయాల్లా కనిపించే స్థాయికి చేరుకున్నాయి. ఇప్పుడు రైలులో భోజనాన్ని ఆర్డర్ చేస్తే, అది నేరుగా సీటుకే డెలివరీ అవుతోంది. దీనివల్ల ప్రయాణ సమయంలో ఇక భోజనం కోసం ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రీబుకింగ్ లేదా రియల్ టైం ఆర్డర్ ద్వారా భోజనం సులభంగా అందుబాటులోకి వచ్చేస్తోంది.
ఈ విధంగా గత 10 సంవత్సరాలలో భారతీయ రైల్వే రంగం ఊహించని మార్పులకు లోనైంది. రైల్వే ప్రయాణం అంటే కేవలం ఒక గమ్యస్థానం చేరుకోవడమే కాక, ఫ్రెండ్స్, కుటుంబం, రోజువారి ఉద్యోగాలు చేసేవారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం మార్పుల్లో రైళ్లలో ATM సౌకర్యం గురించి మరింత వివరంగా కింది కథనంలో తెలుసుకుందాం.

రైళ్లలో ATM: నగదు అవసరమయ్యే పరిస్థితుల్లో, ఇప్పటివరకు ప్రయాణికులు స్టేషన్లలో దిగి బ్యాంకుల వద్దకు వెళ్లాల్సి వచ్చేది. ఇది ఒక్కోసారి రిస్క్‌తో కూడుకున్న పని. దీనిని పరిష్కరించడానికి రైళ్లలో ATMలను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు చేసింది. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం చాలా ప్రారంభ దశలో ఉంది. ప్రస్తుతానికి, ముంబై-మన్మాడ్ ఎక్స్‌ప్రెస్ రైలులో మాత్రమే ATM సౌకర్యం ప్రవేశపెట్టబడింది. ఇది రైల్వేల్లో సాంకేతికత వినియోగంలో జరిగిన గణనీయమైన మార్పులలో ఒకటిగా నిలుస్తోంది.
భవిష్యత్తులో మరిన్ని రైళ్లలో ఈ సదుపాయాన్ని విస్తరించాలని భావిస్తున్నారు. దేశంలోని చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ATMలు అందుబాటులో ఉండకపోవడం ఒక ప్రధాన సమస్య. అలాంటి ప్రాంతాలకు రైలు మార్గం ద్వారా ప్రయాణించే ప్రయాణికులు, మధ్యలో ఎక్కడైనా నగదు అవసరం వచ్చినప్పుడు ఇబ్బంది పడుతుంటారు. ఇప్పుడు కొత్త ఆలోచనతో ఈ సమస్య తీరుతుంది.

ఈ తరహా సమస్యలను పరిష్కరించేందుకు భారతీయ రైల్వేలు ప్రారంభించిన "రైల్లో ATM" కార్యక్రమం, ఒక అద్భుత ఆవిష్కరణగా నిలుస్తోంది. రైలు ప్రయాణాన్ని కేవలం సౌకర్యవంతంగా చేయడమే కాక, ఆర్థిక పరంగా కూడా స్వయం సమృద్ధిగా మారుస్తోంది. అవసరమైన సమయంలో నగదు ఉపసంహరణకు ఇది బెస్ట్ పరిష్కారం. ఇది కేవలం ప్రయాణికులకే కాదు. బ్యాంకులకూ ఒక వ్యూహాత్మకంగా లాభదాయకమైన అవకాశంగా మారుతుంది.
రైల్వేలు అన్నీ ఇరుకైన, గదులతో నిండి ఉంటాయి. ప్రతి రోజూ వేలాదిమంది ప్రయాణికులు ఒకే చోట ఉంటారు. ఇటువంటి స్థలాల్లో ATMలు ఏర్పాటు చేయడం ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువమంది వినియోగదారులను చేరుకోగలుగుతారు. దీంతో రైళ్లలో ప్రయాణిస్తున్న వారికి సులభంగా నగదు చేతికి రావడంతో పాటు, బ్యాంకులకు కూడా మేలు జరుగుతుంది. ఇది పూర్తిగా జరిగితే భారతీయ రైల్వే గురించి అన్ని దేశాలు మాట్లాడుకుంటాయి.


Click it and Unblock the Notifications








