అక్టోబర్‌లో తొలి నాన్‌ AC వందే భారత్‌ రైలు ప్రారంభం.. ప్రత్యేకతలివే..!

ప్రస్తుతం దేశంలోని అనేక మార్గాల్లో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు రాకపోకలు సాగిస్తోంది. అయితే ఈ రైళ్లలో అధిక ధరలు కారణంగా చాలా మంది ఇందులో ప్రయాణం చేసేందుకు వెనక్కి తగ్గుతున్నారు అయితే ఈ సంవత్సరం అక్టోబర్‌ నుంచి నాన్‌ ఏసీ వందే భారత్‌ రైళ్లు ప్రారంభం కానున్నాయని సమాచారం.

ఈ నాన్‌ ఏసీ వందే భారత్‌ రైళ్లు కంఫర్ట్‌, వేగంలో ఎటువంటి రాజీపడలేదని తెలుస్తోంది. దీంతోపాటు మెరుగైన ఇంటీరియర్‌, ప్రయాణ సౌకర్యాలతో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ సంవత్సరం రెండు నాన్‌ ఏసీ వందే భారత్‌ రైళ్లను ప్రారంభించాలని రైల్వే శాఖ భావిస్తోంది.

First Non AC vande bharat train

చెన్నై ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాకర్టీ (ICF) వివిధ వేరియంట్లలో 3241 కోచ్‌లను తయారుచేయాలని ప్రణాళికలు వేస్తోంది. ఇందులో వందే మెట్రో, వందే భారత్‌ స్లీపర్‌ వెర్షన్‌లు ఉన్నాయి. ఇందులో తక్కువ ధరలతోనే ప్రయాణాలు చేయవచ్చు. తక్కువ ధరలు, అధిక వేగం సహా ఇతర సౌకర్యాలతో తొలి వందే భారత్‌ నాన్‌ ఏసీ రైలు ఈ సంవత్సరం అక్టోబర్‌లో ప్రారంభం కానుందని రైల్వే సీనియర్‌ అధికారులు తెలిపారు.

వందే భారత్‌ AC రైళ్ల వేగం గరిష్ఠంగా 160 kmphగా ఉంది. అదే నాన్‌ ఏసీ వందే భారత్‌ రైళ్ల వేగం గరిష్ఠంగా 130 kmphకు పరిమితం చేసే అవకాశం ఉంది. కిటికీలు తెరిచి ఉన్న రైళ్లను అధిక వేగంతో నడపడం సురక్షితం కాదని భావిస్తున్నట్లు సమాచారం. తొలి నాన్‌ ఏసీ వందే భారత్‌ రైలులో 21 కోచ్‌లు, రెండు మ్యాచింగ్‌ కలర్‌ లోకోమోటివ్‌లను కలిగి ఉంటాయని అధికారులు తెలిపారు.

ఈ రైలులో LHB కోచ్‌లు ఉంటాయి. పుష్‌ అండ్‌ పుల్‌ ఆపరేషన్‌ కోసం ఇంజిన్‌ రైలుకు కనెక్ట్‌ అయి ఉంటుంది. ఇది వేగంగా ప్రయాణించేందుకు వీలు కల్పిస్తుంది. ఏసీ వందే భారత్‌ రైళ్లలో అందించిన విధంగానే ఈ రైళ్లలోనూ మెరుగైన ఇంటీరియర్స్‌, బెస్ట్‌ ఇన్‌ క్లాస్ ప్యాసింజర్‌ సౌకర్యాలు సహా మెరుగైన ఫీచర్లు ఉండనున్నాయి. రైళ్లో ఫైర్‌ అలారం, ఎమర్జెన్సీ అలర్ట్‌, వందే భారత్‌ ఇంటీరియల్‌ డిజైన్‌తో కూడిన టాయిలెట్లు, మెరుగైన సీటింగ్‌ ఉంటుంది. ఈ రైళ్లలోకి సులభంగా ఎక్కేందుకు, దిగేందుకు డబుల్‌ లీఫ్‌ డోర్లు ఉంటాయి.

* హైదరాబాద్‌ నుంచి విశాఖ, హైదరాబాద్‌ నుంచి తిరుపతి వందే భారత్‌ రైళ్లు ఇప్పటికే సేవలు అందిస్తుండగా. హైదరాబాద్- బెంగళూరు మధ్య వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను త్వరలో నడపనున్నారు. ఈ రైలు సికింద్రాబాద్‌ నుంచి కాకుండా కాచిగూడ నుంచి సేవలు అందించే అవకాశం ఉంది. ఈ రైలును దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం నిర్వహణ బాధ్యతలు చూసే అవకాశం ఉంది. ఈ రైలు ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తున్నట్లు సమాచారం.

హైదరాబాద్‌- బెంగళూరు మధ్య నడిచే సాధారణ రైళ్లతో పోలిస్తే వందే భారత్‌ రైలు త్వరగా గమ్యస్థానానికి చేరుతుంది. ఈ రెండు నగరాల మధ్య దూరం 618 కి.మీ ఉండగా.. కేవలం 7-8 గంటల్లో గమ్యస్థానానికి చేరుకుంటుంది. అదే సాధారణ ఎక్స్‌ప్రెస్‌లు 11-12 గంటల సమయం తీసుకుంటాయి.

హైదరాబాద్‌- బెంగళూరు రైలు ఆంధ్రప్రదేశ్‌లని గుంతకల్లు జంక్షన్‌ మీదుగా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అలాగే కర్ణాటకలో సేడం, రాయచూర్‌ స్టేషన్లలో స్టాప్‌లు కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ రైలులో 16 కోచ్‌లు ఉంటాయి. వీటిలో రెండు ఎగ్జిక్యూటివ్‌, మిగిలిన 14 సాధారణ కోచ్‌లు ఉంటాయి. అయితే ఈ రైలు టిక్కెట్‌ ధర, ప్రారంభ తేదీపై స్పష్టత రావాల్సి ఉంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Wednesday, August 23, 2023, 16:32 [IST]
English summary
Indian railways plans to launch first non ac vande bharat train in october
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+