ICC ODI World Cup 2023 ఇండియా Vs పాక్ మ్యాచ్ కోసం వందే భారత్ స్పెషల్ రైళ్లు..!
యావత్ క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన ICC ODI World Cup 2023 అక్టోబర్ 5న ప్రారంభం అయింది. ఈ వరల్డ్‌కప్‌కు భారత్ పూర్తిస్థాయిలో ఆతిథ్యం ఇస్తోంది. నవంబర్ 19 వరకు మ్యాచ్‌లు జరగనున్నాయి. నాకౌట్ మ్యాచ్‌లతో కలిగి 48 మ్యాచ్‌లను జరగనుండగా.. అందులో 45 లీగ్ మ్యాచ్‌లున్నాయి.
తొలిరోజు (అక్టోబర్ 5) మ్యాచ్ గుజరాత్‌లోని అహ్మదాబాద్ నరేంద్రమోడీ స్టేడియంలో జరిగింది. వరల్డ్ కప్ 2023లో భాగంగా భారత్ తన తొలి మ్యాచ్‌ను ఆస్ట్రేలియాతో ఆడనుంది. అక్టోబర్ 8న ఈ మ్యాచ్ జరగనుంది. అయితే భారతీయులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ఇండియా Vs పాక్ మ్యాచ్ అక్టోబర్ 14న నరేంద్రమోడీ స్టేడియంలో జరగనుంది.

ఈ మ్యాచ్ కోసం భారీగా క్రికెట్ అభిమానులు తరలివచ్చే అవకాశం ఉంది. ఇందుకు అధికారులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నాయి. భారీగా ఫ్యాన్స్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మ్యాచ్ కోసం ప్రత్యేకంగా వందే భారత్ రైళ్లను (Vande Bharat Trains) నడపనున్నామని తెలిపింది.
కొన్ని నివేదకల ప్రకారం మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల నుంచి గుజరాత్ నరేంద్రమోడీ స్టేడియానికి వందే భారత్ ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే శాఖ భావిస్తోంది. ఫలితంగా మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు క్రికెట్ అభిమానులు స్డేడియానికి చేరుకుంటారని, అనంతరం సులభంగా తమ సొంత ప్రాంతాలకు వెళ్తారని భావిస్తోంది.

ప్రత్యేక వందే భారత్ సర్వీసుల కారణంగా ప్రయాణ, వసతి ఛార్జీల భారం అభిమానులపై పడకుండా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రత్యేక వందే భారత్ రైళ్లు సబర్మతి, అహ్మదాబాద్ స్టేషన్లలో నిలుస్తాయని, ఫలితంగా అక్కడ నుంచి సమీపంలోని నరేంద్రమోడీ స్టేడియానికి చేరుకోవచ్చని భావిస్తున్నారు.
వందే భారత్ ప్రత్యేక రైళ్లలో దేశభక్తి పాటలు సహా నాటి వరల్డ్ కప్‌నకు సంబంధించిన కొన్ని వీడియోలను రైళ్లలో ప్రదర్శించాలని భావిస్తోంది. ఫలితంగా ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరచాలని యోచిస్తోంది. 1983లో కపిల్ దేవ్ సారధ్యంలో టీమిండియా తొలిసారి వరల్డ్ కప్‌ను ముద్దాడింది. అనంతరం 2011లో మహీంద్రసింగ్ ధోనీ నేతృత్వంలో రెండోసారి వరల్డ్ కప్‌ను భారత్ తన ఖాతాలో వేసుకుంది. ఈసారి రోహిత్ సారధ్యంలో బరిలో నిలిచింది.

* వందే భారత్ స్లీపర్ వెర్షన్‌ను (Vande bharat sleeper version) ఫోటోలను సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. రైలు లోపలి భాగం ఫోటోలు ఆకట్టుకొనే విధంగా ఉన్నాయి. ఈ రైలు ప్రయాణికులకు 2024 నుంచి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. రైలు ఇంటీరియర్ అత్యంత శుభ్రంగా, సౌకర్యవంతంగా, విలాసవంతంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. లైటింగ్ వ్యవస్థ కూడా చాలా అధునాతనంగా ఉంది. బెర్త్‌ల మధ్య ఖాళీ కూడా సౌకర్యవంతమైన స్థాయిలో ఉంది.
ప్రస్తుతం ఉన్న సాధారణ రైళ్లకు ఈ వందే భారత్ స్లీపర్ ట్రైన్లు అదనంగా నడవనున్నాయి. రాత్రిపూట, దూర ప్రాంత ప్రయాణాలకు ఇవి ఈ హైస్పీడ్ రైళ్లు అనుకూలంగా ఉండనున్నాయి. ఈ రైళ్లు 16 బోగీలను కలిగి ఉంటాయి. గరిష్ఠంగా గంటకు 160 కి.మీ వేగంతో ప్రయాణించేలా వీటిని రూపొందిస్తున్నారు.
వందేభారత్ స్లీపర్ రైళ్లలో గరిష్ఠంగా 887 మంది ప్రయాణం చేయవచ్చు. మొత్తం 75 వందే భారత్ ర్యాక్‌లు చైర్ కార్ వెర్షన్‌గా మిగిలినవి స్లీపర్ వెర్షన్‌గా ఉండనున్నాయి. మొత్తం మూడు టెక్నాలజీల్లో 400 వందే భారత్ స్లీపర్ వెర్షన్‌లను తయారు చేసేందుకు భారీతీయ రైల్వే శాఖ ప్రణాళికలు వేస్తోంది. ఇందుకు టెండర్లను పిలిచినట్లు తెలుస్తోంది. దీనికి అదనంగా 2023-24 బడ్జెట్‌లో 8000 వందే భారత్ కోచ్‌లకు ప్రాతిపాదనలున్నాయి.


Click it and Unblock the Notifications








