ఇకపై ‘నో వెయిటింగ్ లిస్ట్'.. త్వరలో 3 వేల కొత్త రైళ్లు, రిజర్వ్ చేసుకున్న ప్రతి ఒక్కరికీ టికెట్ కన్ఫామ్.??
పండుగ వచ్చిందంటే చాలు.. రైల్వే స్టేషన్లు ఎంతగా కిటకిటలాడతాయో తెలిసిందే.. పండుగల సందర్భంగా రైల్వే శాఖ అదనంగా రైళ్లను ప్రవేశపెట్టినప్పటికీ బోగీలు ఇంకా జనంతో కిక్కిరిసిపోతూనే ఉంటాయి. ఈ పరిస్థితి రాకూడదనే చాలా మంది నెల రోజుల ముందుగానే టికెట్ బుక్ చేసుకుంటారు. అయినప్పటికీ వెయిటింగ్ లిస్ట్ వస్తూనే ఉంటుంది. అయితే ఇకపై ఆ సమస్య ఉండదు.
భారతీయ రైల్వే శాఖ(Indian Railway Department) తీపికబురు తీసుకువచ్చింది. వచ్చే ఐదేళ్లలో దేశంలో మరో 3,000 ప్యాసింజర్ రైళ్లను నడపాలని రైల్వే శాఖ యోచిస్తోంది. కొత్త రైళ్ల ద్వారా.. టికెట్ కన్ఫర్మేషన్ కోసం వేచి ఉండే అవసరం లేకుండా చేయాలని యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. పూర్తి సమాచారం ఈ కథనంలో..

ఇటీవల దీపావళి, ఛత్ పూజలో భాగంగా భారతీయ రైల్వే శాఖ 2,423 ప్రత్యేక రైళ్లను నడిపించింది. అయినప్పటికీ బీహార్, ఉత్తరప్రదేశ్ వెళ్లే రైళ్లు ప్రయాణికులతో రద్దీగా మారాయి. ఈ పరిస్థితి ఎలా ఉందంటే.. రైలు కోచ్‌ల దగ్గరకు రావడానికి కూడా ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. అప్పటికే రిజర్వ్ చేసిన టిక్కెట్ల కోసం లాంగ్ వెయిటింగ్ లిస్టు(Waiting List)తో పాటు జనరల్ టిక్కెట్ల కోసం స్టేషన్‌లో బారులు తీరారు.
ఈ పరిస్థితులను నివారించేందుకు 2027 నాటికి, రైల్వేలో ప్రస్తుతం ఉన్న రైళ్లకు అదనంగా దాదాపు 3,000(New Passenger Trains) కొత్త రైళ్లను చేర్చాలని రైల్వే శాఖ యోచిస్తోంది. అనుకున్న సమయానికి ఈ ప్రక్రియ పూర్తయితే.. ఇకపై టికెట్ రిజర్వ్ చేసుకున్న ప్రతి ప్రయాణీకుడికి కన్ఫర్మ్ టికెట్ లభిస్తుంది. ఇక వెయిటింగ్ లిస్ట్ ఉండదనే చెప్పవచ్చు.

కరోనా మహమ్మారికి ముందు, దేశవ్యాప్తంగా ప్రతిరోజూ 10,186 ప్యాసింజర్ రైళ్లు నడిచేవి. కాగా ప్రస్తుతం ఆ సంఖ్య 10,747కి చేరింది. ఈ క్రమంలో భారతీయ రైల్వే శాఖ సమాచారం ప్రకారం రోజుకు 1,30,000 మంది ప్రయాణికులకు రిజర్వేషన్ బెర్తులు అందించాలని భావిస్తోంది. అంతే కాకుండా కొత్త రైళ్ల ద్వారా ఏడాదికి ప్రయాణికుల సంఖ్య 800 కోట్ల నుంచి 1000 కోట్లకు పెరుగుతుందని అంచనా వేసింది.
కాగా తమ ప్యాసింజర్ రైళ్ల కోచ్ వ్యవస్థను అప్‌గ్రేడ్ చేయాలని యోచిస్తున్నట్లు కూడా భారతీయ రైల్వే వర్గాలు తెలిపాయి. కొత్త కాన్ఫిగరేషన్‌తో 22 కోచ్‌లతో కూడిన ప్రత్యేక రైళ్లను రూపొందించాలని యోచిస్తున్నట్లు రైల్వే టెక్నికల్ విభాగం నిపుణులు చెబుతున్నారు. దీనిని '22 కోచ్ ట్రైన్ సెట్' అని పిలుస్తారట.

భారత్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధిలో రైల్వే శాఖ పాత్ర చాలా కీలకం. రానున్న రోజుల్లో కొత్త రైళ్లను విడుదల చేయడాని రైల్వే శాఖ ప్లాన్ చేస్తుండటంతో.. సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు దీని ద్వారా పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరుతుంది. మధ్య తరగతి ప్రజలు ఈ సర్వీసును ఇంకా ఎక్కువగా సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంది. రిజర్వ్ చేసిన టిక్కెట్ల కోసం లాంగ్ వెయిటింగ్ లిస్ట్‌లను నివారించవచ్చు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








