భారీ మొత్తంలో ట్యాక్స్ చెల్లించిన ధోని: అసలేమైంది
భారతీయ క్రికెట్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న మహేంద్ర సింగ్ ధోని భారీ మొత్తంలో రాంచీ జిల్లా రవాణా కార్యాలయంలో తన హమ్మర్ ఎస్‌యువి మూలంగా భారీ స్థాయిలో జరిమానా చెల్లించాడు.
Also Read: అమితాబచ్చన్ కార్ల ప్రపంచంలోకి వచ్చి చేరిన మరొక కారు
ఈ కథనంతో మరోసారి రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ అంటే చట్టానికి అందరూ సమానులే అనే విషయం ఋజువైంది. ఇండియన్ క్రికెట్ స్టార్ అసలు అసలు ఇంత మొత్తంలో జరిమానా కట్టాల్సిన కారణం ఏంటో తెలుసా ? ఇతను జరిమానా కట్టడానికి గల కారణాలను పూర్తి వివరాలతో క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

ఎమ్ఎస్ ధోని వద్ద హమ్మర్ హెచ్2 అనే ఎస్‌యువి కలదు. కాని అతని సొంత నగరమైన రాంచీలోని రవాణా కార్యాలయంలో హమ్మర్ అనే పేరుకు బదులుగా స్కార్పియో అని తప్పుగా ప్రింట్ చేశారు. ఈ కారాణంగా ధోని వన్ టైమ్ ట్యాక్స్ మరియు జరిమానా చెల్లించాల్సి వచ్చింది.

ఇంపోర్టెడ్ వాహనాలకు నాలుగు శాతం ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయంలో ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే ధోని హమ్మర్ వాహనానం విలువ దాదాపుగా 75 లక్షల నుండ 1 కోటి రుపాయల మధ్య ఉంటుంది. కాబట్టి దీనికి గాను నాలుగు లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. మరియు స్కార్పియోకు 53,000 వరకు చెల్లించాల్సి ఉంటుంది.

రాంచీ రవాణా కార్యాలయ అధికారి మాట్లాడుతూ, ధోని 2009 లో హమ్మర్ అనే పేరుతో రిజిస్టర్ చేయించుకున్నాడు. అయితే 2012 లో ఆన్‌లైన్ అప్‌డేట్ చేసిన సమయంలో పొరుపాటుగా హమ్మర్‌కు బదులుగా స్కార్పియో అని టైపు చేసి ఉందని తెలిపాడు.

అయితే అలా పేరును మార్పిడి చేయడానికి ముందు అనగా 2011 లో ప్రభుత్వం వన్ టైం ట్యాక్స్ రూల్‌ను తీసుకువచ్చింది. 2011 కు ముందు ప్రతి ఏడాది కూడా ట్యాక్స్‌లు చెల్లించాల్సి వచ్చేది.

ధోని 2010 వరకు ప్రతి ఏడాది కూడా ట్యాక్స్ చెల్లించే వాడు. అయితే దీనిని ఆన్ లైన్ అప్‌డేట్ చేసే సమయంలో ధోని వద్ద ఉన్న హమ్మర్ కారు అక్కడ ఆప్షన్లలో లేదు ఎందుకంటే ఇది ఇంపోర్టెడ్ వెహికల్ కాబట్టి, కొంచెం తికమక పడ్డ డేటా ఎంట్రీ వ్యక్తి స్కార్పియోగా టైపు చేసినట్లు పత్రికా ప్రతినిధి తెలిపాడు.

కాబట్టి ధోని ఇప్పుడు వన్ టైం ట్యాక్స్ మరియు జరిమానా రెండూ కూడా చెల్లించాల్సి ఉంది.

34- సంవత్సరాల వయస్సున్న ధోని ఇండియన్ క్రికెట్ జట్టులో బెస్ట్ ఫినషర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ధోనికి సాధారణంగా బైకులు మరియు ఇంపోర్టెడ్ కార్లు అంటే అమితమైన ప్రేమ.

2015 ఫోర్బ్స్ వారి కథనం ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక పారితోషకం తీసుకుంటున్న ఆటగాళ్లలో ధోని 23 వ స్థానంలో ఉన్నాడు.

- రోహిత్ కూడా ఆలిస్టులో చేరిపోయాడు
- ఇటు వైపు కోహ్లి, అటు వైపు ఆలియా భట్ మరి అనుష్క ఎటువైపు
- సచిన్ టెండూల్కర్ దివ్య హస్తాల మీదుగా


Click it and Unblock the Notifications








