లక్షలు విలువ చేసే ఎస్‌యూవీలతో పొలాలు దున్నుతున్న రైతులు

కాస్త దుమ్ము ధూళి అంటుకుంటేనే సహించలేని కార్ల ప్రియులు తాము ఎంతగానో ఇష్టపడే వాహనాలను పొలాల్లోకి తీసుకెళుతున్నారు. తమ ఎస్‌యూవీలకు వెనుకాల మడకలను బిగించి ట్రాక్టర్లకు బదులుగా పొలాలను దున్నుతున్నారు.

By Anil Kumar

ఇండియాలో ఆటోమొబైల్ ఔత్సాహికుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది అనడానికి చక్కటి ఉదాహరణ ఇవాళ్టి కథనం. ఎందుకు అంటారా...? కాస్త దుమ్ము ధూళి అంటుకుంటేనే సహించలేని కార్ల ప్రియులు తాము ఎంతగానో ఇష్టపడే వాహనాలను పొలాల్లోకి తీసుకెళుతున్నారు. తమ ఎస్‌యూవీలకు వెనుకాల మడకలను బిగించి ట్రాక్టర్లకు బదులుగా పొలాలను దున్నుతున్నారు.

లక్షలు విలువ చేసే ఎస్‌యూవీలతో పొలాలు దున్నుతున్న రైతులు

ఇక్కడో మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... ఏ ఎస్‌యూవీ కూడా మొరాయించకుండా ట్రాక్టర్లకు ధీటుగా పొలాలను దున్నుతున్నాయి. మరి ఈ జాబితాలో ఏయే ఎస్‌యూవీలు ఉన్నాయో... ఓ లుక్కేసుకుందాం రండి....

లక్షలు విలువ చేసే ఎస్‌యూవీలతో పొలాలు దున్నుతున్న రైతులు

మహీంద్రా థార్

ఇండియాలో ఉన్న మోస్ట్ పాపులర్ ఆఫ్ రోడింగ్ వెహికల్స్‌లో మహీంద్రా థార్ ఒకటి. తారు రోడ్ల మీద కాకుండా, మట్టి రోడ్లు మరియు పల్లె ప్రాంతాల్లో వీటి పనితీరు అద్భుతంగా ఉంటుంది. అందుకే చాలా సినిమాల్లో థార్ వాహనాన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఓ రైతు తన థార్ వాహనానికి వెనుక వైపున మడకలు బిగించి అత్యంత కఠినమైన పొలాలను దున్నాడు.

లక్షలు విలువ చేసే ఎస్‌యూవీలతో పొలాలు దున్నుతున్న రైతులు

మహీంద్రా థార్ ఆఫ్ రోడింగ్ వెహికల్‌లో సాంకేతికంగా2.5-లీటర్ కెపాసిటి గల టుర్భోఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్ ఉంది. గరిష్టంగా 105బిహెచ్‌పి పవర్ మరియు 247ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో 4X4 డ్రైవ్‌ సిస్టమ్ కూడా ఉంది.

మహీంద్రా థార్ వాహనంతో పొలాలను దున్నడం అంటే నమ్మలేకపోయారు కదూ... ఇక్కడున్న వీడియో మీద ఓ లుక్కేసుకోండి....

లక్షలు విలువ చేసే ఎస్‌యూవీలతో పొలాలు దున్నుతున్న రైతులు

మిత్సుబిషి మోంటెరో

ఇండియాలో అత్యంత ఖరీదైన లగ్జరీ ఎస్‌యూవీలలో మిత్సుబిషి మోంటెరో ఒకటి. దీని ధర సుమారుగా కోటి రుపాయలుగా ఉంది. అయితే, పంజాబ్‌కు చెందిన ఓ రైతు తన మిత్సుబిషి మోంటెరో లగ్జరీ ఎస్‌యూవీతో వరి మడులను దున్నాడు.

లక్షలు విలువ చేసే ఎస్‌యూవీలతో పొలాలు దున్నుతున్న రైతులు

జపాన్ దిగ్గజం మిత్సుబిషి విక్రయించిన అత్యంత అరుదైన లగ్జరీ ఎస్‌యూవీలలో మిత్సుబిషి మోంటెరో ఒకటి. సాంకేతికంగా ఇందులో 3.2-లీటర్ కెపాసిటి గల డీజల్ ఇంజన్ ఉంది. ట్రాక్టర్లు పోటీగా బురదతో కూడిన వరి మడులను దున్నిన మోంటెరో గరిష్టంగా 189బిహెచ్‌పి పవర్ మరియు 441ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

సాధారణ పొలాలు అంటే నమ్మచ్చు, కానీ వరి నాట్లు వేసే మడులను కూడా లగ్జరీ ఎస్‌యూవీలతో దున్నుతున్నారు అంటే నమ్మబుద్ది కావడం లేదు కదా....? అయితే ఖచ్చితంగా ఈ వీడియో చూడాల్సిందే...

లక్షలు విలువ చేసే ఎస్‌యూవీలతో పొలాలు దున్నుతున్న రైతులు

మహీంద్రా స్కార్పియో

స్కార్పియో ఎస్‌యూవీ విడుదలతో ఎస్‌యూవీల విభాగంలో మహీంద్రా పేరు మారుమ్రోగిపోయింది. అర్బన్ మరియు రూరల్ ఏ ప్రాంతంలోనైనా స్కార్పియోకు ఉన్న అభిమానులు సంఖ్య అంతా ఇంత కాదు. విదేశీ దిగ్గజాలు పోటీతో స్కార్పియో మీద డిమాండ్ కాస్త తగ్గినా కూడా ఇప్పటికీ స్పార్పియో ఎవర్‌గ్రీన్ మోడల్. కొత్త తరం స్కార్పియో ఎస్‌యూవీకి మడకలను చేర్చి పొలాల మీద ఆఫ్ రోడింగ్ చేశారు.

లక్షలు విలువ చేసే ఎస్‌యూవీలతో పొలాలు దున్నుతున్న రైతులు

శక్తివంతమైన మహీంద్రా స్కార్పియో ఎస్‌యూవీలో 2.2-లీటర్ కెపాసిటి గల ఎమ్‌హాక్ డీజల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 120బిహెచ్‌పి పవర్ మరియు 280ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. స్కార్పియోలో కూడా 4X4 డ్రైవ్‌ సిస్టమ్ ఉంది.

డీసెంట్ ఎస్‌యూవీ పొలాలను ఎలా దున్నింది అనుకుంటున్నారా....? బుర్రకు పదును పెట్టడం మానేసి ఓసారి ఈ వీడియో వీక్షించండి.

లక్షలు విలువ చేసే ఎస్‌యూవీలతో పొలాలు దున్నుతున్న రైతులు

టయోటా ఫార్చ్యూనర్

ఇండియన్ మార్కెట్లోకి పరిచయమైనప్పటి నుండి టయోటా ఫార్చ్యూనర్ ఏకఛత్రాధిపత్యం వహిస్తోంది. 7-సీటర్ ప్రీమియం ఎస్‍‌యూవీ ఎంతో మంది కస్టమర్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దేశీయంగా టయోటా కిర్లోస్కర్ అత్యధికంగా సాధిస్తున్న ఫలితాల్లో ఫార్చ్యూనర్ వాటా కీలకంగా ఉంది.

లక్షలు విలువ చేసే ఎస్‌యూవీలతో పొలాలు దున్నుతున్న రైతులు

లగ్జరీకి ఏ మాత్రం తీసిపోని టయోటా ఫార్చ్యూనర్ వ్యవసాయ పరికరంతో పొలంలో దున్నిన నేలను చదును చేస్తోంది. సాంకేతికంగా ఫార్చ్యూనర్ పాత వెర్షన్ ఎస్‌యూవీలో 169బిహెచ్ పవర్ మరియు 343ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేసే 3.0-లీటర్ డీజల్ ఇంజన్ కలదు. ఇందులో షిఫ్ట్-ఆన్ ఫ్లై ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ ఉంది.

పొలాన్ని చదును చేస్తున్న టయోటా ఫార్చ్యూనర్‌ను ఇక్కడున్న వీడియోలో వీక్షించగలరు...

లక్షలు విలువ చేసే ఎస్‌యూవీలతో పొలాలు దున్నుతున్న రైతులు

టాటా సఫారీ స్టార్మ్

టాటా మోటార్స్ తమ అత్యంత శక్తివంతమైన సఫారీ ఎస్‌యూవీని లైనప్‌ నుండి తొలగించింది. అయినప్పటికీ, ఇండియన్ కస్టమర్ల మదిలో ఇప్పటికే అలాగే నిలిచిపోయింది. సఫారీ స్టార్మ్ ఎస్‌యూవీని అమితంగా ఇష్టపడే ఓ రైతు తన వాహనంతో పొలాలను దున్ని, సఫారీ ఆఫ్ రోడ్ సామర్థ్యాలను వీడియోలో బంధించి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాడు.

లక్షలు విలువ చేసే ఎస్‌యూవీలతో పొలాలు దున్నుతున్న రైతులు

టాటా సఫారీ ఎస్‌యూవీలో వారికోర్ 400 ఇంజన్ ఉంది. సాంకేతికంగా ఇందులో ఉన్న 2.2-లీటర్ ఇంజన్ డీజల్ ఇంజన్ గరిష్టంగా 154బిహెచ్‌పి పవర్ మరియు 400ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. సఫారీ ఎస్‌యూవీ కేవలం రియర్ డ్రైవ్‌తో మాత్రమే కాకుండా, ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌లో కూడా లభించింది.

టాటా సఫారీ పొలాలను దున్నడాన్ని ఇక్కడున్న వీడియో ద్వారా వీక్షించగలరు...

Most Read Articles

English summary
Read In Telugu: Indian SUVs that replaced tractors: Mahindra Scorpio to Toyota Fortuner [Video]
Story first published: Monday, June 11, 2018, 18:07 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X