రోడ్లపై రారాజులు.. సానియా మీర్జా లగ్జరీ కార్ల కలెక్షన్ చూసి షాక్ అవ్వాల్సిందే!
హైదరాబాద్‌కు చెందిన సానియా మీర్జా(Sania Mirza) భారతదేశపు అత్యంత ప్రతిభావంతమైన, విజయవంతమైన టెన్నిస్ క్రీడాకారిణిగా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. టెన్నిస్‌లో అనేక రికార్డులు సృష్టించడంతో పాటు, దేశం తరపున అనేక విజయాలు కూడా సాధించింది. సింగిల్స్, డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్‌లో అనేక విజయాలను సాధించారు. 2023లో టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పిన సానియా 15 సంవత్సరాల క్రితం ఇస్లామిక్ ఆచారాల ప్రకారం పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను వివాహం చేసుకుంది. వారికి ఒక కుమారుడు ఉన్నాడు, అయితే పలు కారణాల వలన వారిద్దరు విడాకులు తీసుకుని ప్రస్తుతం ఎవరి జీవితం వారు గడుపుతున్నారు. సానియా మీర్జా దేశంలో ప్రముఖ సెలబ్రిటీలలో ఒకరు. ఆమె లగ్జరీ లైఫ్ ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఆటల ద్వారా కాకుండా వివిధ కంపెనీలకు యాడ్స్ చేయడం ద్వారా బాగానే సంపాదిస్తుంది.
ఆమెకు లగ్జరీ కార్లలో తిరగడం అంటే చాలా ఇష్టం. సానియా మీర్జా గ్యారేజీలో చాలా కార్స్ ఉన్నాయి. వీటిలో కోట్లు విలువ చేసే టాప్ బ్రాండ్‌లకు చెందిన విలాసవంతమైనివి ఉన్నాయి. సానియా మీర్జా కార్ కలెక్షన్ గురించి చూసినట్లయితే రేంజ్ రోవర్, bmw వంటి పలు కంపెనీ కార్లను తన గ్యారేజీలో పెట్టుకుంది. ఆమె దగ్గర ఉన్న కొన్ని అత్యంత విలాసవంతమైన కార్ల వివరాలను కింది కథనంలో అందించడం జరిగింది.

ఆమె వద్ద BMW 7 సిరీస్ కారు ఉంది. దీని ధర రూ. 1.70 కోట్లు. ఆన్‌రోడ్ వచ్చే సరికి మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ కారు ఈమె వద్ద మాత్రమే కాకుండా దేశంలో చాలా మంది సెలబ్రిటీలు కూడా దీన్ని వాడుతున్నారు. దీనితో పాటు సానియా దగ్గర రేంజ్ రోవర్ ఎవోక్ (range rover evoque) కూడా ఉంది. దీని ధర రూ. 72.09 లక్షలు (ఎక్స్ షోరూమ్).
ఎవోక్ పెట్రోల్ , డీజిల్ ఇంజన్ ఎంపికలతో లభిస్తుంది. మరో లగ్జరీ కారు జాగ్వార్ XE కూడా ఆమె కలెక్షన్స్‌లో కనిపిస్తుంది. దీని ధర వచ్చేసి రూ. 46.64 లక్షలు. ఇది ఎక్స్ షోరూమ్ ధర. ఆన్‌రోడ్ వచ్చేసరికి మరింత ఎక్కువగా ఉంటుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 250 కిమీలుగా ఉంది. ఇది 8 స్పీడ్ ఆటోమెటిక్ ట్రాన్స్‌మిషన్‌లో లభిస్తుంది. దీని మైలేజ్ 12.6 కి.మీల వరకు వస్తుంది.

ఇవి మాత్రమే కాకుండా ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ పోర్స్చే (porsche)కు చెందిన కయెన్(Cayenne) కారు కూడా ఉంది. ఇండియాలో దీని ప్రారంభ ధర రూ. 1.42 కోట్ల నుంచి రూ. 2 కోట్ల వరకు ఎక్స్-షోరూమ్ వరకు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. దీని టాప్ స్పీడ్ వచ్చేసి గంటకు 270 కిమీలుగా ఉంటుంది. ఇది అత్యంత శక్తివంతమైన ఇంజిన్‌ను అందించారు.
అలాగే ఆమె వద్ద మెర్సిడెస్-బెంజ్ ఎస్ క్లాస్ కూడా ఉంది. ఈమె కార్ల విలువే దాదాపు రూ.3 కోట్లకు పైనే ఉంటుంది. సానియా మీర్జా తన అవసరాల మేరకు తనకు నచ్చిన కారును వాడుతుంటారు. సాధారణంగా సెలబ్రిటీలు చాలా కార్లను కలిగి ఉంటారు. మార్కెట్లోకి ఏదైనా కొత్త విడుదల అయిందంటే చాలా వాటి గురించి వాకబు చేసి తమకు నచ్చినట్లయితే వెంటనే సొంతం చేసుకుంటారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








