నాలుగేళ్లుగా కారులోనే నివాసం.. చివరకు ఆ వార్త బయటకు రావడంతో..
కొన్నిసార్లు వైరల్ వీడియోలు, వార్తలు కొంత మందిని బాగా పాపులర్ చేస్తాయి, కొంతమందిని ఓవర్‌నైట్ స్టార్స్‌ను చేస్తాయి. మరికొన్నిసార్లు ఆపదలో ఉన్నవారికి లేదా సాయం కోసం ఎదురుచూసేవారిని ఆదుకొనేందుకు ఓ దారిని చూపిస్తాయి. దుబాయ్‌లో నాలుగేళ్లుగా కారులోనే నివాసం ఉన్న భారత సంతతికి చెందిన మహిళ అవస్థలపై కొన్ని వీడియోలు, ఫోటోలు వైరల్ కాగా దాతల సాయంతో ఆమె కథ సుఖాంతం అయింది. ఇంతకీ ఎవరా మహిళా.. ఏంటా కథా. ?
భారత సంతతికి చెందిన ప్రియా సుమారు 40 సంవత్సరాలుగా దుబాయ్‌లో నివాసం ఉంటున్నారు. ప్రియా తల్లిదండ్రులు వ్యాపారవేత్తలు కావడంతో దుబాయ్‌లో జీవితం చాలా సుఖంగా గడిచింది. అయితే ఓ రోజు ప్రియా తండ్రి ఆకస్మాత్తుగా మృతిచెందారు. అనంతరం ఆమె తల్లి ఆరోగ్యం కూడా చెడిపోయింది, ఫలితంగా చాలా ఏళ్లు మంచానికే పరిమితం అయింది.

తల్లి చికిత్స కోసం ప్రియా చాలా ఖర్చుచేసింది. అయినా ఫలితం లేకపోయింది. చికిత్స తీసుకుంటూనే ఆమె తల్లి మరణించింది. అదే సమయంలో వ్యాపారం కూడా బాగా దెబ్బతింది. ఆర్థిక కష్టాలు ప్రియాను చుట్టుముట్టాయి. అంతలో ప్రియా వీసా గడువు కూడా ముగిసింది. కానీ కొన్ని న్యాయపరమైన కారణాలతో ఆమె దుబాయ్‌లోనే ఉండిపోవాల్సి వచ్చింది. పూర్తిగా ఆర్థిక పరిస్థితి దెబ్బతినడం, రోజు గడవడం కష్టంగా మారింది.
దీంతో తన హోండా సిటీ కారులోనే తన రెండు పెంపుడు కుక్కలతో కలిసి నివాసం ఉండేది. ఆ సమయంలో ప్రియా.. ఇతరుల ఇళ్లలో పనిమనిషిగా పనిచేశారు. అప్పట్లో ఆమెకు కేవలం 500 దిర్హామ్ మాత్రమే సంపాదించేది. వీసా లేకుండా నాలుగేళ్లుగా దుబాయ్‌లో ఉన్న కారణంగా అక్కడి ప్రభుత్వం ప్రియాకు భారీ జరిమానా విధించింది. ఈ మహిళ దీనస్థితికి సంబంధించిన వార్తలు బయటకు రాగానే చాలా మంది స్పందించారు.
దుబాయ్‌లో సెటిల్ అయిన భారత సంతతికి చెందిన మహిళా వ్యాపారవేత్త, కార్ ఫేర్ గ్రూప్ ఎండీ జెస్‌బీర్ బస్సీ ప్రియాకు సాయం చేసేందుకు ముందుకువచ్చారు. ఆమె పూర్తి వివరాలు తీసుకొని, సంస్థ కార్యాలయానికి ఆహ్వానించారు. అక్కడి ప్రభుత్వం విధించిన జరిమానా సహా మరికొంత నగదును అంటే 26 లక్షల విలువైన (భారత్ కరెన్సీలో) చెక్‌ను అందించారు.
అప్పటికే మూడు డిగ్రీలు కలిగి ఉన్న ప్రియకు తన కంపెనీలోనే మంచి ఉద్యోగం ఇచ్చారు. మరియు కంపెనీ నుంచి కారును సైతం ఆఫర్ చేశారు. ఆర్థిక సాయం, ఉద్యోగం ఇచ్చినందుకు జెస్‌బీర్ బస్సీకు ప్రియా ధన్యవాదాలు తెలిపారు. కానీ తనకు ఇచ్చిన కారును మాత్రం ఆమె తిరస్కరించారు.
తాను నాలుగేళ్లు నివాసం ఉన్న హోండా సీటీ కారును విక్రయించడం, అప్‌గ్రేట్ చేసేందుకు ప్రియా అంగీకరించలేదు. ఆ కారుతో తనకు, తల్లికి ఎంతో అనుబంధం ఉందని చెప్పారు. అయితే పరిస్థితులు అంతా సర్దుకున్నాక భారత్‌కు వెళ్లాలని, తన తల్లి ఆస్తికల బూడిదను అక్కడున్న పవిత్ర నదిలో నిమజ్జనం చేయాలని అనుకున్నట్లు ప్రియా తెలిపారు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








