మహీంద్రా స్కార్పియో N కారులో ఆస్ట్రేలియా టూర్‌.. గ్రేట్‌ వాల్‌ చైనాకు చేరుకున్న యువకులు, ఆకట్టుకుంటున్న వీడియో

తాజాగా కొంతమంది యువకులు మహీంద్రా స్కార్పియో ఎన్(Mahindra Scorpio N) కారులో రోడ్డు మార్గంలో భారత్‌ నుంచి ఆస్ట్రేలియాకు బయలుదేరారు. ఈ సాహస యాత్రలో భాగంగా వారు ది గ్రేట్‌ వాల్‌ చైనాను దాటారు. కారులో అంతదూరం వెళ్లడమేంటని అనుకుంటున్నారా.. పూర్తి సమాచారం ఈ కథనంలో..

ఇటీవల కాలంలో చాలా మంది తమ జీవితంలో కొత్తదనం కోసం వినూత్న చర్యలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా సాహస యాత్రలు, లాంగ్‌ జర్నీలు. అంటే విదేశాలకు విమానాల్లో కాకుండా కార్లలో ఒక బృందంగా బయదేరుతూ వేల కిలోమీటర్లు ప్రయాణిస్తున్నారు. యువత మొదలుకొని 50 దాటిన వారు కూడా ఇలా సుదూర ప్రయాణాలను కార్ల ద్వారా ప్రారంభించారు. ఈ క్రమంలోనే కొందరు భారతీయ యువకులు తమ స్కార్పియో ఎన్ కార్లలో ఆస్ట్రేలియాకు బయలుదేరారు.

Mahindra-Scorpio-N-Great-Wall-Of-China-Australia-Tour

భారత్‌ నుంచి ఆస్ట్రేలియాకు(Australia Tour Mahindra Scorpio N) రోడ్డు మార్గంలో ప్రయాణించే వారు మధ్యలో అనేక దేశాల గుండా వెళ్లాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే వారు తమ స్కార్పియో ఎన్ కారులో చైనాలోకి ప్రవేశించింది. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా దగ్గర తమ కారును ఆపారు. ఆ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతోంది.

భారతదేశం నుండి చైనా రాజధాని బీజింగ్ వైపు ప్రయాణించడం ద్వారా లేదా మరొక మార్గంలో ప్రయాణించడం ద్వారా గ్రేట్ వాల్ ఆఫ్ చైనా(Great Wall Of China Mahindra Scorpio N)ను చేరుకోవచ్చు. వీళ్లు బీజింగ్ వెళ్లాల్సిన అవసరం లేకపోవడంతో ఇతర మార్గాల ద్వారా ఆ ప్రాంతానికి వెళ్లారు. ప్రపంచంలోని గొప్ప అద్భుతాలలో ఒకటైన గ్రేట్ వాల్ చైనాకు ఉత్తర భాగంలో ఉంది.

Mahindra-Scorpio-N-Great-Wall-Of-China-Australia-Tour

ఈ కారణంతోనే వారు తమ స్కార్పియో N కారును ఆస్ట్రేలియాకు వ్యతిరేక దిశలో చాలా గంటల పాటు నడిపారు. కేవలం గ్రేట్ వాల్ ఆఫ్ చైనాను చూడటానికి ఎక్కువ సమయం తీసుకున్నారు. దీంతో గ్రేట్ వాల్ ఆఫ్ చైనాను చేరిన మొదటి మహీంద్రా స్కార్పియో ఎన్‌గా నిలిచింది.

Mahindra-Scorpio-N-Great-Wall-Of-China-Australia-Tour

అనంతరం గ్రేట్ వాల్ వద్దకు చేరుకున్న తర్వాత, యువకులు కారును ఒక వైపు ఆపి, ఆ గోడ వెంట కొద్ది దూరం నడిచి ఆ అద్భుతాలను ఆస్వాదించారు. అంతే కాకుండా కొన్నేళ్ల క్రితం రోడ్డు మార్గంలో ఇంగ్లండ్‌కు కూడా వెళ్లారు. ప్రస్తుతం వారు బ్లాక్‌ కలర్‌ స్కార్పియో ఎన్ కారులో ఆస్ట్రేలియాకు బయలుదేరుతున్నారు.

Mahindra-Scorpio-N-Great-Wall-Of-China-Australia-Tour

చైనా మీదుగా ఆస్ట్రేలియాకు వెళ్తున్న ఈ యువకులు తమ స్కార్పియో ఎన్ కారులో నేపాల్, టిబెట్, లావోస్, మయన్మార్, వియత్నాం, కంబోడియా, థాయ్‌లాండ్, మలేషియా, సింగపూర్, ఇండోనేషియా మీదుగా వెళ్తున్నట్లు వీడియోలో పేర్కొన్నారు. అంటే ఇండోనేషియా మీదుగా ఆస్ట్రేలియాలో అడుగుపెట్టాలనేది వీరి ప్రణాళిక

అయితే ఇండోనేషియా మరియు ఆస్ట్రేలియాలను కలిపే ల్యాండ్ బ్రిడ్జ్ లేకపోవడంతో.. వారు ఇండోనేషియా నుంచి ఓడ ద్వారా ఆస్ట్రేలియాలోకి ప్రవేశించవలసి ఉంటుంది. ఈ మొత్తం ప్రయాణానికి వారు 110 రోజుల పాటు ప్రణాళిక వేసుకున్నారు. అంటే దాదాపు 4 నెలల సమయం పడుతుంది. ఈ యాత్రకు వారు ఎంచుకున్న కారు మహీంద్రా స్కార్పియో-ఎన్ శక్తివంతమైన ఇంజన్ ఎంపికలను అందించడంతో వారు ఈ కారులో బయలుదేరారు.

More from DriveSpark

Article Published On: Thursday, February 1, 2024, 9:33 [IST]
English summary
Indian youth australia tour in mahindra scorpio n reached great wall of china
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+