కాలం మారింది.. ఫీచర్ల కంటే సేఫ్టీ రేటింగ్ ఎక్కువ ఉన్న కార్లను మాత్రమే కొంటున్న జనాలు.. కారణాలివే!
కారు కొనేముందు ప్రతి ఒక్కరూ అది ఎంత మైలేజ్ అందిస్తుంది. దాని ఇతర ఫీచర్లను ఆధారంగా కొనాలా వద్దా అని డిసైడ్ అయ్యేవారు. కానీ ఇప్పుడు కాలం మారుతున్నా కొద్ది ఆలోచన విధానంలోనూ మార్పులు వస్తున్నాయి. తాజాగా స్కోడా ఆటో ఇండియా, ఎన్ఐక్యూ బేస్ నిర్వహించిన సర్వే ప్రకారం కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఆ వివరాలు మీకోసం..
ఈ సర్వే ప్రకారం భారతదేశంలో ప్రతి 10 మంది వినియోగదారులలో 9 మంది భద్రతా రేటింగ్ ఎక్కువగా ఉన్న కార్లను ఇష్టపడుతున్నారని వెల్లడైంది. స్కోడా ప్రస్తుతం భారతదేశంలో తన కంపెనీ ఫోర్ట్‌పోలియోలో స్లావియా, కొడియాక్ మరియు కుషాక్ కార్లను విక్రయిస్తోంది. వీటిలో స్లావియా, కుషాక్ లు గ్లోబల్ ఎన్సీఏపీ ప్రకారం 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందాయి. భారతదేశం అంతటా స్కోడా ఈ ఉత్తమ భద్రతా కలిగి ఉన్న కార్లను విక్రయిస్తోంది.

రోడ్డు ప్రమాదాల కారణంగా భారతదేశంలో ఏటా 1.5 లక్షల మంది బలైపోతున్నారు. అంటే సగటున రోజుకు 1130 ప్రమాదాలు, 422 మరణాలు, లేదా గంటకు 47 ప్రమాదాలు, 18 మరణాలు సంభవిస్తున్నాయి. స్కోడా 18-54 ఏళ్ల మధ్య వయస్కులపై సర్వే నిర్వహించింది. దీని ప్రకారం భారత్ లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుండటంతో ఈ పరిణామం చోటు చేసుకుందని సర్వే వెల్లడించింది.
ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 18-54 ఏళ్ల మధ్య వయస్కులు ఉండగా, వారిలో 80 శాతం మంది పురుషులు, 20 శాతం మంది మహిళలు పాల్గొన్నారు. రూ.67 లక్షలకు పైబడిన కారును కలిగి ఉన్న ప్రస్తుత కార్ల యజమానులు 5 శాతం మంది ఉండగా, 33 శాతం మంది సొంత కార్లు కలిగి లేరని, వచ్చే ఏడాదిలో వారు కార్లను కొనుగోలు చేయాలనుకుంటున్నారని తెలిపింది.
సర్వేలో పాల్గొన్న వారిలో 92 శాతం మంది 22.2 శాతం మంది 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ ను ఇష్టపడే క్రాష్ టెస్ట్ కార్లను ఇష్టపడుతున్నారని వివరించింది. 21.3 శాతం మంది 4-స్టార్ రేటింగ్ ను ఇష్టపడుతుండగా, రేటింగ్ లేని కార్లను కొనుగోలు చేస్తున్న వారి శాతం కేవలం 6.8 శాతం మాత్రమే అని పేర్కొంది. వచ్చే ఏడాదిలో కార్లను కొనుగోలు చేయాలనుకునే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుందని తెలిపింది.
సర్వేలో 47.6 శాతం మంది వాహనంలో అందించే ఫీచర్ల కంటే భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. 30 శాతం మంది ఒంటరిగా కూర్చునే చిన్నారి/వెనుక కూర్చున్న ప్రయాణికుడి భద్రత అత్యంత ముఖ్యమని అభిప్రాయపడ్డారు. కారు మైలేజ్ పై 15 శాతం స్కోర్ రావడంతో కస్టమర్ల డిమాండ్లు తగ్గాయి.
భారతదేశంలో ప్రామాణిక క్రాష్ టెస్ట్ రేటింగ్ వ్యవస్థ లేనప్పటికీ, ప్రభుత్వం ఇటీవలి సంవత్సరాలలో అనేక ఫీచర్లను ప్రామాణికంగా చేయడం ద్వారా కారు భద్రతను కొనుగోలు దారులు పరిశీలిస్తున్నారు. త్వరలోనే భారత్ ఎన్సీఏపీ పేరుతో సొంత సేఫ్టీ రేటింగ్ సిస్టంను అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు గ్లోబల్ ఎన్సీఏపీ వంటి స్వతంత్ర సంస్థలు అందించే క్రాష్ టెస్ట్ రేటింగ్స్‌పై ఆధారపడాల్సి ఉంటుంది.
ఏది ఏమైనప్పటికీ సేఫ్టీకీ ప్రజలు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. దీనికి తగినట్లుగానే ఉత్పత్తి సంస్థలు కార్లను రూపొందిస్తున్నాయి. కొన్ని కంపెనీల కార్లు క్రాష్ టెస్ట్‌లను విజయవంతంగా ఎదుర్కొంటుండగా కొన్ని కార్లు క్రాష్ టెస్ట్‌లో చితికిలపడిపోతున్నాయి. తాజా సర్వే ద్వారా ప్రయాణికుల భద్రతే ప్రధానం అనే విషయం తేటతెల్లమైంది.


Click it and Unblock the Notifications








